ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్‌ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్‌ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్‌పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్‌ను చూడవచ్చు. తన హోమ్‌స్క్రీన్, కొత్త ఫీచర్‌ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్‌గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్‌ఫేస్‌ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది.
ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్‌కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు.
తక్కువ ట్యాప్‌లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్‌లకు సహాయ పడేందుకు హోమ్‌స్క్రీన్‌ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్‌ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్‌లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్‌సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్‌లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్‌గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్‌లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment