Copy right Act
-
ప్రముఖ కమెడియన్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీ. దీంతో కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. స్టాండ్-అప్ కమెడియన్ వీర్ దాస్, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అసలు కారణం ఏమిటంటే?: బాలీవుడ్ నిర్మాత అశ్విన్ గిద్వానీతో అక్టోబర్ 2010లో ఒక షోను నిర్మించేందుకు వీర్ దాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే జనవరి 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వీర్ దాస్ కొత్త షో ప్రోమోను గిద్వానీ చూశారు. అందులోని కంటెంట్‌లో తన షో నుంచి కొన్ని మార్పులు చేసి కాపీ కొట్టారని నిర్మాత గిద్వానీ అరోపిస్తున్నారు. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నవంబర్ 4న కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని..కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, భారతదేశాన్ని ప్రపంచానికి చెడుగా చూపుతుందని ఆరోపిస్తూ వీర్ దాస్ ప్రదర్శనను రద్దు చేయాలని కోరుతూ 'హిందూ జనజాగృతి సమితి' సైతం సోమవారం బెంగళూరులోని పోలీసులను ఆశ్రయించింది. గతేడాది కూడా దాస్ వీడియోలపై కొందరు పోలీసు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హాస్యనటుడు తన వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా లేవని ఒక ప్రకటన విడుదల చేశాడు. -
కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సాంగ్స్ ప్లే చేశారంటూ మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ మేనేజర్ ఎం నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాతో పాటు.. భారత్ జోడో యాత్ర ప్రచార ట్విటర్ హ్యాండిల్‌ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
చిక్కుల్లో 'కాంతార' టీం.. లీగల్ నోటీసులు! ఎందుకంటే..
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది.హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించిన కాంతార మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కథ పరంగానే కాదు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పాట బాణీని కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా నెటిజన్లను విజ్ఞప్తి చేసింది. కాంతారలోని వరాహ రూపం పాట మా సాంగ్ నవసరను కాపీ కొట్టారు. ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేశారు. దీనికి ర్మాత విజయ్ కిరగందూర్, సినిమా హీరో & దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ట్యాగ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై కాంతార టీం ఇంకా స్పందిచలేదు. View this post on Instagram A post shared by Thaikkudam Bridge (@thaikkudambridge) -
సుందర్ పిచాయ్‌పై పోలీస్ కేసు
Police Complaint Against Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై బుధవారం పోలీస్ కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాపీరైట్ యాక్ట్ వయొలేషన్ కింద ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్ ఓనర్ కంపెనీ అయిన ‘గూగుల్’ ప్రతినిధుల పేర్లతో(సుందర్ పిచాయ్ ఇతరులు) ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదుధారి సునీల్ చెప్తున్నారు. ఇల్లీగల్ అప్లోడింగ్ విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా 2017లో రిలీజ్ అయ్యింది. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా ప్రమోట్ చేసుకున్న ఈ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచింది. అయితే అదొక బీ గ్రేడ్ సినిమా అని, దీని మీద కూడా ఆ దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే. -
గూగుల్‌కు షాక్: ఫ్రాన్స్ భారీ జరిమానా
సెర్చింగ్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్ న్యూస్ విషయంలో కాపీరైట్ నిబంధనల ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించింది ఫ్రాన్స్. ప్యారిస్: ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ మంగళవారం గూగుల్(ఆల్ఫాబెట్స్ గూగుల్)కు భారీ జరిమానా విధించింది. ఈయూ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం.. స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్‌న్యూస్ వాడుకుంటోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ రూ.4,415 కోట్లకు పైనే. గూగుల్ న్యూస్‌లో తమ వెబ్సైట్లకు చెందిన కంటెంట్‌ను అనుమతి లేకుండా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ.. గూగుల్ నిర్లక్క్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది. అంతేకాదు కాపీరైటెడ్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని, లేని పక్షంలో రోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
Sushant Singh Rajput: సుశాంత్ తండ్రికి దక్కని ఊరట
న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుశాంత్ జీవితం ఆధారంగా ఎవరినీ సినిమాలు తియ్యనీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం అందులోని వివరణను పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం, మరణం గురించి దాదాపుగా అన్ని మీడియా హౌజ్‌ల ద్వారా జనాలకు తెలిసిపోయింది. ఈ తరుణంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అనే ప్రస్తావన ఉండకపోవచ్చనే జస్టిస్ సంజీవ్ నరులా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు తన కొడుకు విషయంలో కిషోర్ సింగ్ ప్రస్తావించిన ‘ పబ్లిసిటీ రైట్’ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆ హక్కు సెలబ్రిటీ చనిపోయాక ఉంటుందా? ఉండదా? అనే విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, అంతమాత్రాన సినిమా తీస్తే ప్రైవసీకి భంగం కలిగించినట్లు కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. రిలీజ్ తర్వాత రండి ఇదిలా ఉండగా సుశాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘న్యాయ్ ది జస్టిస్’ ఇవాళ(శుక్రవారం) రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే కృష్ణ కిషోర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు సుశాంత్ లైఫ్ ఆధారంగానే ‘సూసైడ్ ఆర్ మర్డర్’, ‘ఎ స్టార్ వాజ్ లాస్ట్’, ‘శశాంక్’, క్రౌడ్‌ఫండ్‌తో తీస్తున్న మరో సినిమా.. ఇలా వరుసగా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న తన కొడుకు జీవితాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దర్శకనిర్మాతలు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని కృష్ణ కిషోర్ సింగ్ వాదిస్తున్నాడు. అయితే ‘సినిమా స్వేచ్ఛ’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిర్మాతలకు నష్టం కలిగించే ఈ అంశంపై త్వరగతిన నిర్ణయం తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు సుశాంత్ తండ్రికి సూచించింది. చదవండి: సుశాంత్ గురించి నవీన్ పొలిశెట్టి.. -
బాబోయ్ పైరసీ.. వేల కోట్లు ఉఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ కారణంగా మీడియా, వినోద పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఏటా సగటున రూ.2,100 కోట్ల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పైరసీని కట్టడి చేయడం కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, సినిమా హాళ్లలో పైరసీకి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఎంపీలు సుకాంత మజుందార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం పైరసీ కట్టడికి కొన్ని సిఫార్సులు చేసిందని, వాటిని పరిశీలించి సినిమాటోగ్రఫీ బిల్లు –2021లో చేర్చుతామన్నారు. వీటితో పాటు కాపీరైట్ చట్టం–1957 ప్రకారం పైరసీపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా పైరసీకి పాల్పడితే ఐటీ యాక్ట్ –2000లోని సెక్షన్ 79 ద్వారా చర్యలు తీసుకోవచ్చని జవడేకర్ పేర్కొన్నారు. చదవండి: ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్ హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు -
‘ఆ సినిమా కథ కాపీరైట్స్ నావే’
సాక్షి, హైదరాబాద్ : తాను కాపీరైట్స్ తీసుకున్న కథను మరొకరికి విక్రయించిన వ్యక్తిపై, ఆ కథతో సినిమాను తెరకెక్కించిన నిర్మాత, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రచయిత డాక్టర్ నంది చిన్నికుమార్ విజ్ఞప్తి చేశాడు. మంగళవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నానని తెలిపారు. ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి తర్వాత ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగి బ్రెజిల్లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడన్నారు. ప్రస్తుతం మురికివాడల్లోని, రెడ్‌లైట్ ఏరియాల్లోని పిల్లలకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతని జీవిత కథ తనకెంతో నచ్చడంతో ఆయన దగ్గరికెళ్లి సినిమా తీసేందుకు 2018 మార్చి 19న కాపీరైట్స్ అగ్రిమెంట్ చేసుకున్నానని వివరించారు. ఇందుకు కొంత నగదు కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. తాను సినిమా స్టోరీ అంతా సిద్ధం చేసుకొని... నటీనటులు, నిర్మాతల కోసం వెతుకుతున్నానన్నారు. కాగా ఇటీవల విడుదలైన విజిల్ (తెలుగు), తమిళ్లో (బిగిల్) సినిమా తాను కాపీరైట్స్ తీసుకున్నదేనన్నారు. దీనిపై పాల్‌ను సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బృందాన్ని సంప్రదించినా స్పందన లేదన్నారు. దీంతో తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనూ అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, వారు బాధ్యులపై కేసు నమోదు చేశారన్నారు. దీనిపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
నా తండ్రి తప్పుడు మనిషి కాదు
సాక్షి, ముంబై/చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్ కాకుండా అడ్డుకుని తీరతామని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు కాలా కథ తన తండ్రిదేనంటున్న ముంబైకి చెందిన జర్నలిస్ట్ జవహర్ నాడర్, పరువు నష్టం దావా వేస్తానని కాలా నిర్మాతలను హెచ్చరించారు. కాలా సేట్ కథ... ట్యూటికోరిన్(తూత్తుకుడి)కి చెందిన ఎస్. థిరవియమ్ నాడర్ బెల్లం వ్యాపారి. 1957లో ముంబైలోని ధారావికి వలస వచ్చారు. అతనిని స్థానికులు ‘గుడ్వాలా సేట్’, ‘కాలా సేట్’ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు కాలా చిత్రంలో రజనీ పోషిస్తున్న పాత్ర తన తండ్రిదేనని జవహర్ వాదిస్తున్నారు. ‘నా తండ్రి కథ అన్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా మంచి మనిషిగా పేరున్న నా తండ్రిని తప్పుడు కోణంలో చూపించారు. ఆయన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను. 36 గంటల్లో రజనీకాంత్ సహా చిత్ర యూనిట్ మొత్తం లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ. 101 కోట్లకు దావా వేస్తా’ అని ఆయన లేఖలో హెచ్చరించారు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేయటం తెలిసిందే. కాలా టీమ్ స్పందన... ఇదిలా ఉంటే జవహర్ ఆరోపణలను కాలా చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’ను నటుడు ధనుష్ నిర్మించగా, రజనీకాంత్, ఈశ్వరి, నానాపటేకర్, సముద్రఖని, హూమా ఖురేషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న కాలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
అమితాబ్ బచ్చన్ బాధ ప్రపంచం బాధ
సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వంగా తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ సాహిత్యంపై తనకు సంక్రమించిన హక్కులు 2063 తర్వాత పబ్లిక్ డొమేన్ (ప్రజల పరిధి)లోకి వెళ్లిపోతాయంటూ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన బ్లాగ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి హరివంశ్ రాయ్ 2003లో చనిపోయారు. దాంతో వారసత్వంగా ఆయన రాసిన నవలలు, కవితలు, వ్యాసాలపై 2063 వరకు అమితాబ్‌కు సర్వ హక్కులు లభించాయి. 1957 నాటి కాపీరైట్ హక్కుల చట్టం ప్రకారం సాహిత్యం, సంగీతం, కళలు, నాటకాలు, సినిమాలపై ఎవరికైనా 60 ఏళ్ల వరకే కాపీ రైటు ఉంటుంది. ఇంకా అమితాబ్‌కు తాను జీవించినంత కాలం కాపీరైటు హక్కులు ఉంటాయి. అయినా తన వారసులుగా ఆ హక్కులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉంది. అందుకే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మాటకొస్తే సినిమాల పరిస్థితి మరీ దారుణం అని చెప్పవచ్చు. ఓ సినిమా తీసి 60 ఏళ్లయితే ఎవరికీ ఆ సినిమాపైనా హక్కులు ఉండవు. ఆ సినిమా ప్రజల పరిధిలోకి వెళుతుంది. అప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలనుగానీ, మాటలనుగానీ, మొత్తంగా కథనుగానీ ఎవరైనా ఉచితంగా కాపీ చేసుకోవచ్చు. ఎవరికి రాయల్టీ కింద అణా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన బాలీవుడ్ హిందీ చిత్రాలనే పరిగణలోకి తీసుకున్నట్లయితే 1958 సంవత్సరానికి ముందు తీసిన అన్ని సినిమాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయన్న మాట. 1941లో కమల్ అమ్రోహి తీసిన ‘మహల్’, 1951లో రాజ్‌కపూర్ తీసిన ‘ఆవారా’, 1957లో రాజ్‌కపూరే తీసిన ‘శారద’, 1958లో మెహబూబ్ ఖాన్ తీసిన మదర్ ఇండియా లాంటి చిత్రాలు, 1955లో తెలుగులో ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మిస్సమ్మ’, 1951లో బీఎన్ రెడ్డి తీసిన ‘మళ్లీశ్వరి’, 1951లో కేవీ రెడ్డి తీసిన ‘పాతాళభైరవి’, 1957లో కేవీ రెడ్డి తీసిన ‘మాయాబజార్’ లాంటి ఆణిముత్యాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయి. ఈ సినిమాలను రీమేక్ చేయడానికి, ఈ సినిమాల్లోని సన్నివేశాలను వాడుకునేందుకు చట్ట ప్రకారం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట. ఇలా కాపీ రైటు హక్కు భారత్‌లో 60 ఏళ్లు ఉండగా, అమెరికాలో 70 ఏళ్లు ఉంది. ఈ కారణంగా అమెరికాలో ఫ్రాంక్ కాప్ర, ఆర్సన్ వెల్లెస్, ఫ్రిడ్జ్ లాంగ్ చిత్రాలు పబ్లిక్ డొమేన్లోకి వచ్చాయి. సినిమా హాళ్లు, టీవీలే కాకుండా ఇంటర్నెట్, వెబ్సైట్లు లాంటి పలు రకాల ప్రసార మాధ్యమాలు వచ్చినందున 60 ఏళ్లు, 70 ఏళ్లు అంటూ కాపీరైటు ఉండరాదని సినిమా వర్గాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. 60 ఏళ్ల క్రితం నడవక నష్టం వచ్చిన సినిమాకు నేడు మారిన మాధ్యంలో ఆదరణ లభించవచ్చు, డబ్బులూ రావచ్చని నిర్మాతలు అంటున్నారు. సాహిత్యంలోగానీ, కళల్లోగానీ వారసత్వంగా సంక్రమించే హక్కులు శాశ్వతంగా ఉండాలని ఆయా రంగాల వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్తకొత్త మాధ్యమాలు మారుమోగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే చట్టం మారనూ వచ్చు! -
ఆ హక్కును కోల్పోయిన బిగ్ బీ
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ కోపం వచ్చింది. ట్విటర్‌ను వేదికగా చేసుకుని ఆ కోపాన్ని ప్రదర్శించారు. ఇంతకు బిగ్ బీకి అంత కోపం తెప్పించిన అంశం ఏంటంటే ఆయన తండ్రి ప్రముఖ రచయిత హరివంశరాయ్ బచ్చన్ రచనల మీద 1957 కాపీ హక్కుల చట్టం మేరకు అమితాబ్‌కు ఉన్న హక్కులను కోల్పోనున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన అనంతరం ఆ వ్యక్తి రచనల మీద అతని వారసులకు కేవలం 60 ఏళ్ల వరకే హక్కులు ఉంటాయి. తర్వాత ఆ రచనలను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో అమితాబ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 60 ఏళ్లే వారసులకు హక్కులు ఉంటాయని ఎవరూ నిర్ణయించారు. అయినా 60 ఏళ్లే ఎందుకు ఉండాలి, 61 ఏళ్లనో, శాశ్వతంగానో ఎందుకు ఉండకూడదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ‘కాపీ హక్కు చట్టాలను చెత్తగా వర్ణిస్తూ అసలూ ఈ మేథోపరమైన హక్కులను ఎవరూ నిర్ణయించారు. నా తండ్రికి నేను వారసున్ని, ఆయన రచనల మీద కూడా నాకే పూర్తి హక్కు ఉంటుంది. నా తండ్రి మరణించి 60 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి ఇంక నాకు హక్కు లేదంటే ఎలా కుదురుతుంది. ఇప్పుడు ఎవరైనా వారి అవసరాలకోసం నా తండ్రి సాహిత్యాన్ని వారి ఇష్టారీతిగా ఉపయోగించుకోవచ్చా? అలా ఎప్పటికి జరగదు. విలియం షేక్స్పియర్, మిస్టర్ బీథోవెన్, మెస్సర్స్ చోపిన్, చైకోవ్స్కీ మన దేశానికి వస్తే గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్... వీళ్లేవరికి ఈ కాపీరైట్ హక్కు గురించి తెలియదు. వారి రచనలకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవు. అందువల్ల వారి రచనలను అందరూ వాడుకుంటున్నారు. దానివల్ల వారి నిజమైన వారసులకు నష్టం కలుగుతోంది. నేను మాత్రం ఈ విషయం మీద పోరాడతాను’ అంటూ ముగించారు. హరివంశరాయ్ బచ్చన్ రచనల్లో మధుశాల, అగ్నిపత్, రుకే నా తు, హిమ్మత్ కర్నే వాలోంకి హర్ నహీ హోతి వంటివి కొన్ని ప్రముఖమైనవి. -
‘అజ్ఞాతవాసి’ ప్రదర్శన నిలిపేస్తారా..!
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే సినిమాకు నెగెటివ్ టాక్ రావటంతో పాటు కాపీ అన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే స్వయంగా ఈ సినిమా ప్లాట్ తన సినిమా ఫ్లాట్‌కు దగ్గరగా ఉందని కామెంట్ చేశారు. అంతేకాదు అజ్ఞాతవాసి నిర్మాతలు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలపై కూడా సల్లే స్పందించారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదు అంటూ తాను చర్యలకు రెడీ అవుతున్నట్టుగా హింట్ ఇచ్చారు. అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా సల్లే ప్రకటించలేదు. ఒకవేళ కాపీ రైట్ ఉల్లంఘన కింద జెరోమ్ సల్లే చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయాలపై ఫోర్బ్స్ తాజా కథనంలో వివరించింది. చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటే సల్లే ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమా డిస్ట్రిబ్యూషన్, ప్రదర్శనలను నిలిపివేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ అదే జరిగితే దర్శకుడి కెరీర్‌పై ఆ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. గతంలో ఇలాంటి సంఘటనల కారణంగా చాలా మంది చిత్ర ప్రముఖులు తమ విశ్వాసాన్ని, కీర్తిని కోల్పోయారని తెలిపింది. అంతేకాదు ఇది త్రివిక్రమ్ కెరీర్‌ను కష్టాల్లో పడేసే అవకాశం ఉందని తెలిపింది. -
అజ్ఞాతవాసికి మరిన్ని చిక్కులు తప్పవా?
సాక్షి, సినిమా : ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై మరో ట్వీట్ చేశారు. టీ సిరీస్ సంస్థతో అజ్ఞాతవాసి మేకర్లు చేసుకున్న సెటిల్ మెంట్ సరిపోలేదేమోనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కదా! అంటూ తన ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన్న హక్కులు కొనుకున్న మరికొన్ని సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అజ్ఞాతవాసి నిర్మాతలకు సల్లే సూచిస్తున్నారు. కాగా, అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్‌కు కాపీ అన్న వార్తలు రావటంతో ఇండియాలో ఆ చిత్ర హక్కులు కొన్న టీ సిరీస్ వారు న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన నిర్మాత టీ సిరీస్ వారితో సెటిల్మెంట్ చేసుకున్నాడు. మీడియాలో ఆ వార్త జోరుగా చక్కర్లు కొట్టినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ.. చిత్ర మేకర్లు గానీ అస్సలు స్పందించలేదు. ఇప్పుడు చిత్రం విడుదలయ్యాక లార్గో వించ్‌కు కేవలం ప్రేరణ మాత్రమే కాదని.. కథ... అందులోని సన్నివేశాలను యాజ్ ఇట్ ఈజ్‌గా దర్శకుడు త్రివిక్రమ్ దించేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని మాతృక చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే కూడా దృవీకరించటం గమనార్హం. I’m afraid a settlement with T-series will not be enough. It’s not only about India. The movie #Agnyaathavaasi has been released worldwide yesterday. https://t.co/FUXkNSZ2fO — Jérôme Salle (@Jerome_Salle) January 10, 2018 -
నాథ్ యోగి.. నాదే!
లక్నో : బాలీవుడ్ ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గోరఖ్‌పూర్ మహోత్సవ్ కోసం నిర్వాహకులు ఓ ప్రత్యేక ఆల్బమ్‌ను రూపకల్పన చేశారు. అయితే వారు తన పాటను కాపీ కొట్టారంటూ కైలాష్ ఆరోపిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఇసా యోగా సెంటర్లో నిర్వహించిన మహాశివ రాత్రి ఉత్సవాల కోసం గేయ రచయిత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. దానిని కైలాష్ ఆలపించారు. ఇక ఇప్పుడు గోరఖ్‌పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించే మహోత్సవం కోసం విమల్ బర్వా ఓ పాట రాయగా.. ప్రణయ్ సింగ్ దానిని పాడాడు. నాథ్ యోగి పేరిట ఆ పాట జనాల్లోకి బాగా దూసుకుపోతోంది. పాటను విన్న కైలాష్ అనుచరులు అది కాపీ అన్న విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కైలాష్ ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. ‘‘ విదేశాల్లో కాపీ హక్కుల ఉల్లంఘన తీవ్ర నేరం. కానీ, మన దగ్గర మాత్రం ప్రజలు ఆ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు కారణం చట్టంపై అవగాహలేమినే. ఈ విషయంలో గోరఖ్‌పూర్ మహోత్సవ నిర్వాహకులతో న్యాయపోరాటానికి నేను సిద్ధం’’ అని కైలాష్ ప్రకటించారు. బహుశా ఈ విషయం ముఖ్యమంత్రికి తెలీకపోయి ఉండొచ్చని.. మంచి పరిపాలకుడిగా పేరున్న యోగి ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని.. అవసరమైతే తానే స్వయంగా సీఎంను కలిసి ఘటనపై వివరిస్తానని కైలాష్ అంటున్నారు. -
పాడకు తీయగా
ఇళయరాజా పాట తియ్యగా ఉంటుంది. బాలూ పాడితే ఇంకా తియ్యగా ఉంటుంది. కానీ, టికెట్టు పెట్టి పాడే వేదికల మీద తన పాటలు అనుమతి లేకుండా పాడేందుకు వీలులేదని ఇళయరాజా బాలూకి నోటీసులు పంపడతో ఈ వ్యవహారం చేదుగా మారింది. ‘మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు... అందాలన్ని పల్లవించి ఆలకించే పాటలు’... ‘ఓ పాప లాలి’ సినిమాలో బాలూ ఉగ్గబట్టి ఒక్క దమ్ములో పాడిన పాట ఇది. గుక్క తిరగనివ్వని పాట. తాజాగా ఇళయరాజా ఇచ్చిన నోటీసు బాలూకు బహుశా ఇలాగే గుక్క పెట్టనివ్వని షాక్ ఇచ్చి ఉండవచ్చు. ‘లాభాపేక్ష కలిగిన కచేరీలలో తన పాటలు పాడటం కాపీరైట్ చట్ట ప్రకారం నేరమనీ కనుక పాడటం ఆపి వేయమని’ ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తన లాయర్ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు ఇచ్చినవాడు స్నేహితుడు. పుచ్చుకున్నవాడూ స్నేహితుడే. అనేక విషయాలలో ఇరువురికీ స్నేహం ఉండవచ్చు. కాని ప్రొఫెషనలిజమ్లోకి వచ్చేసరికి బహుశా పంతాలూ పట్టింపులూ కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఇక్కడ అదే జరిగి ఉండవచ్చు. ఇద్దరూ స్నేహితులు బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజాల స్నేహం ఇప్పటిది కాదు. 1970ల నుంచి ఉంది. అప్పట్లో దర్శకుడు భారతీరాజా బాలసుబ్రహ్మణ్యం మొదటగా స్నేహితులయ్యారు. తన ప్రాంతానికే చెందిన ఇళయరాజాను భారతీరాజా బాలూకు పరిచయం చేశారు. బాలూకు సొంత ఆర్కెస్ట్రా ఉండేది. అందులో ఇళయరాజాను టీమ్మేట్గా తీసుకున్నారు బాలూ. 1975లో ఇళయరాజా సంగీతదర్శకుడు అయ్యాక ఆ స్నేహాన్ని మర్చిపోలేదు. తన సంగీత దర్శకత్వంలో దాదాపు అన్ని పాటలూ బాలూ చేతనే పాడించారు. ఇతర గాయకులు పాడింది తక్కువ. బాలూ, ఎస్.జానకి, చిత్రల గళ సంపద ఇళయరాజా స్వర సంపదకు తోడై సంగీత ప్రియులను అలరించింది. అలరిస్తూనే ఉంది. తకిట తథిమి తందానా... ఇళయరాజా సంగీతంలో బాలూ పడిన పాటలన్నీ హిట్టే. ఇళయరాజా తొలిరోజుల్లో చేసిన ‘వయసు పిలిచింది’ సినిమాలో ‘మబ్బే మసకేసిందిలే’, ‘ఇలాగే.. ఇలాగే’.... పాటలు ఆదరణ పొందాయి. తమిళం నుంచి డబ్ అయిన ‘ఎర్రగులాబీలు’ వంటి సినిమాల నుంచి కూడా బాలూ పాడిన ‘ఎదలో తొలి వలపే’ పెద్ద హిట్. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై ఇళయరాజా చేసిన సినిమాలు బాలు గొంతులో హుషారు రేపాయి. ‘సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది’ (అభిలాష), ‘ఇందువదన కుందరదన’ (ఛాలెంజ్), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘సరిగమ పదనిస రస నస’ (మరణ మృదంగం)... ఇవన్నీ హిట్. అలాగే దర్శకుడు వంశీ ఇళయరాజా పాటలతోనే ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బాలూకు మరిన్ని మంచి పాటలు దక్కాయి. ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ’ (లేడీస్ టైలర్), ‘సుమం ప్రతి సుమం సుమం’... ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘నిరంతరమూ వసంతములే’, ‘వయ్యారి గోదారమ్మ వొళ్లంత ఎందుకమ్మ’ (ప్రేమించు పెళ్లాడు) ఇప్పటికీ ప్రతి కచేరీలో వినిపిస్తుంటాయి. ఇక కె.విశ్వనాథ్ సినిమాల్లో ఇళయరాజా– బాలూల పాటలు ప్రత్యేకం. ‘తకిట తథిమి తకిట తథిమి తందానా’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ (స్వాతిముత్యం) పాటలను ప్రేక్షకులు ఎలా మర్చిపోగలరు. బాలూ కచ్చేరీలు... సినీ గాయకుడు కాక మునుపు నుంచే బాలసుబ్రహ్మణ్యం కచ్చేరీలు చేసేవారు. నెల్లూరు చుట్టపక్కల అనేక ప్రాంతాలలో సినీ పాటలు పాడేవారు. ఇప్పటికీ పాడుతున్నారు. పాత కొత్త పాటలు బాలూయే కాదు ఏ ఆర్కెస్ట్రా అయినా పాడటం మనవారికి ఆనవాయితీగా వస్తోంది. ఒక్క ఇళయరాజా పాటలే కాదు చక్రవర్తి, కె.వి.మహదేవన్‌ల మొదలు నేటి కీరవాణి, ఏ.ఆర్.రహమాన్‌ల వరకు ఏ సంగీతకర్త చేసిన పాట అయినా ఏ ఆర్కెస్ట్రా అయినా ఎవరి అనుమతి అక్కర్లేకుండా పాడటం మన దేశంలో ముందు నుంచీ ఉంది. కాని ఈ తాజా నోటీసుల వల్ల ఒక అయోమయం ఏర్పడినట్టయ్యింది కాపీరైట్... సంగీతరంగంలో కాపీరైట్దీ, రాయల్టీది కీలకమైన పాత్ర. ఒక పాటను ఒక ఆడియో కంపెనీ కొనుక్కుంటే దాని మీద వచ్చే రాబడిలో సంగీతదర్శకుడికీ, గాయనీ గాయకులకీ రాయల్టీ ఇవాల్సి ఉంటుంది. హెచ్ఎంవి వంటి పెద్ద సంస్థలు ఈ రాయల్టీని చెల్లించేవి. గతంలో మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లు ఈ రాయల్టీ విషయంలో ఒక కాంట్రవర్సీని లేపారు. ఒకసారి పాట పాడేశాక, దానికి రెమ్యునరేషన్ పుచ్చుకున్నాక ఆ తర్వాత రాయల్టీ అక్కర్లేదు అనేది రఫీ వాదన అయితే రాయల్టీ ఉండాలి అనేది లతా వాదన. దీని వల్ల కొంతకాలం పాటు వారిద్దరు కలిసి పాడలేదు కూడా. పాత పాటలను కొత్త సినిమాలలో వాడుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. కొన్ని పాత పాటలను ఉపయోగించి యాడ్స్ చేయడం చూస్తుంటాము. వాళ్లు కూడా ఆ పాటలను సొంతదారుల నుంచి కొనుక్కుని ఉపయోగించాల్సిందే. ఏవో మూడు సెకన్లు ఆరు సెకన్లకు అనుమతులు అక్కర్లేదు కాని మొత్తం పాటను ఉపయోగించాలంటే డబ్బు కట్టక తప్పదు. ఇప్పుడు ఇళయరాజా చెబుతున్నది కూడా అదే. లాభాపేక్ష కలిగిన కచ్చేరీలు.. బాలూ ఇటీవల బాలూఎట్ఫిఫ్టీ పేర ప్రపంచ యాత్ర చేస్తున్నారు. దేశదేశాలలో కచ్చేరీలు ఇస్తున్నారు. ఆ కచ్చేరీలలో అందరి పాటలను పాడుతున్నారు. ఇళయరాజా ఏమంటారంటే ఇవన్నీ ఏ ప్రజాహిత కార్యక్రమం కోసమో ఉచితంగానో చేయడం లేదు కదా... కనుక వీటిలో నేను చేసిన పాటలు మీరు పాడి డబ్బు సంపాదించుకోవడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా ఎంతో హుందాగా ఇలాంటి చట్టం ఉందని తనకు తెలియదనీ ఇక మీదట చట్టాన్ని గౌరవించి ఇళయరాజా పాటలు పాడనని తన ఫేస్బుక్ ద్వారా తెలియచేశారు. అయితే ఇళయరాజా కేవలం ఇది బాలూ కోసమే చేయలేదని మనం గుర్తు చేసుకోవాలి. సంవత్సరం క్రితం ఆయన అనేక ఎఫ్ఎం చానెల్స్, మ్యూజిక్ చానల్స్‌కు కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారు. చెప్పా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా తన బాణీలు, అంతర స్వరాలు ఉచితంగా వాడుకుంటున్నారనీ అనుమతి లేకుండా అలాంటి పనులు చేయవద్దనీ ఆయన నోటీసులు ఇచ్చారు. బాలూకు నోటీసు అందుకు కొనసాగింపే. రెండు వైపులా... ఇళయరాజా పాటలు బాలూ గొంతున వినాలి. వినకుండా ఎలా? కచ్చేరీలలో బాలూ ఇళయరాజా పాటలు పాడకుంటే అందం ఉండదు. ప్రజలలోకి వచ్చిన పాటను బాలూ పాడటంలో తప్పు లేదని ఒక వర్గం అంటుంటే తన మేధో హక్కులను కాపాడుకునేందుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడం తప్పు కాదని మరో వర్గం అంటోంది. ఇద్దరి వైపూ పాయింట్ ఉండొచ్చు. సంగీత అభిమానులకు ఇద్దరూ కావాలి. దీనికి కాపీరైట్ చట్టం అడ్డు కాకూడదు. ఇళయరాజా పాటలు పాడటానికి ఆయన అనుమతి స్నేహపూర్వకంగానో ఆర్థికపరంగానో తీసుకుని బాలూ ఇళయరాజా పాటలు పాడాలి... ఇళయరాజా కూడా పట్టువిడుపులు పాటించి తన పాటను బాలూ నోట ముందుకు తీసుకెళ్లాలి అని ఎక్కువమంది అభిమానులు కోరుకుంటున్నారు. నందికొండ వాగుల్లోన.... ఇళయరాజా బాలసుబ్రమణ్యం గొంతుతో అనేక ప్రయోగాలు చేశారు. బాలు కూడా ఆ ప్రయోగాలను సవాలుగా తీసుకుని స్వాగతించేవారు. ‘గీతాంజలి’ సినిమాలో ‘నందికొండ వాగుల్లోన’ పాట భూతం పాడినట్టు బొంగురుగా పాడాలని ఇళయరాజా ఆశించి రికార్డు చేసిన పాటను తిరిగి రికార్డ్ చేయగా బాలూ ఆయన ఆశించినట్టుగా పాడి మెప్పించారు. దాని వల్ల వారం రోజుల పాటు బాలు ఇతర పాటలు రికార్డ్ చేయలేకపోయారని అంటారు. అలాగే ‘ఇంద్రుడు–చంద్రుడు’ సినిమాలో ‘నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు’ పాట కోసం బాలు కమల్‌హాసన్‌లాగా బొంగురు గొంతుతో పాడి ఆ ప్రయోగాన్ని ఇళయరాజా ఆధ్వర్యంలో సక్సెస్ చేశారు. ఇటీవల ‘శ్రీరామరాజ్యం’లో ఇళయరాజా కాంబినేషన్లో పాడిన ‘జగదానంద కారకా’ పెద్ద హిట్. ఈ జోడీలో మరిన్ని పాటలు రావాల్సి ఉంది. మరి ఈ నోటీసు దరిమిలా ఏమవుతుందో చూడాలి! ఈ రాయల్టీ గొడవలు ముంబైలో, చెన్నైలో చాలా ఎక్కువ. ఇళయరాజాగారి పాటలు లేకుండా ప్రపంచంలో ఎక్కడా తమిళ, తెలుగు సంగీత విభావరిలు జరగడం లేదు. ఇప్పుడు బాలుగారికి మాత్రమే నోటీసులు వచ్చాయి. మిగతా గాయనీగాయకులు అందరికీ భవిష్యత్తులో నోటీసులు వెళతాయా? ఏమో చూడాలి మరి! రాజాగారు చేసినట్టు మిగతా సంగీత దర్శకులు కూడా చేస్తే గాయనీగాయకుల భవిష్యత్తు అంధకారమే. – గాయని సునీత సమస్య కనిపించేంత చిన్నదేం కాదు. దాని మూలాలు వేరే ఉన్నాయి. మన కళ్ల ముందు బాలు, ఇళయరాజాలు కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. రాజాగారి పాట అయినప్పటికీ గేయ రచయితలు, నిర్మాతలకూ వాటా ఉంటుంది. వాళ్ల అనుమతి కూడా తీసుకోవాలి కదా. అలాగే, గాయకులకు కూడా ఏవో హక్కులు ఉన్నాయి. ఎవరూ హర్ట్ కాకుండా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అభిమానులతో పాటు నేను కూడా కోరుకుంటున్నా. – రామజోగయ్య శాస్త్రి సంగీతం అనగానే నాకు గుర్తొచ్చే రెండు పేర్లు... ఇళయరాజా, ఎస్పీబీ. ఈ లీగల్ గొడవలు వీలైనంత త్వరగా సమసిపోయి వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్లిద్దరూ లెజెండ్స్. నా చిన్నప్పట్నుంచి ఒకరు వాయిస్తుంటే.. మరొకరు పాడుతుంటే... చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశా. ఆ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయి. వీరిద్దరూ 40 ఏళ్లుగా అత్యంత ఆత్మీయులు. ఇప్పుడు ఇద్దరూ 70 ఏళ్ల వయసు దాటారు. ఈ వయసులో ఈ ఎడబాటు ఎందుకు? ఇద్దరి అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. – నాగూర్‌బాబు వనీవన న్యాయమని ఒకటుంది. అదేంటంటే... అడవిలో జంతువులకు చెట్టూపుట్టలు రక్ష. చెట్టూపుట్టలకు జంతువులు రక్ష. ఒకరికి మరొకరు తోడు లేకపోతే మనుగడ కష్టమని దీనర్థం. రెండూ కలసి ఉంటేనే ఆ గొప్పదనం. రాజాగారి బాణీకి బాలుగారు గొంతుతో సహాయం చేశారు. బాలుగారి గొంతుకు రాజాగారు తన బాణీతో న్యాయం చేశారు. ఇప్పుడిలాంటి సమస్య రావడం బాధాగా ఉంది. పాలు–నీళ్లను వేరు చేయమంటే ఏమని వేరు చేస్తాం చెప్పండి! అలాగే, వారిద్దరి పాట కూడా! – ఎం.ఎం. శ్రీలేఖ కాపీరైట్ యాక్ట్ 2012 ప్రకారం ఒకపాట రాయల్టీలో యాభై శాతం నిర్మాతకి, 25 శాతం పాట రచయితకి, 25 శాతం స్వరకర్తకి దక్కాలి. పాటను కమర్షియల్ వేదికల మీద ఉపయోగిస్తే న్యాయపరంగా ఈ రాయల్టీ ఇవ్వాల్సిందే. అందుకనే ఇళయరాజా ఈ నోటీసు ఇచ్చి ఉంటారు. ఏమైనా రెండు సంగీత శిఖరాల మధ్య వచ్చిన ఈ అభిప్రాయభేద మేఘాలు కరిగిపోవాలని కోరుకుంటున్నా. – అనంత్ శ్రీరామ్ ఏమైనా ఇది టీ కప్పులో తుఫాన్ కావచ్చు. లేదంటే హటాత్తుగా జారిన అపస్వరం కావచ్చు. బాలూ ఇళయరాజాల స్నేహం, వారి యుగళగీతం కొనసాగాలని కోరుకుందాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తీర్పుల్లో గ్రంథ చౌర్యం!
సాంకేతికంగా అభివృద్ధి చెందిన కాలంలో సమాచారానికి కొదువ లేదు. ఏ విషయం గురించి కావా లంటే ఆ విషయం మీద ఎంతో సమాచారం లభిస్తుంది. రకర కాలైన ఆధారాల నుంచి సమా చారం లభిస్తుంది. ఏ వ్యాసం చదివినా ఎంతో సమాచారం లభిస్తోంది. కొత్త ఆలోచనలు కన్పిస్తున్నాయి. ఆ ఆలోచ నలు వాళ్ల సొంతమా? లేక ఎక్కడినుంచైనా తస్కరించారో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇంగ్లీషు పుస్తకాలు, కవితలు చదివిన తెలుగు కవులు.. ఆ కవుల ఊహలను తస్కరించి తెలుగులో కవిత్వం రాస్తు న్నారన్న అపవాదు ఉండేది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. వ్యాసాలు రాస్తున్నప్పుడు చాలా విషయాలను ఉదహ రించాల్సి వస్తోంది. ఆ విధంగా ఉదహరించినప్పుడు అవి ఎక్కడి నుంచి సేకరించామో వాటిని ప్రస్తావించడం ధర్మం. ఆ విధంగా చేయకపోతే అది తప్పకుండా గ్రంథ చౌర్యం (ప్లాగియారిజం) అవుతుంది. ఈ కాలంలో గ్రంథ చౌర్యాన్ని దొరకబట్టడం అంత సులువైన విషయం కాదు. తెలివిగల వారు గ్రంథ చౌర్యం అని చెప్పే వీలులేకుండా గ్రంథ చౌర్యానికి పాల్పడుతున్నారు. మక్కీకి మక్కీగా పేర్కొన్న ప్పుడు మాత్రమే గ్రంథ చౌర్యం బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగా గ్రంథ చౌర్యం చేసే వ్యక్తులు కొంత మంది ఉంటే, మరికొంత మంది అనుకోకుండా ఈ గ్రంథ చౌర్యాలకు పాల్పడుతుంటారు. సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన న్యాయమూర్తి రూమాపాల్ 2011వ సంవత్సరం వీఎం తార్కుండే స్మారకోపన్యాసం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల గురించి ఓ తీవ్రమైన విమర్శ చేశారు. చాలా మంది న్యాయ మూర్తులు గతంలో జడ్జీలు చెప్పిన విషయాలనే తమ తీర్పుల్లో.. వాళ్లని కానీ, ఆ కేసులను కానీ ఉదహరిం చకుండా ప్రస్తావిస్తూ గ్రంథ చౌర్యానికి పాల్పడుతు న్నారని ఆమె ఆక్షేపించారు. ఆ విమర్శ అలా ఉండగానే అలాంటి తీర్పులు ఇంకా కన్పిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ మధ్య ఢిల్లీ హైకోర్టులో మరో సంఘటన జరిగింది. ఢిల్లీ హైకోర్టు తీర్పులో ఏకంగా కొన్ని పేరాలనే (4 నుంచి 37) ఓ వ్యాసం నుంచి ఉదహరించారు. అయితే ఆ వ్యాసకర్త పేరును తమ తీర్పులో ఎక్కడా ఢిల్లీ హైకోర్టు ఉదహరించలేదు. డిసెంబర్ 1, 2015 రోజున స్పైసీ ఐసీ బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రోచా వర్సెస్ సిప్లా కేసుకు సంబంధించిన తీర్పులో 4వ పేరా నుంచి 37వ పేరా వరకు ఉన్న విషయాలన్నీ క్వీన్ మేరీ జర్నల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నుంచి తస్కరించినవని, ఆ వ్యాసాన్ని రాసిన రచయితలు శ్వేతశ్రీ మజుందార్, ఈషాన్ ఘోష్ అని ఆ బ్లాగ్ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆ రచయితలు తమ ఫేస్బుక్లో కూడా ప్రస్తావించారు. నవంబర్ 27, 2015 రోజున ఢిల్లీ హైకోర్టులోని న్యాయమూర్తులు ప్రదీప్ నంద్రాజోగ్, ముక్తాగుప్తాలతో కూడిన ధర్మాసనం రోచాకేసులో అప్పీలును పరిష్కరిస్తూ తమ తీర్పును ప్రకటించింది. అదే కోర్టులో ఏకసభ్య న్యాయమూర్తి సెప్టెంబర్ 7, 2012న ప్రకటించిన తీర్పుపై వచ్చిన తీర్పులోని అప్పీలు అది. ఫేస్బుక్లో, బ్లాగ్‌లో ఈ విషయం ప్రస్తావించిన తరువాత అదే న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తమకు తాముగా స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఆ పేరాలను తమ తీర్పు నుంచి తొలగించి మూల రచయితలకు క్షమాపణలు చెప్పారు. ఆ పేరాలు తమ తీర్పులో కన్పించడానికి కారణం తమ న్యాయ సహాయకుడు అని (లా ఇంటర్న్) తేల్చారు. న్యాయమూర్తి వెలువరించిన తీర్పు 275 పేజీలు ఉండటం వలన దాన్ని సంక్షిప్తం చేయాలని తమ న్యాయ సహాయకులకు చెప్పామని, దాని ముసాయిదా ప్రతిలో ఆ న్యాయ సహాయకులు ఆ పేరాలు పెట్టడం వల్ల ఆ విధంగా జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే ఆ పేరాలను తొలగించడానికి విచారణను చేపట్టి అవి తొలగించామని కోర్టు పేర్కొంది. ఈ దిద్దుబాటు చర్యలను చాలా మంది స్వాగతిస్తున్నారు. మంచిదే. కానీ ఆ పేరాలు తీర్పులో కన్పించడానికి న్యాయమూర్తుల బాధ్యతను ఎవరూ ప్రశ్నించడం లేదు. ఈ న్యాయసహాయకుల పద్ధతి సబార్డినేట్ కోర్టుల్లో లేదు. హైకోర్టుల్లో మాత్రమే ఉంది. న్యాయమూర్తులకు సమయం ఉండదు కాబట్టి న్యాయసహాయకుల, న్యాయ క్లర్కుల అవసరం ఏర్పడింది. అలాంటి న్యాయ సహాయ కుల వల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరూ అపఖ్యాతికి లోనయ్యారు. న్యాయసహాయకులు ఇచ్చిన ఫిర్యాదులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ న్యాయసహాయకులు అవసరమా? న్యాయసహాయకుల పాత్ర చాలా కేసుల్లో ఉంటు న్నట్లు అనిపిస్తోంది. అరుణా శాన్ బాగ్ కేసు 2011(4) ఎస్సీసీ 454 కేసులో న్యాయసహాయకుల పాత్రను న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ప్రశంసించారు. ఆ తీర్పు ఆ విధంగా తుదిదశకు చేరటానికి కారణమైన న్యాయక్లర్కులకు, న్యాయసహాయకులకు కృతజ్ఞతలను తమ తీర్పులో ప్రకటించారు. ఈ తీర్పును న్యాయ మూర్తులు ఖట్జూ, జ్ఞానసుధా మిశ్రాలు వెలువరించారు. న్యాయసహాయకుల పాత్ర కేసుల పరిశోధన వరకు ఉంటే ఫర్వాలేదు. కానీ గ్రంథ చౌర్యం వరకు ఉండ కూడదు. తీర్పులను, న్యాయమూర్తులను ప్రభావితం చేయకుండా ఉండాలి. న్యాయసహాయకులు, న్యాయ మూర్తులు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఢిల్లీ ఉదం తం మనకు గుర్తు చేస్తుంది. సమాచారం ఎంత సులువుగా ఈ సాంకేతిక యుగంలో లభిస్తుంది అంటే గ్రంథ చౌర్యానికి పాల్పడ్డ వ్యక్తులు నేడు సులువుగా దొరికిపోతారు. ఉర్దూలోని ఓ నానుడి గుర్తుకొస్తుంది. న్రఖల్ కర్నే వాలోంకో అకీల్ రహానా కాపీ కొట్టేవాడికి కొంత జ్ఞానం ఉండాలి. న్యాయసహాయకుల తెలివితేటల్ని పూర్తిగా విశ్వసిం చకుండా చూడాల్సిన బాధ్యత ఆ సహాయం తీసుకున్న వ్యక్తులపై ఉంటుంది. గ్రంథ చౌర్యానికి సంబంధించి మన దేశంలో ప్రత్యేక చట్టం లేదు కానీ కాపీ రైట్ చట్టం పరిధిలోకి ఈ చర్యలు వస్తాయి. మంగారి రాజేందర్, వ్యాసకర్త డిస్ట్రిక్ట్/సెషన్స్ జడ్జి (రిటైర్డ్), మొబైల్ : 9440483001