యంగ్ లింకన్
లింకన్‌కు పుస్తకపఠనం అంటే వల్లమాలిన ఇష్టం. తాను చదివిన విషయాలను ఫ్రెండ్స్‌తో పంచుకునేవాడు. చదవాల్సిన పుస్తకం గురించి ఎవరైనా చెబితే అది చదివే వరకు ఊరుకునేవాడు కాదు.
బైబిల్, షేక్‌స్పియర్ పుస్తకాలతో లింకన్‌కు పుస్తకపఠనం మీద ఆసక్తి పెరిగింది.
పుస్తకాలను చదువుతూ గ్రంథాలయాలలో గంటల కొద్దీ సమయాన్ని గడిపేవాడు. దాంతో లింకన్‌ను కొందరు స్నేహితులు ఆటపట్టించేవారు.
కొత్త వాళ్లతో స్నేహం చేయడమంటే లింకన్‌కు ఇష్టం. ఆయన స్నేహబృందంలో అన్ని వయసుల వారు ఉండేవారు.
ఇతరుల నుంచి తాను ప్రేరణ పొందడమే కాదు తన నుంచి ఇతరులు ప్రేరణ పొందేలా ఉండేది లింకన్ పని విధానం.
ఇతరులు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడు. ‘బాగా విన్నవారే...బాగా మాట్లాడగలరు’ అనేదాన్ని నమ్మేవాడు.
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు రాబట్టుకోవడంలో ముందుండేవాడు. చర్చా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.