కంప్యూటర్ లేదా మొబైల్‌లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలామందికి క్రోమ్ గుర్తొస్తుంది. క్రోమ్ ఇప్పుడు యూజర్ల కోసం ఐదు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఇంతకీ క్రోమ్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయని విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
👉సమీపంలో ఉండే ఏదైనా స్థలాలను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బార్‌లో ఎంటర్ చేయగానే మీ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వెళ్లాలనుకున్నప్పుడు.. క్రోమ్ బార్‌లో సెర్చ్ చేయగానే దానికి కింద కాల్, డైరెక్షన్, రివ్యూ అనేవి కనిపిస్తాయి. ఇవి షార్ట్‌కట్ బటన్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ క్రోమ్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.
👉ఐప్యాడ్‌లు, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాలను సద్వినియోగం చేసుకోవడానికి.. క్రోమ్ అడ్రస్ బార్‌ను రిఫ్రెష్ చేసింది. ఒకసారి అడ్రస్ బార్ ఉపయోగించిన తరువాత.. మళ్ళీ తిరిగి వెళ్తే అప్పటికే హిస్టరీ లేదా వెబ్‌సైట్ డ్రాప్ డౌన్ క్రింద ట్రెండింగ్ అంశాలను చూపిస్తుంది.
👉ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో షార్ట్‌కట్స్ అందిస్తోంది. ఉదాహరణకు సిటీ మెట్రో కోసం సమయాలను చూడడానికి మీరు సాధారణంగా షెడ్యూల్స్ అని టైప్ చేసి ఉండవచ్చు. దాన్ని మళ్ళీ మీరు సెర్చ్ చేసినప్పుడల్లా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
👉ఐఓఎస్‌లో ట్రేండింగ్ సెర్చ్.. అంటే మీరు క్రోమ్ సెర్చ్ బార్‌లో.. సెర్చ్ చేయడానికి ముందే.. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు కింద కనిపిస్తాయి.
👉ఐఓఎస్‌లో గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు డిస్కవర్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. మీరు మూడు-చుక్కల మెనుని ఎంచుకోవడం ద్వారా క్రోమ్ మొబైల్ యాప్‌లో డిస్కవర్ ఫీడ్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment