
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నటి శిల్పా శెట్టిలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ టీవీ షోలో ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటంతో వారిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాల్మీకి కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదులు చేయగా.. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ నోటీసులు జారీచేసింది.
వారంలోపు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రసార శాఖ, ఢిల్లీ-ముంబై పోలీస్ కమీషనర్లను కమీషన్ ఆదేశించింది. టైగర్ జిందాహై చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్.. శిల్పా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన డాన్స్ గురించి ప్రస్తావించిన సల్మాన్ ‘భాంగీ’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ వెంటనే శిల్ప కూడా అదే పదాన్ని వాడారు.
ఆ పదం తమ తెగను కించపరిచేలా ఉందంటూ వాల్మీకి తెగ సభ్యులు కొందరు ఆందోళన చేపట్టారు. ఆగ్రాలో వాల్మీకి సమాజ్ యాక్షన్ కమిటీ ఢిల్లీ ప్రదేశ్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే నేడు విడుదల కాబోయే సల్మాన్ టైగర్ జిందాహై చిత్రాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment