
‘మా కులాన్ని అణగదొక్కేందుకు కుట్ర’
న్యూఢిల్లీ: తనను కుట్రపూరితంగా ఇరికించి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సందీప్ కుమార్ ఆరోపించారు. దళితుడిని కాబట్టే తనని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. అభ్యంతకర వీడియోలో తాను లేనని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. ఏకలవ్యుడిని నిరాయుధుడిని చేసినట్టుగా తమ కులం వారిని అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
‘అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. పేదవాణ్ణి, దళితుడిని కాబట్టే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. సీడీలో నేను ఉన్నానని ఏబీపీ కూడా నిర్థారించలేదు. ఇది మీడియా చేస్తున్న విచారణ. నేను వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై కుట్ర చేశార’ని సందీప్ కుమార్ వాపోయారు. ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటపడడంతో మంత్రి పదవి నుంచి సంపత్ కుమార్ ను సీఎం కేజ్రీవాల్ తొలగించారు.