Valmiki community
-
మనోభావాలు దెబ్బతిన్నాయ్.. చిక్కుల్లో స్టార్లు!
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నటి శిల్పా శెట్టిలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ టీవీ షోలో ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటంతో వారిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాల్మీకి కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదులు చేయగా.. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ నోటీసులు జారీచేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రసార శాఖ, ఢిల్లీ-ముంబై పోలీస్ కమీషనర్లను కమీషన్ ఆదేశించింది. టైగర్ జిందాహై చిత్ర ప్రమోషన్లో భాగంగా సల్మాన్.. శిల్పా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన డాన్స్ గురించి ప్రస్తావించిన సల్మాన్ ‘భాంగీ’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ వెంటనే శిల్ప కూడా అదే పదాన్ని వాడారు. ఆ పదం తమ తెగను కించపరిచేలా ఉందంటూ వాల్మీకి తెగ సభ్యులు కొందరు ఆందోళన చేపట్టారు. ఆగ్రాలో వాల్మీకి సమాజ్ యాక్షన్ కమిటీ ఢిల్లీ ప్రదేశ్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే నేడు విడుదల కాబోయే సల్మాన్ టైగర్ జిందాహై చిత్రాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. -
‘మా కులాన్ని అణగదొక్కేందుకు కుట్ర’
-
‘మా కులాన్ని అణగదొక్కేందుకు కుట్ర’
న్యూఢిల్లీ: తనను కుట్రపూరితంగా ఇరికించి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సందీప్ కుమార్ ఆరోపించారు. దళితుడిని కాబట్టే తనని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. అభ్యంతకర వీడియోలో తాను లేనని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. ఏకలవ్యుడిని నిరాయుధుడిని చేసినట్టుగా తమ కులం వారిని అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ‘అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. పేదవాణ్ణి, దళితుడిని కాబట్టే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. సీడీలో నేను ఉన్నానని ఏబీపీ కూడా నిర్థారించలేదు. ఇది మీడియా చేస్తున్న విచారణ. నేను వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై కుట్ర చేశార’ని సందీప్ కుమార్ వాపోయారు. ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటపడడంతో మంత్రి పదవి నుంచి సంపత్ కుమార్ ను సీఎం కేజ్రీవాల్ తొలగించారు.