లండన్: విలియమ్ షేక్ స్సియర్ కీ బోర్డు పేరుతో స్విఫ్ట్ కీ అనే టెక్నాలజీ సంస్థ రచయిత 400వ వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద ఆండ్రాయిడ్, ఐ ఓఎస్ల యాప్లను విడుదల చేసింది. షేక్ స్సియర్ మాదిరి పదాల వాడుకకోసం ప్రత్యేకంగా ఈ యాప్ను తయారు చేశామని వివరించింది. సంస్థకు చెందిన టెక్నిషన్లు షేక్ స్సియర్ రచనలన్నీ పూర్తిగా చదివిన తర్వాత యాప్ను తయారు చేసామని తెలిపింది. వినియోగదారులు పియర్ రచనల తరహా పదాలను ఇష్టం వచ్చినపుడు వాడుకునేలా యాప్ను డిజైన్ చేసింది కంపెనీ.
యాప్లో ఉండే ప్రిడిక్టివ్ టెక్నాలజీ ఫేక్ టెక్ట్స్ను తయారుచేసుకుంనేదుకు సహాయపడుతుంది. స్విఫ్ట్ కీ సహ భాగస్వామి సారా రౌలీ మాట్లాడుతూ.. షేక్ స్సియర్ తన కొత్త భాషా పాటవంతో పాఠకులను అలరించారు. ఇప్పుడు ప్రజలందరూ ఆ భాషను తమ మొబైళ్లలో అందుకోవచ్చు.
'షేక్ స్పీక్' పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.