అమితాబ్‌బచ్చన్ (ట్విటర్ ఫొటో)
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ కోపం వచ్చింది. ట్విటర్‌ను వేదికగా చేసుకుని ఆ కోపాన్ని ప్రదర్శించారు. ఇంతకు బిగ్ బీకి అంత కోపం తెప్పించిన అంశం ఏంటంటే ఆయన తండ్రి ప్రముఖ రచయిత హరివంశరాయ్ బచ్చన్ రచనల మీద 1957 కాపీ హక్కుల చట్టం మేరకు అమితాబ్‌కు ఉన్న హక్కులను కోల్పోనున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన అనంతరం ఆ వ్యక్తి రచనల మీద అతని వారసులకు కేవలం 60 ఏళ్ల వరకే హక్కులు ఉంటాయి. తర్వాత ఆ రచనలను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో అమితాబ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 60 ఏళ్లే వారసులకు హక్కులు ఉంటాయని ఎవరూ నిర్ణయించారు. అయినా 60 ఏళ్లే ఎందుకు ఉండాలి, 61 ఏళ్లనో, శాశ్వతంగానో ఎందుకు ఉండకూడదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
‘కాపీ హక్కు చట్టాలను చెత్తగా వర్ణిస్తూ అసలూ ఈ మేథోపరమైన హక్కులను ఎవరూ నిర్ణయించారు. నా తండ్రికి నేను వారసున్ని, ఆయన రచనల మీద కూడా నాకే పూర్తి హక్కు ఉంటుంది. నా తండ్రి మరణించి 60 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి ఇంక నాకు హక్కు లేదంటే ఎలా కుదురుతుంది. ఇప్పుడు ఎవరైనా వారి అవసరాలకోసం నా తండ్రి సాహిత్యాన్ని వారి ఇష్టారీతిగా ఉపయోగించుకోవచ్చా? అలా ఎప్పటికి జరగదు. విలియం షేక్‌స్పియర్, మిస్టర్ బీథోవెన్, మెస్సర్స్ చోపిన్, చైకోవ్‌స్కీ మన దేశానికి వస్తే గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్... వీళ్లేవరికి ఈ కాపీరైట్ హక్కు గురించి తెలియదు. వారి రచనలకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవు. అందువల్ల వారి రచనలను అందరూ వాడుకుంటున్నారు. దానివల్ల వారి నిజమైన వారసులకు నష్టం కలుగుతోంది. నేను మాత్రం ఈ విషయం మీద పోరాడతాను’ అంటూ ముగించారు.
హరివంశరాయ్ బచ్చన్ రచనల్లో మధుశాల, అగ్నిపత్, రుకే నా తు, హిమ్మత్ కర్నే వాలోంకి హర్ నహీ హోతి వంటివి కొన్ని ప్రముఖమైనవి.
Comments
Please login to add a commentAdd a comment