సాక్షి, సినిమా : ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై మరో ట్వీట్ చేశారు. టీ సిరీస్ సంస్థతో అజ్ఞాతవాసి మేకర్లు చేసుకున్న సెటిల్ మెంట్ సరిపోలేదేమోనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.
ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కదా! అంటూ తన ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన్న హక్కులు కొనుకున్న మరికొన్ని సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అజ్ఞాతవాసి నిర్మాతలకు సల్లే సూచిస్తున్నారు.
కాగా, అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్‌కు కాపీ అన్న వార్తలు రావటంతో ఇండియాలో ఆ చిత్ర హక్కులు కొన్న టీ సిరీస్ వారు న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన నిర్మాత టీ సిరీస్ వారితో సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. మీడియాలో ఆ వార్త జోరుగా చక్కర్లు కొట్టినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ.. చిత్ర మేకర్లు గానీ అస్సలు స్పందించలేదు.
ఇప్పుడు చిత్రం విడుదలయ్యాక లార్గో వించ్‌కు కేవలం ప్రేరణ మాత్రమే కాదని.. కథ... అందులోని సన్నివేశాలను యాజ్ ఇట్ ఈజ్‌గా దర్శకుడు త్రివిక్రమ్ దించేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని మాతృక చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే కూడా దృవీకరించటం గమనార్హం.
I’m afraid a settlement with T-series will not be enough. It’s not only about India. The movie #Agnyaathavaasi has been released worldwide yesterday. https://t.co/FUXkNSZ2fO
— Jérôme Salle (@Jerome_Salle) January 10, 2018
Comments
Please login to add a commentAdd a comment