Shakespeare
-
షేక్స్పియర్ నోట అన్నమయ్య పాట
తెలుగునాట తాళ్లపాక గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించిన అన్నమాచార్యులు సంస్కృతాంధ్ర భాషల్లో రచించిన వేల పదకవితలు పండితులను, పామరులను రంజింపజేశాయి. తత్త్వసంకీర్తనలు గానం చేస్తూ, తంబురమీటుతూ పురవీధులలో, తిరువీధులలో నాట్యం చేశాడు అన్నమయ్య. ఆనాటి వేద వాఙ్మయం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు అన్ని ప్రక్రియల్లో కనిపించే మానవతాధర్మాలు అన్నమయ్య పదాలలో గమనించవచ్చు. ‘నానాటి బతుకు నాటకము/ కానక కన్నది కైవల్యము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్టనడిమి పని నాటకము/ యెట్ట నెదుట గల దీ ప్రపంచము/ కట్ట గడపటిది కైవల్యము/ కుడిచే దన్నము కోక చుట్టెడిది/ నడ మంత్రపు పని నాటకము/ వొడి గట్టుకొనిన వుభయ కర్మములు/ గడి దాటినపుడె కైవల్యము/ తెగదు పాపము తీరదు పుణ్యము/ నగి నగి కాలము నాటకము/ యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక/ గగనము మీదిది కైవల్యము’ అన్నాడు అన్నమయ్య. ఎదుట కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలం, దానిపై మానవుల అశాశ్వతమైన బతుకు నాటకమేనని ఉద్బోధించాడు. మనిషి పుట్టడం నిజం, మరణించడం నిజం, ఈ మధ్య జరుగుతున్న బతుకు కేవలం నాటకం; ఈ జనన మరణచక్రం ఎక్కడ ఆగుతుందో అదే కైవల్యము అన్నాడు. అన్నమయ్య తదనంతరం 16వ శతాబ్దిలో బ్రిటన్‌లో జన్మించిన షేక్స్పియర్ నటుడిగా, నాటకకర్తగా, కవిగా ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచాడు. ఆయన నాటకాల్లో ‘యాజ్ యు లైక్ ఇట్’ ఒకటి. ఇందులో ప్రేమకథను సుఖాంతంగా చిత్రించాడు. మానవ జీవితాంకాలు దశలుగా విభజించి నాటక రంగంలోని పాత్రలవలె మనిషి ఎలా జీవిస్తాడో షేక్స్పియర్ ఇందులో చెబుతాడు. The whole world is a stage, and all the men and women merely actors. They have their exits and their entrances, and in his lifetime a man will play many parts... ప్రపంచమంతా ఒక నాటక రంగం. స్త్రీ పురుషులందరూ అందులో కేవలం పాత్రధారులు. వారి వారి ప్రవేశాలు, నిష్క్రమణలు వారికుంటాయి. ఒక మనిషి తన జీవితకాలంలో అనేక పాత్రల్ని పోషిస్తాడు’ అంటాడు షేక్స్పియర్. భగవంతుడు ఈ అఖండ విశ్వాన్ని రంగస్థలముగా చేసి, అందులో మానవులకు వారి కర్మలనుబట్టి పాత్రలను కల్పించి, పావులుగా కదుపుతూ వారి జీవితాలతో ఆడుతున్న వింత నాటకమే ఈ జగన్నాటకం అని ఇద్దరు మహాకవులూ విశదపరిచారు. విభిన్న దేశాలలో, విభిన్న కాలాలలో జీవించినప్పటికీ, వారి భాషలు వేరైనప్పటికీ వారి భావమొక్కటే. వీరిద్దరి పద, పద్య పాదాలను పరిశీలిస్తే అన్నమయ్య తెలుగుపాటే షేక్స్పియర్ కవితగా మారిందా అనిపిస్తుంది. -యానాద్రి 97018 57260 -
‘షేక్’ చేస్తోన్న శశి థరూర్
ఫేస్‌యాప్‌లు వచ్చాక సెలబ్రెటీల ఫోటోలు మార్ఫింగ్ చేయడం ఫ్యాషన్ అయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫోటోను ప్రసిద్ధ ఇంగ్లీష్ నాటక రచయిత షేక్స్పియర్లా గుర్తుతెలియని వ్యక్తి మార్ఫింగ్ చేశారు. ఇది వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ శశిథరూర్‌కు చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శశిథరూర్ ఆ ఫోటోను తాజాగా ట్విటర్లో షేర్ చేసి దానిపై ఓ ఫన్నీ కామెంట్ పెట్టారు. ‘ఈ రోజు వాట్సాప్‌లో చాలా ప్రశంసనీయమైన చిత్రం చూశాను. నన్ను షేక్స్పియర్లా మార్చాలని చూడటంపై ఆశ్చర్యపోయాను. అయితే అలా మార్చడానికి కాస్త ఇబ్బంది పడినట్లున్నారు. నేను ఆ గౌరవానికి అర్హుడిని కానప్పటికీ.. ఎవరైతే మార్ఫింగ్ చేశారో వారికి ధన్యవాదాలు..’ అని ట్వీట్ చేశారు. శశిథరూర్ ట్వీట్‌తో ఈ ఫోటో మరింత వైరల్ అయి నెటిజన్ల కామెంట్లకు వేదిక అయింది. శశిథరూర్ అంటేనే చెలరేగే కొందరు ఈ ఫోటోపై ఓ రేంజ్లో విజృంభిస్తున్నారు. మరికొందరు శశిథరూర్‌ను సమర్థిస్తూ ఆ ఫోటోకు పూర్తి అర్హత ఉందంటున్నారు. ఓ నెటిజన్ ‘మీసాలు లేని షేక్స్పియర్ అనుకుంటున్నావా? అంతలేదు నువ్వు షేక్‌స్పియరుద్దీన్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ‘మీరు షేక్స్పియర్ కన్నా విలువైన వారు, గొప్ప రచయిత, రాజకీయవేత్త, మంచి మార్గ నిర్దేశకులు, మీ ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ కామెంట్లతో శశి థరూర్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. -
జూలియస్ సీజర్
ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం షేక్స్పియర్ రాసిన చారిత్రక విషాదాంత నాటకం ‘జూలియస్ సీజర్’ నేటికీ ప్రదర్శితమవుతోంది. పాత్రల స్వరూప స్వభావాలను లోతుగా అధ్యయనం చేసి బరువైన సంభాషణలతో ఈ నాటకం రాశారు షేక్స్పియర్. సీజర్ గొప్ప వీరుడు. రోమ్ సైన్యాధిపతిగా ఉన్న సీజర్ ఓసారి ఆఫ్రికా నుంచి రోమ్ నగరానికి విజయగర్వంతో వస్తాడు. మార్గమధ్యంలో ఓ జ్యోతిష్కుడు ఎదురై ‘మార్చి 15వ తేదీ వస్తోంది, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు. మూఢనమ్మకాలంటే గిట్టని సీజర్ ఆ మాటల్ని కొట్టేస్తాడు. సీజర్ బలపడుతున్నాడనీ, నియంతగా మారతాడనీ, గణతంత్రానికి గండి పడుతుందనీ భయపడిన వాళ్లలో బ్రూటస్ ఒకడు. రోమ్ నగర పెద్దలలో ఒకడైన కేషియస్... బ్రూటస్ను కలిసి సీజర్‌ను హతమార్చడమే తక్షణ కర్తవ్యమని బ్రూటస్ను సన్నద్ధం చేస్తాడు. మానవ స్వభావాన్ని అవపోసన పట్టిన సీజర్ ఓసారి బ్రూటస్ పక్కనే వున్న కేషియస్ను చూస్తాడు. తనకు ఆప్తుడైన ఆంటోనీతో ‘ఆ కేషియస్ను చూశావా? బక్కపలుచని శరీరం ఉన్నవాళ్లు, ఆకలిచూపుల వాళ్లు, ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుండేవాళ్లు, నవ్వలేనివాళ్లు, సంగీతాన్ని మెచ్చుకోలేనివాళ్లు ఎంతో ప్రమాదకరమైనవాళ్లు’ అంటాడు.సీజర్ హత్య జరగబోయే ముందురోజు రాత్రి అతని భార్య కాల్ఫూర్నియా ఓ పీడకల కంటుంది. సీజర్‌ను హత్య చేస్తున్నారు అని మూడుసార్లు బిగ్గరగా అరుస్తుంది. సెనేట్ సమావేశానికి గైర్హాజరు కమ్మని విన్నవిస్తుంది. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారే చవిచూస్తారు. ప్రమాదం కంటే సీజర్ ప్రమాదకారి’ అంటూ సీజర్ జవాబిస్తాడు. సీజర్ సెనేట్ మందిరానికి వెళ్తాడు. కుట్రదారులు కత్తితో పొడుస్తారు. బ్రూటస్ది చివరి కత్తిపోటు. ‘బ్రూటస్ నువ్వు కూడానా’ అంటూ సీజర్ ప్రాణాలు విడుస్తాడు. సీజర్ అంత్యక్రియలకు ముందు ఓ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బ్రూటస్, సీజర్‌పై నాకు ద్వేషం లేదు, అతనికి అధికార కాంక్ష పెరిగింది, ఆయన బతికివుంటే నియంతగా మారతాడు, మీరంతా బానిసలు అవుతారని వివరిస్తాడు. ఇంతలో ఆంటోనీ, సీజర్ పార్థివదేహాన్ని తీసుకొని వస్తాడు. ‘సీజర్కు మూడు సార్లు కిరీటం ఇచ్చినా తిరస్కరించాడు. ఇదేనా సీజర్ అధికార దాహం’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. నేను బ్రూటస్వంటి మాటకారినైతే సీజర్ గాయాలతో మాట్లాడించగలను, రోమ్ రాళ్లతో ప్రతిఘటించగలను అంటాడు. మేం తిరగబడతాం, అంటూ మృతదేహం వద్ద గుమికూడిన ప్రజలు గర్జిస్తారు. ఇదిలావుండగా ఆంటోనీ బలపరాయణుడని గుర్తించిన బ్రూటస్ భార్య పోర్షియా నిప్పులు మింగి చనిపోతుంది. తర్వాత ఆంటోనీ, బ్రూటస్ వర్గాల మధ్య పోరు సాగుతుంది. సీజర్‌ను పొడిచిన కత్తితోనే నౌకరు చేత పొడిపించుకుని కేషియస్ చనిపోతాడు. బ్రూటస్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోతాడు. అంతిమ విజయం ఆంటోనీ, అతని మిత్రుడు ఆక్టేవియస్ సీజర్‌ను వరిస్తుంది. ఆక్టేవియస్ రోమన్ సామ్రాజ్యాధిపతి అవుతాడు. గగుర్పాటు కలిగించే విధంగా అన్ని పాత్రలనూ తన శైలీ సంభాషణలతో షేక్స్పియర్ తీర్చిదిద్దిన నాటకం ఇది. వాండ్రంగి కొండలరావు -
ఆ హక్కును కోల్పోయిన బిగ్ బీ
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ కోపం వచ్చింది. ట్విటర్‌ను వేదికగా చేసుకుని ఆ కోపాన్ని ప్రదర్శించారు. ఇంతకు బిగ్ బీకి అంత కోపం తెప్పించిన అంశం ఏంటంటే ఆయన తండ్రి ప్రముఖ రచయిత హరివంశరాయ్ బచ్చన్ రచనల మీద 1957 కాపీ హక్కుల చట్టం మేరకు అమితాబ్‌కు ఉన్న హక్కులను కోల్పోనున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన అనంతరం ఆ వ్యక్తి రచనల మీద అతని వారసులకు కేవలం 60 ఏళ్ల వరకే హక్కులు ఉంటాయి. తర్వాత ఆ రచనలను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ విషయంలో అమితాబ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 60 ఏళ్లే వారసులకు హక్కులు ఉంటాయని ఎవరూ నిర్ణయించారు. అయినా 60 ఏళ్లే ఎందుకు ఉండాలి, 61 ఏళ్లనో, శాశ్వతంగానో ఎందుకు ఉండకూడదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ‘కాపీ హక్కు చట్టాలను చెత్తగా వర్ణిస్తూ అసలూ ఈ మేథోపరమైన హక్కులను ఎవరూ నిర్ణయించారు. నా తండ్రికి నేను వారసున్ని, ఆయన రచనల మీద కూడా నాకే పూర్తి హక్కు ఉంటుంది. నా తండ్రి మరణించి 60 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి ఇంక నాకు హక్కు లేదంటే ఎలా కుదురుతుంది. ఇప్పుడు ఎవరైనా వారి అవసరాలకోసం నా తండ్రి సాహిత్యాన్ని వారి ఇష్టారీతిగా ఉపయోగించుకోవచ్చా? అలా ఎప్పటికి జరగదు. విలియం షేక్స్పియర్, మిస్టర్ బీథోవెన్, మెస్సర్స్ చోపిన్, చైకోవ్స్కీ మన దేశానికి వస్తే గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్... వీళ్లేవరికి ఈ కాపీరైట్ హక్కు గురించి తెలియదు. వారి రచనలకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవు. అందువల్ల వారి రచనలను అందరూ వాడుకుంటున్నారు. దానివల్ల వారి నిజమైన వారసులకు నష్టం కలుగుతోంది. నేను మాత్రం ఈ విషయం మీద పోరాడతాను’ అంటూ ముగించారు. హరివంశరాయ్ బచ్చన్ రచనల్లో మధుశాల, అగ్నిపత్, రుకే నా తు, హిమ్మత్ కర్నే వాలోంకి హర్ నహీ హోతి వంటివి కొన్ని ప్రముఖమైనవి. -
షేక్స్పియర్ రచనల్లో మహిళల పాత్ర
భీమవరం: షేక్స్పియర్ రచనల్లో మహిళల పాత్రలు ఎంతో ప్రభావవంతమైనవి అందువల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ షేక్స్పియర్ రచనలు తప్పనిసరిగా చదవాలని శాతివాహన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ భాస్కరరావు అన్నారు. భీమవరం ఆర్‌ఆర్‌డీఎస్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన షేక్స్పియర్ రచనలపై జాతీయస్థాయిలో సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా సావనీర్‌ను విడుదల చేశారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సనత్‌కుమార్ అధ్యక్షత వహించగా పాలకొల్లు దాసరి నారాయణరావు‡ కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, గుంటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకురాలు డాక్టర్ వరలక్ష్మి, అక్కిరాజు, రవిశంకర్, స్వరూప, శ్రీలక్ష్మి, పార్వతి, మోజేస్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మైడియర్ షేక్స్పియర్
విలియం షేక్స్పియర్ (ఏప్రిల్ 1564-ఏప్రిల్ 23, 1616) ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి. ఏప్రిల్ 23న 400వ వర్ధంతి. ఈ సందర్భంగా బ్రిటిష్ కౌన్సిల్ అనే సంస్థ యూగవ్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. పదిహేను దేశాలలో 18 వేల మంది ఇందులో పాల్గొన్నారు. చిత్రం ఏమిటంటే ఆయనని అర్థం చేసుకోవడంలో, ఇష్టపడడంలో, ఆయన రచనలు నేటి కాలానికి వర్తిస్తాయని నమ్మడంలో ఇంగ్లిష్‌వాళ్లు వెనకపడిపోయారని తేలింది. షేక్ స్పియర్‌ని అర్థం చేసుకోగలిగామని చెప్పిన భారతీయులు 83 శాతం. ఆ మాట ఇంగ్లండ్‌లో చెప్పినవాళ్లు 58 శాతం. ఆయనంటే మేము చాలా ఇష్టపడతామని 88 శాతం మెక్సికన్లు చెబితే, ఆ మాట ఇంగ్లండ్‌లో 59 శాతమే చెప్పారట. ఆయన రచనలలో నేటికీ ప్రాసంగికత ఉందని 84 శాతం బ్రెజిల్ జాతీయులు చెప్పారు. ఆ మాట ఇంగ్లండ్‌లో 57 శాతం మంది మాత్రమే చెప్పారు. మొత్తంగా చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలోనే షేక్స్పియర్కు అపారమైన అభిమానులు ఉన్నారు. నిజానికి మన తెలుగువాళ్లకి కూడా షేక్స్పియర్ అంటే బాగా అభిమానమే. గురజాడ అయితే గిరీశం చేతే ఏమివాయ్ మైడియర్ షేక్స్పియర్ అనిపించాడు. ఆ పాత్ర నోటి నుంచే రెండుమూడు సార్లు మహాకవి ప్రస్తావన చేయించాడు మన మహాకవి. ఆయన రాసిన విషాదాంత నాటకాలు, సుఖాంతాలు ఈనాటికీ ప్రపంచ రంగస్థలం మీద దర్శనమిస్తూనే ఉన్నాయి. వెండితెర మీద నర్తిస్తూనే ఉన్నాయి. నమ్మకద్రోహానికి ప్రత్యామ్నాయ వ్యక్తీకరణగా ‘యూ టూ బ్రూటస్’ అన్న షేక్స్పియర్ సంభాషణా శకలాన్ని ఉపయోగించడం పరిపాటి. అలాగే డోలాయమాన స్థితిలో ఉండేవారి గురించి చెప్పే ‘టుబి ఆర్ నాట్ టుబీ’ కూడా అలాంటిదే. ఇంకా ఎన్నో! -
షేక్ స్సియర్ తరహా పదాలను వాడేయండి ఇలా..
లండన్: విలియమ్ షేక్ స్సియర్ కీ బోర్డు పేరుతో స్విఫ్ట్ కీ అనే టెక్నాలజీ సంస్థ రచయిత 400వ వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద ఆండ్రాయిడ్, ఐ ఓఎస్‌ల యాప్‌లను విడుదల చేసింది. షేక్ స్సియర్ మాదిరి పదాల వాడుకకోసం ప్రత్యేకంగా ఈ యాప్‌ను తయారు చేశామని వివరించింది. సంస్థకు చెందిన టెక్నిషన్లు షేక్ స్సియర్ రచనలన్నీ పూర్తిగా చదివిన తర్వాత యాప్‌ను తయారు చేసామని తెలిపింది. వినియోగదారులు పియర్ రచనల తరహా పదాలను ఇష్టం వచ్చినపుడు వాడుకునేలా యాప్‌ను డిజైన్ చేసింది కంపెనీ. యాప్‌లో ఉండే ప్రిడిక్టివ్ టెక్నాలజీ ఫేక్ టెక్ట్స్‌ను తయారుచేసుకుంనేదుకు సహాయపడుతుంది. స్విఫ్ట్ కీ సహ భాగస్వామి సారా రౌలీ మాట్లాడుతూ.. షేక్ స్సియర్ తన కొత్త భాషా పాటవంతో పాఠకులను అలరించారు. ఇప్పుడు ప్రజలందరూ ఆ భాషను తమ మొబైళ్లలో అందుకోవచ్చు. 'షేక్ స్పీక్' పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. -
షేక్స్పియర్ మహిళనా?
లండన్: హ్యామ్లెట్, ఒథెల్లో, మ్యాక్బెత్ లాంటి విషాధభరిత నాటకాలతోపాటు హాస్య, శృంగార నాటకాలతో, సమకాలీన కవిత్వంతో అశేష అభిమానులను కూడగట్టుకున్న ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియమ్ షేక్స్పియర్ మగవాడు కాదా? మహిళనా? అవును. ఆయన ఆయన కాదు. ఆమె అంటూ షేక్స్పియర్ సాహిత్యం, జీవితంపై ఎన్నో పరిశోధనలు సాగించిన జాన్ హడ్సన్ తెలియజేస్తున్నారు. షేక్స్పియర్ అసలు పేరు అమేలియా బస్సానో అని, ఆమె నల్లటి కురులు కలిగిన యూదు జాతి మహిళని, అమె వంశస్థులు క్వీన్ ఎలిజబెత్-1 కాలంలో సంగీత విద్వాంసులుగా పనిచేశారని జాన్ హడ్సన్ ‘షేక్స్పియర్స్ డార్క్ లేడీ’ పేరుతో రాసిన తాజా పుస్తకంలో వెల్లడించారు. ఆమె లార్డ్ చాంబెర్లేన్ హెన్రీ కేరీని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. నాటి ఇంగ్లీష్ థియేటర్‌కు హెన్రీ కేరి ఇంచార్జిగా పనిచేశారని, అందుకనే ఆమె నాటకాలను అనేకం ఆ థియేటర్లో ప్రదర్శించారని చెప్పారు. షేక్స్పియర్ నాటకాల్లో ప్రతిబింబించే ఇటలీ సంస్కృతి గురించి ఇంగ్లండ్‌లో పుట్టిపెరిగి ఇక్కడే అసువులు బాసిన బస్సానోకు ఎలా తెలుసుననే అనుమానానికి జాన్ హడ్సన్ వివరణ ఇస్తూ అమేలి కుటుంబం ఇటలీ నుంచి వలస వచ్చిందని, అందుకనే ఆమెకు ఇటలీ సంస్కృతి గురించి తెలుసని చెప్పారు. ఒథెల్లో నాటకంలో ఎమెలీ అనే, మర్చంట్ ఆఫ్ వెనీస్‌లో బస్సానో అనే క్యారెక్టర్లు ఆమె పేరును ప్రతిబింబిస్తున్నాయని కూడా హడ్సన్ తెలిపారు. క్రిస్టఫర్ మార్లో అనే ప్రసిద్ధ నాటక రచయితతో బస్సానోకు ఎఫైర్ కొనసాగించారని, ఆమె 1645లో చనిపోవడానికి ముందు గర్భవతి అని కూడా హడ్సన్ పేర్కొన్నారు. దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం మరణించిన షేక్స్పియర్ ఎవరనే విషయంలో ఇప్పటికే ఎన్నో థియరీలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవాలను తెలుసుకునేందుకు స్టార్ట్ఫోర్డ్లోని ట్రినిటీ చర్చిలోవున్న షేక్స్పియర్ సమాధిపై కూడా చాలా పరిశోధనలు జరిగాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా పురావస్తు తత్వవేత్తలు పరిశోధించగా 1794లోనే ఆయన పుర్రె మాయం అయిందనే విషయం వెలుగుచూసింది. వాస్తవాస్తవాలు తేలాలంటే మరెన్నేళ్లు పరిశోధనలు జరగాలో! -
అదరగొట్టారు
స్కూలు ఫంక్షన్స్‌లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వటం మాములే. అలా ఓ స్కూల్లో వేసిన నాటకంలో వాళ్ల ఇన్వాల్వ్మెంట్, టాలెంట్ చూసి ముచ్చట పడిన యాజమాన్యం.. మరోసారి పెద్దల కోసమంటూ లామకాన్‌లో వీళ్లతో ఓ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా పిల్లలు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు, చక్కటి హావభావాలతో మురిపించారు. కామెడీ, సెటైర్, చక్కటి భాష కలిసిన ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. షేక్స్పియర్ రాసిన నాటకాలు అర్థం చేసుకోవటమే కష్టం. అలాంటిది ఆ నాటకాన్ని అలవోకగా ప్రదర్శించడం మహామహా నటులకే సాధ్యమయ్యే పని. అంతటి క్లిష్టమైన నాటకాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు... అనుభవమున్న నటుల్లా ఆయా పాత్రల్లో జీవించారు చిన్నారులు. నగరంలోని శ్లోక పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్స్పియర్ ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకాన్ని నవరస రంజితంగా ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఒరిజినల్లో వున్న క్యారెక్టర్లు, కథనం అలాగే ఉన్నాయి. సంభాషణలు మోడరన్ డేస్‌కి అనువుగా మార్చి, కాంటెపరరీగా మలిచిన ఈ నాటకం అబ్బురపరిచింది. ఊహించని మలుపులు.. షేక్స్పియర్ నాటకం విషయానికి వస్తే.. ‘ఫ్రెడరిక్ తన అన్న డ్యూక్ ఆస్తిని ఆక్రమించుకుని అతన్ని తరిమేస్తాడు. కానీ అతని కూతురు రోజాలిండ్ని మాత్రం తన కూతురు సిలియా కోసం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చూసీ చూడగానే రోజాలిండ్ ప్రేమలో పడతాడు పరదేశ యువరాజు ఆర్నాల్డో. అతని అన్న ఆలివర్. రోజాలిండ్ ప్రేమ విషయం తెలిసి ఫ్రెడరిక్ కోపగించుకొని దండించబోతాడు. తట్టుకోలేక రోజాలిండ్ అబ్బాయిగా, సిలియా ఎలీనాగా వేషం వేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. మారువేషాల్లో వున్న ఎలీనాతో అలివర్ ప్రేమలో పడతాడు. మగవేషంలో ఉన్న రోజాలిండ్ ఆర్నాల్డోని కలుస్తుంది. ప్రేమకోసం తపిస్తూ అతను రాస్తున్న కవితలు చదివి, ఆ ప్రేమను మరిచిపొమ్మని చెబుతుంది. మరోవైపు రోజాలిండ్ని అబ్బాయి అనుకుని ఫేబ్ అనే అమ్మాయి ఆమెను ప్రేమిస్తుంది. ఇలా ఒక ప్రేమ జంటతో మొదలైన కథలోకి నాలుగు జంటలు వస్తాయి. చివరికి సుఖాంతమవుతుంది. అయితే మధ్యలో వచ్చే అనేక పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రపంచం నేటికి చెప్పుకునే ‘జీవితం ఒక రంగస్థలం లాంటిది, అందులో మనమందరం పాత్రధారులం’ డైలాగ్స్ ఈ నాటకంలోనివే. -
విస్మృత ప్రజాగాయకుడు నంద కృష్ణమూర్తి
కొంతమంది పుట్టుకతోనే గొప్ప వారవుతారు. మరి కొంతమంది ఎంతో కృషి చేసి గొప్పవారవుతా రు. వేరే కొంతమంది అదృష్టం వరించి గొప్పవారవు తారని ఆంగ్ల నాటకకర్త షేక్స్పియర్ పేర్కొన్నారు. ఇందులో రెండవ కోవకు చెందిన వారు నంద కృష్ణ మూర్తి. స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రజా గాయకునిగా వర్థిల్లిన ఆయనకు అనుకున్నంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లాలో పదిమంది స్వాతంత్య్ర సమరయోధులకు నెలవైన కనిమెట్టలో నందశేష య్య, చిన్నమ్మ దంపతులకు 1921, మార్చి 13న కృష్ణమూర్తి జన్మించారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాలను పుణికిపుచ్చుకున్నారు. 8వ తరగతి వర కు మాత్రమే చదువుకున్నారు. తర్వాత ఆమదాల వలస సమీపంలో గట్టుముడిపేటలోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయు నిగా పనిచేశారు. గాంధీజీ పిలుపునందుకుని ఉద్యో గానికి స్వస్తి చెప్పి స్వాతంత్య్ర సమరంలో నేను సయితం అంటూ పాల్గొన్నారు. తన పాటల ఈటెల తో ఆంగ్లేయులను హడలెత్తించారు. స్వాతంత్య్రం నా జన్మహక్కు కాదన్నవాడి పీకనొక్కు లాంటి నినా దాలతో ఆంధ్ర, ప్రవాసాంధ్ర ప్రాంతాలను దద్దరిల్ల జేశారు. ఆచార్య ఎన్.జీ.రంగా, సర్దార్ గౌతు లచ్చన్నల ముఖ్య అనుచరుడిగా ఉంటూ వారు పాల్గొన్న అన్ని సభల్లో స్వాతంత్య్రోద్యమ గీతాలను ఆలపించా రు. నిద్రాణమై ఉన్న ప్రజానీకాన్ని తన ఆటపాటలతో మేల్కొలిపి స్వరాజ్య ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆయన స్వరం.. స్వరం కాదు. అదో భాస్వరం. అదో బడబాగ్ని. వలస పాలనకు వ్యతిరేకంగా క్రిప్స్ రాయబారం పేరుతో కృష్ణమూర్తి దళం పల్లెల్లో, పట్నాల్లో ప్రదర్శించిన బుర్రకథ ప్రభంజనం సృష్టిం చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహానికి గురై అరెస్ట య్యారు. ఆయనతో పాటు నంద ఆదినారాయణ, కూన ఎర్రయ్య, కూన అప్పలసూరి, కూన బుచ్చ య్య, గురగుబెల్లి సత్యనారాయణ, అన్నెపు అప్ప య్య తదితరులను పాలీసులు అరెస్టు చేశారు. భారత మాతకు జైకొట్టరా, బానిస బతుకులకు చరమగీతం పాడరా వంటి విప్లవ గీతాలతో హోరె త్తించిన కృష్ణమూర్తి నాటి ప్రజానీకానికి దిక్సూచిగా నిలిచారు. శ్రీకాకుళం రోడ్-పొందూ రు రైల్వేస్టేషన్ల మధ్యగల దూసి ఆర్. ఎస్ వద్ద పట్టాలు తప్పించడం, కళింగ పట్నంలో తపాలా కార్యాలయం దోపి డీతో పాటు పలు ఉదంతాల్లో కృష్ణ మూర్తితో సహా పలువురిపై కేసులను పోలీసులు నమోదు చేసి కారాగారానికి పంపారు. 1940, జనవరి 20న మహాత్మాగాంధీ దూసి రైల్వే స్టేషన్లో సభను నిర్వహించినప్పుడు జన సమీకరణ చేసి జయప్రదం చేసిన ఘనత ఆయ నకే దక్కుతుంది. ఆచార్య ఎన్.జి.రంగా, గౌతులచ్చ న్న, కిల్లి అప్పల్నాయుడు, బెండి అప్పలసూరి వంటి ప్రముఖులకు స్వగ్రామమైన కనిమెట్టలో ఆశ్రయం కల్పించిన ఖ్యాతి కృష్ణమూర్తి బృందానికే దక్కుతుం ది. వీరందరికీ భోజన వసతులను కల్పించారు. పోలీసుల దృష్టికి రాకుండా అన్ని జాగ్రత్తలను తీసు కుని రహస్య జీవితాన్ని కొన్నాళ్లు అక్కడే గడిపారు. కారాగార జీవితం అనంతరం కృష్ణమూర్తి జాతీ య కాంగ్రెస్‌లో కీలక భూమికను పోషించారు. స్వాతంత్య్రం వచ్చినతర్వాత పూర్తిగా ఆయన రాజకీ యాలకే అంకితమయ్యారు. 1953లో జరిగిన విశాఖ జిల్లా బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఆధిక్యతతో విజయం సాధించి సత్తాచూపించారు. విశాఖపట్నం లో జల ఉష అనే నౌకను ప్రారంభించేందుకు వచ్చిన తొలి ప్రధాని నెహ్రూ పాల్గొన్న సభలో కృష్ణమూర్తి జాతీయ, దేశభక్తి గీతాలను పాడారు. తెలుగు భాష రాని నెహ్రూ ఆయన గానాన్ని విని అభినందించా రు. ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసమే తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు కృష్ణ మూర్తి తన 34వ ఏట 1955, సెప్టెంబర్ 26న ఈ ప్రపంచం నుంచి నిష్ర్కమించారు. కృష్ణమూర్తి స్వగ్రామం కనిమెట్టలో అక్కడి ప్రగ తి యువజన సంఘం ప్రతి ఏటా నంద కృష్ణమూర్తి జయంతిని నిర్వహిస్తోంది. ఆనాటి సమరయోధుల సంస్మరణార్థం ప్రగతి యువజన సంఘం అధ్య క్షులు సూరు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 2000 సంవత్సరం జనవరి 26న ప్రాథమిక పాఠశాల ఆవ రణలో ఆయన స్తూపాన్ని ఏర్పాటు చేశారు. (నేడు నంద కృష్ణమూర్తి 95వ జయంతి) వి. కొండలరావు సీనియర్ జర్నలిస్టు, పొందూరు మొబైల్: 9490528730 -
సత్యం: పరిపూర్ణ నాటకకర్త
ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్ కాక మరెవరు రాయగలరు! నాటక రచయిత హెన్రిక్ ఇప్సెన్ జయంతి మార్చ్ 20న... నాటకకర్తగా హెన్రిక్ ఇప్సెన్ స్థానం ఇలా ఉండొచ్చు. ఆధునికపూర్వ నాటకాలను పరిగణనలోకి తీసుకుంటే గనక, ఆయన షేక్స్పియర్ తర్వాత షేక్స్పియర్ అంతటివాడు. ఆధునిక రంగస్థల రచయితల్లోమాత్రం ఇప్సెన్ అంతటివాడు ఇప్సెనే!ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్(1828-1906) కాక మరెవరు రాయగలరు! తొలిరోజుల్లో ‘రోజువారీ బలవంతపు అబార్షన్’లాగా నాటకాలు రాసినప్పటికీ, మనో విశ్లేషణనూ, నైతిక తీవ్రతనూ, సామాజిక ప్రాధాన్యాలనూ నాటకంలో ప్రవేశపెట్టడం ద్వారా ‘రంగస్థల ఫ్రాయిడ్’ అనిపించుకున్నాడు. అలాగే, తొలిదశలో తన నాటకాల్లో నార్వే ‘జాతి నిర్మాణం’కోసం పాటుపడాలన్న ధోరణి కనబరిచినప్పటికీ, అంతకుమించిన మానవీయ అంశను పట్టుకోవడం ద్వారా తన పాత్రలకు ‘అంతర్జాతీయ’ క్యారెక్టర్ ఇవ్వగలిగాడు. ద ప్రిటెండర్స్, బ్రాండ్, పీర్ జైంట్, ఎంపరర్ అండ్ గెలీలియన్, పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, ఘోస్ట్స్, ద వైల్డ్ డక్, ద లేడీ ఫ్రమ్ ద సీ, హెడ్డా గాబ్లర్ ఆయన నాటకాల్లో కొన్ని! నిర్ణయాలు తీసుకోలేని స్వభావం, నిర్ణయాల పరిణామాలు గ్రహించలేనితనం, గుడ్డిగా ముందువాళ్లను అనుకరించేగుణం, విజయపు బరువును మోయలేని బలహీనత, ఎలాగో బతుకుతూ ఇంకెలాగో బతకాలనుకునే నిరంతర సంఘర్షణ, సామర్థ్యానికీ, కాంక్షకూ మధ్య వైరుధ్యం, వెలుగుకు భయపడేతత్వం, బూర్జువా కుటుంబాల్లోని నిత్య అభద్రత, కపటం... ఇలా జీవితపు బహుముఖీనత ఆయన నాటకాల్లో దర్శనమిస్తుంది. జీవితంలోని కామెడీ, ట్రాజెడీ కలగలిసిపోయిన వైచిత్రి కూడా కనబడుతుంది. భద్రతనూ, ఉద్వేగాన్నీ ఏకకాలంలో ఆశించేజీవుల్నీ, ఇదివుంటే అదీ, అదివుంటే ఇదీ కోరుకునే వివాహ సంబంధాల్నీ కూడా ఆయన స్కాన్ చేశాడు. ప్రత్యేకంగా స్త్రీవాదం రాయకపోయినా తన రచనలద్వారా ఫెమినిస్టులకు ఊతం కాగలిగాడు. పెళ్లంటే చట్టబద్ద వ్యభిచారమని అభివర్ణించాడు. వివాహం చుట్టూవుండే బేరసారాల్ని నిరసించాడు. పెళ్లి తర్వాత కనబడే సంతోషం అబద్ధమైనా అయివుండాలీ, లేదా సమాజపు ఒత్తిడి అయినా అయివుండాలీ, అని నర్మగర్భంగా ప్రకటించాడు. వ్యక్తివాదంలో ఇప్సెన్కు నమ్మకం. నీకు నువ్వు నిర్వర్తించుకోవాల్సిన విధి అన్నింటికంటే ముఖ్యమైందనేవాడు. ఎన్ని అవరోధాలున్నా ఒక మనిషి తన ఇఛ్చానుసారం బతికే వీలుండాలనీ, వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం కూడా కావాలనీ రాశాడు. ‘ఎ డాల్స్ హౌజ్’లో నోరా అంటుంది: ‘‘ఎవరు సరో నేనూ తేల్చుకుంటాను, ఈ సమాజమో, నేనో’’. అయితే, ఏ హక్కుల కోసమైనా శాసనాలు, సంస్థాగత పరిష్కారాల మీద ఆయనకు విశ్వాసం లేదు. ఎవరికివారిగా మార్పు చెందాలనేది ఆయన అభిమతం. గుర్తింపూ, డబ్బూ అన్నీ లభించి కూడా జీవితంలో ఏ సంతోషమూ, తృప్తీ లేని ఆధునిక జీవుల శూన్యాన్ని ఆయన తన చివరినాటకం ‘వెన్ వి డెడ్ అవేకెన్’లో 1899లోనే రాశాడు. చివరకు ఏదో ఒకరోజు చనిపోయాకగానీ, మనం ఇన్నాళ్లూ బతకలేదన్న వాస్తవాన్ని గుర్తించడం గురించి అప్పుడే ప్రేక్షకుల్ని మేల్కొలిపాడు. అందుకే ఆయన్ని సమాజం కన్నా ముందున్న రచయితగా విమర్శకులు విశ్లేషిస్తారు; రంగస్థలానికి పరిపూర్ణతను తెచ్చినవాడిగా కూడా! ఉల్లిగడ్డ పొరల్ని ఒక్కొక్కటిగా విప్పుకుంటూపోతే, చిట్టచివరికి తనకుగా ఏమీ మిగలని ‘సెల్ఫ్’ గురించి ఇప్సెన్ కాక మరెవరు రాయగలరు! -
బ్రిటన్
రాజధాని: లండన్; జనాభా: 63, 395, 574 (2013 జనాభా లెక్కల ప్రకారం); భూభాగం: 243,610 చదరపు కి.మీ. ప్రభుత్వం: పార్లమెంటరీ వ్యవస్థ; కరెన్సీ: బ్రిటిష్ పౌండ్ భాష: ఇంగ్లిష్, గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ సమ్మేళనమే యునెటైడ్ కింగ్డమ్. యునెటైడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్... యూరప్‌లోని స్వతంత్ర దేశం. ఉత్తర ఐర్లాండ్ ఇంకా అనేక చిన్న ద్వీపాలు కలిసి గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ యునెటైడ్ కింగడమ్లోనూ, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లోనూ భాగం. రాణి, బకింగ్‌హామ్ ప్యాలెస్: లండన్ వెళ్లి రాణిని చూసొద్దామా! ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఉంటుంది. ప్యాలెస్‌ను గార్డులు సురక్షితంగా ఉండేట్టు చూస్తుంటారు. స్టోన్‌హెంజ్: ఖగోళ విశేషాలకు, గ్రహగతులకు, పండుగలు, పర్వదినాల సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆక్స్ఫర్డ యూనివ ర్సిటీ వాళ్లు పెద్ద పెద్ద రాళ్లతో వృత్తాకారపు కట్టడాన్ని నిర్మించారు. దీనినే స్టోన్‌హెంజ్ అంటారు. షేక్స్పియర్: షేక్స్పియర్ నాటకాలు ఏవైనా చూశారా? వింత వింత దుస్తులు ధరించి నటులంతా షేక్స్పియర్ ఆంగ్లాన్ని మాట్లాడుతుంటాడు. సెయింట్ పాట్రిక్స్ డే: ఉత్తర ఐర్లాండ్ ప్రజలు పాటలు, డాన్స్ అంటే బాగా ఇష్టపడతారు. సెయింట్ పాట్రిక్స్ డే రోజున పాట్రిక్ స్మారకార్థం సంగీత కచేరీలు నిర్వహిస్తారు. టవర్ బ్రిడ్జ్: బొమ్మలో మీరు చూస్తున్నది లండన్ బ్రిడ్జి. దీన్నే లండన్ టవర్ బ్రిడ్జి అంటారు. కింద నదిలో ఓడలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ తెరుచుకుని ఓడలు వెళ్లడానికి వీలు కల్పిస్తాయి. చేపలు, చిప్స్, హగిస్, లేవర్బ్రెడ్: భోజన సమయం అయిందా? మరి చేపలు, చిప్స్ ఇష్టమేనా?! స్కాటిష్ హగిస్ తింటారా? దీన్ని ఓట్స్, గొర్రె మాంసంతో చేస్తారు. అంతేకాదు, సీవీడ్ జెల్లాతో లేవర్ బ్రెడ్‌ను కూడా తయారుచేస్తారు. లెప్రాచాన్: లెప్రాచాన్ దేవతల చెప్పులు కుట్టేవాళ్లు. వీళ్లు చిన్న కుండల్లో బంగారు నాణాలు తెచ్చి తమాషాలు చేస్తుంటారు. బిగ్‌బెన్, పార్లమెంట్ భవనం, థేమ్స్ నది: థేమ్స్ నదీ తీరంలో పార్లమెంట్ భవనం ఉంది. భవనంలోని క్లాక్‌టవర్‌లో పెద్ద గంట ఉంది. దీన్నే బెన్ అంటారు. దీని బరువు 13 టన్నులు. సెయింట్ ఫాడ్: వే ల్స్లోని ఈ సైడ్ఫాడ్లో ప్రజలు ఆటపాటలు, సంగీతమంటే ఎంతో ఇష్టపడతారు. అక్కడ జరిగే పోటీల్లో కవిత్వం కూడా చదివి వినిపిస్తుంటారు. పోటీలో గెలిచిన వారికి చిన్న కుర్చీని బహుమతిగా ఇస్తారు. లాచ్నెస్ రాక్షసి: స్కాట్లాండ్లోని లాచ్నెస్లో నిజంగానే రాక్షసి ఉందా? మీరేమనుకుంటున్నారు? లవ్ స్పూన్: ఈ చెంచాలు చూశారా! మంచి డిజైన్స్‌తో ఎంత బాగున్నాయో! వీటినే వేల్స్లో ప్రేమికులు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రేమ చిహ్నంగా! బ్యాగ్ పైప్: రండి! స్కాట్లాండ్ హైలాండ్ డాన్స్‌లో పాల్గొనండి! వింత డ్రెస్సులో ఉన్న స్కాట్లాండ్ వ్యక్తి వాయించే బ్యాగ్ పైప్ సంగీతాన్ని వినండి! -
యంగ్ లింకన్
లింకన్‌కు పుస్తకపఠనం అంటే వల్లమాలిన ఇష్టం. తాను చదివిన విషయాలను ఫ్రెండ్స్‌తో పంచుకునేవాడు. చదవాల్సిన పుస్తకం గురించి ఎవరైనా చెబితే అది చదివే వరకు ఊరుకునేవాడు కాదు. బైబిల్, షేక్స్పియర్ పుస్తకాలతో లింకన్‌కు పుస్తకపఠనం మీద ఆసక్తి పెరిగింది. పుస్తకాలను చదువుతూ గ్రంథాలయాలలో గంటల కొద్దీ సమయాన్ని గడిపేవాడు. దాంతో లింకన్‌ను కొందరు స్నేహితులు ఆటపట్టించేవారు. కొత్త వాళ్లతో స్నేహం చేయడమంటే లింకన్‌కు ఇష్టం. ఆయన స్నేహబృందంలో అన్ని వయసుల వారు ఉండేవారు. ఇతరుల నుంచి తాను ప్రేరణ పొందడమే కాదు తన నుంచి ఇతరులు ప్రేరణ పొందేలా ఉండేది లింకన్ పని విధానం. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడు. ‘బాగా విన్నవారే...బాగా మాట్లాడగలరు’ అనేదాన్ని నమ్మేవాడు. ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు రాబట్టుకోవడంలో ముందుండేవాడు. చర్చా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.