టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సంస్థలు కూడా యూజర్లకు అనుగుణంగా తమ యాప్‌లను అప్డేట్ చేయడం లేదా కొత్త ఫీచర్స్ తీసుకురావడం చేయాలి. ఇందులో భాగంగానే గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మూడు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇవన్నీ యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
స్లీప్ టైమర్ ఫీచర్
పేరుకు తగ్గట్టుగానే.. యూజర్ ఏదైనా కంటెంట్‌ను చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న టైమ్ తరువాత వీడియోని ఆటోమేటిక్‌గా పాజ్ చేయవచ్చు. వీడియో చూస్తూ నిద్రపోయే వ్యక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యూజర్లు మొబైల్, డెస్క్‌టాప్‌లోని సెట్టింగ్‌ల మెను నుంచి స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.
డ్రీమ్ స్క్రీన్ ఫీచర్
ఇది క్రియేటర్లకు ఉపయోగపడే ఫీచర్. ఇది మొబైల్ యాప్‌లో పనిచేస్తుంది. 'ఏఐ'ను ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లను క్రియేట్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. షార్ట్ కెమెరా ఓపెన్ చేయడానికి వినియోగదారులు ప్లస్ (+) చిహ్నం మీద క్లిక్ చేసి.. గ్రీన్ స్క్రీన్ ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కనిపిస్తాయి.
ఆన్సర్ బాట్ ఫీచర్
ప్రత్యేకించి ఈ ఫీచర్‌ను మొబైల్ యూజర్ల కోసం పరిచయం చేశారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నప్పుడు వీడియోకు సంబంధించి అనుమానాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏఐ బేస్డ్ ఫీచర్. యూట్యూబ్‌లోని అన్ని వీడియోలు ఈ కొత్త ఫీచర్‌ను కలిగి ఉండవు. ఇది వీడియో కింద ఉన్న ఆస్క్ ట్యాబ్ రూపంలో అర్హులైనవారికి మాత్రమే వీడియోలలో కనిపిస్తుంది. యూజర్లు ముందుగా సెట్ చేసిన ప్రశ్నలను ఎంచుకోవడం మాత్రమే కాకుండా.. సొంత ప్రశ్నలను టైప్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.
యూట్యూబ్ కొత్త ఫీచర్స్ కొన్ని రోజులు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్లీప్ టైమర్ ఫీచర్ సెప్టెంబర్ 2 వరకు, డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ఆగస్ట్ 20 వరకు, ఆన్సర్ బాట్ ఫీచర్ ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో ఇవి వినియోగంలోకి వస్తాయి. కానీ ఇప్పుడునా వస్తాయి అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment