ఫేస్‌యాప్‌లు వచ్చాక సెలబ్రెటీల ఫోటోలు మార్ఫింగ్ చేయడం ఫ్యాషన్ అయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫోటోను ప్రసిద్ధ ఇంగ్లీష్ నాటక రచయిత షేక్‌స్పియర్‌లా గుర్తుతెలియని వ్యక్తి మార్ఫింగ్ చేశారు. ఇది వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ శశిథరూర్‌కు చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శశిథరూర్ ఆ ఫోటోను తాజాగా ట్విటర్‌లో షేర్ చేసి దానిపై ఓ ఫన్నీ కామెంట్ పెట్టారు. ‘ఈ రోజు వాట్సాప్‌లో చాలా ప్రశంసనీయమైన చిత్రం చూశాను. నన్ను షేక్‌స్పియర్‌లా మార్చాలని చూడటంపై ఆశ్చర్యపోయాను. అయితే అలా మార్చడానికి కాస్త ఇబ్బంది పడినట్లున్నారు. నేను ఆ గౌరవానికి అర్హుడిని కానప్పటికీ.. ఎవరైతే మార్ఫింగ్ చేశారో వారికి ధన్యవాదాలు..’ అని ట్వీట్ చేశారు.
శశిథరూర్ ట్వీట్‌తో ఈ ఫోటో మరింత వైరల్ అయి నెటిజన్ల కామెంట్లకు వేదిక అయింది. శశిథరూర్ అంటేనే చెలరేగే కొందరు ఈ ఫోటోపై ఓ రేంజ్‌లో విజృంభిస్తున్నారు. మరికొందరు శశిథరూర్‌ను సమర్థిస్తూ ఆ ఫోటోకు పూర్తి అర్హత ఉందంటున్నారు. ఓ నెటిజన్ ‘మీసాలు లేని షేక్‌స్పియర్ అనుకుంటున్నావా? అంతలేదు నువ్వు షేక్‌స్పియరుద్దీన్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ‘మీరు షేక్‌స్పియర్ కన్నా విలువైన వారు, గొప్ప రచయిత, రాజకీయవేత్త, మంచి మార్గ నిర్దేశకులు, మీ ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ కామెంట్లతో శశి థరూర్‌ని ఆకాశానికి ఎత్తేశాడు.
Comments
Please login to add a commentAdd a comment