legal trouble
-
Elon Musk: ఎలన్ మస్క్-ట్విటర్ భారీ డీల్‌లో ట్విస్ట్
డెలావేర్: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు అయిన ‘ఫ్లోరిడా పెన్షన్ ఫండ్’.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2025లోపు ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో(యూఎస్) పిటిషన్ దాఖలు చేసింది ఎఫ్‌పీఎఫ్. అంతేకాదు.. త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఇరువురికీ ట్విట్టర్ లో వాటాలుండడం గమనార్హం. మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది. న్యాయపరమైన ఈ చిక్కుల్ని ట్విటర్, ఎలన్ మస్క్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. చదవండి: ట్విటర్.. టెస్లా ఒక్కటి కాదు - బిల్‌గేట్స్ -
ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు
Complaint Against Ananta Sriram: ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఆయన లిరిక్స్ అందించారు. అయితే తాజాగా ఆయన రాసిన ఓ పాట వివాదాస్పదం అవుతుంది. దేవుడిని కించపరిచేలా పాటను రచించారంటూ అనంత శ్రీరామ్‌పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాలోని ‘దిగు దిగు నాగ’ అనే పాట ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట హిందువు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాగ దేవతను కించపరిచేలా రచించిన అనంత శ్రీరామ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అనంత్ శ్రీరామ్‌తో పాటు చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
బిగ్‌బాస్‌కు భారీ షాక్
చెన్నై : కమల్ హాసన్ హోస్ట్‌గా విశేష ఆదరణ పొందిన బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్ ఈనెల 23న ప్రారంభం కావాల్సి ఉండగా ఈ షోపై నీలినీడలు అలుముకున్నాయి. బిగ్ బాస్ షో న్యాయపరమైన వివాదంలో కూరుకుపోయింది. గత రెండు సీజన్లు భారీగా సక్సెస్ కావడంతో మూడో సీజన్‌పై అభిమానులు భారీ ఆశలు పెంచుకోవడంతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు మిన్నంటాయి. కాగా, వివాదాస్పద బిగ్ బాస్ షోను నిషేధించాలని కోరుతూ సుధన్ అనే అడ్వకేట్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తమిళ్లో హౌస్మేట్స్ పొట్టి దుస్తులు ధరించడంతో పాటు పిల్లలు, యువతను తప్పుదారిపట్టించేలా అశ్లీల అర్ధాలు ధ్వనించేలా మాట్లాడుతున్నారని పిటిషనర్ తన పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఇండియన్ బ్రాడ్కాస్ట్ ఫౌండేషన్ (ఐబీఎఫ్)నుంచి సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా ఈ షోను ప్రసారం చేసేందుకు అనుమతించరాదని కూడా పిటిషనర్ న్యాయస్ధానాన్ని కోరినట్టు సమాచారం. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని, త్వరలోనే విచారణ చేపడతారని తెలిసింది. మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ త్రీ ప్రారంభం కానున్న సమయంలో ఈ షోను న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. -
అజ్ఞాతవాసికి మరిన్ని చిక్కులు తప్పవా?
సాక్షి, సినిమా : ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై మరో ట్వీట్ చేశారు. టీ సిరీస్ సంస్థతో అజ్ఞాతవాసి మేకర్లు చేసుకున్న సెటిల్ మెంట్ సరిపోలేదేమోనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కదా! అంటూ తన ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన్న హక్కులు కొనుకున్న మరికొన్ని సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అజ్ఞాతవాసి నిర్మాతలకు సల్లే సూచిస్తున్నారు. కాగా, అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్‌కు కాపీ అన్న వార్తలు రావటంతో ఇండియాలో ఆ చిత్ర హక్కులు కొన్న టీ సిరీస్ వారు న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన నిర్మాత టీ సిరీస్ వారితో సెటిల్మెంట్ చేసుకున్నాడు. మీడియాలో ఆ వార్త జోరుగా చక్కర్లు కొట్టినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ.. చిత్ర మేకర్లు గానీ అస్సలు స్పందించలేదు. ఇప్పుడు చిత్రం విడుదలయ్యాక లార్గో వించ్‌కు కేవలం ప్రేరణ మాత్రమే కాదని.. కథ... అందులోని సన్నివేశాలను యాజ్ ఇట్ ఈజ్‌గా దర్శకుడు త్రివిక్రమ్ దించేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని మాతృక చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే కూడా దృవీకరించటం గమనార్హం. I’m afraid a settlement with T-series will not be enough. It’s not only about India. The movie #Agnyaathavaasi has been released worldwide yesterday. https://t.co/FUXkNSZ2fO — Jérôme Salle (@Jerome_Salle) January 10, 2018 -
మనోభావాలు దెబ్బతిన్నాయ్.. చిక్కుల్లో స్టార్లు!
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నటి శిల్పా శెట్టిలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ టీవీ షోలో ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటంతో వారిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాల్మీకి కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదులు చేయగా.. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ నోటీసులు జారీచేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రసార శాఖ, ఢిల్లీ-ముంబై పోలీస్ కమీషనర్లను కమీషన్ ఆదేశించింది. టైగర్ జిందాహై చిత్ర ప్రమోషన్లో భాగంగా సల్మాన్.. శిల్పా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన డాన్స్ గురించి ప్రస్తావించిన సల్మాన్ ‘భాంగీ’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ వెంటనే శిల్ప కూడా అదే పదాన్ని వాడారు. ఆ పదం తమ తెగను కించపరిచేలా ఉందంటూ వాల్మీకి తెగ సభ్యులు కొందరు ఆందోళన చేపట్టారు. ఆగ్రాలో వాల్మీకి సమాజ్ యాక్షన్ కమిటీ ఢిల్లీ ప్రదేశ్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే నేడు విడుదల కాబోయే సల్మాన్ టైగర్ జిందాహై చిత్రాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. -
వివాదంలో అజర్ సినిమా
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అజర్ సినిమా వివాదాస్పదమవుతోంది. ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా సేవలందించిన అజర్ జీవితంలో సినిమాను తలపించే ఎన్నో మలుపులున్నాయి. భారీ విజయాలు, వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో అజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అజరుద్దీన్ స్క్రీప్ట్‌ను ఓకె చేశాకే ఈ సినిమాను పట్టాలెక్కించినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. టోని డిసౌజా దర్శకత్వంలో శోభా కపూర్, ఏక్తా కపూర్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అజర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో మనోజ్ ప్రభాకర్ కీలక సాక్షిగా వ్యవహరించాడు. అయితే అజర్ సినిమాలో మనోజ్ పాత్రను నెగెటివ్‌గా చిత్రీకరించారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే తనకు స్పెషల్ షో వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ ప్రభాకర్‌తో పాటు మరికొంత మంది క్రీడాకారులు కూడా అజర్ సినిమా స్పెషల్ షో కోసం పట్టు పడుతున్నారు. వీరితో పాటు అజర్ భార్య సంగీత బిజీలాని కూడా తన పాత్రను ఎలా చూపించబోతున్నారో అన్న అనుమానం వ్యక్తం చేసింది. చిత్రయూనిట్ స్పెషల్ షోకు అంగీకరించకపోవటంతో మనోజ్ సహా మిగతావారు చట్ట పరమైన చర్యలకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.