కొంతమంది పిల్లలు అత్యంత చురుకుగా అతి చిన్న వయసులోనేఅన్ని నేర్చుకుంటారు. జౌరా! అనిపించేలా పెద్దలే ఇబ్బంది పడి నేర్చుకున్న వాటిని సైతం అలవొకగా నేర్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి అతి పిన్న వయసులోనే కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రోగామింగ్ లాంగ్వేజ్‌లను సునాయాసంగా నేర్చకున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?...
వివరాల్లోకెళ్తే....తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిప అర్నవ్ శివరామ్ 13 ఏళ్ల వయసులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ చిన్నారి అతి పిన్నవయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు. శివరామ్ 4 వతరగతి చదువుతున్నప్పుడే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. జావా, ఫైథాన్‌తో సహా మొత్తం 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకున్నాడు. అంతేకాదు భారత్‌లో తక్కువ పెట్టుబడితో ఆటో పైలెట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రూపొందించాలని యోచిస్తున్నట్లు శివరామ్ తెలిపాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసిస్తున్నారు.
Tamil Nadu | Coimbatore's Arnav Sivram becomes one of the youngest children to have learnt 17 computer languages at the age of 13
— ANI (@ANI) July 2, 2022
I started learning computers when I was in 4th grade. I have learnt 17 programming languages including Java & Python, he said pic.twitter.com/FTehgFHrBt
Comments
Please login to add a commentAdd a comment