french director
-
Savi Movie Review: ఫ్రెంచ్ సావిత్రి కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సావి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఓ సినిమా కథ బావుంటే ఆ కథకి ఏ భాషా హద్దు కాదు. అలాగే ఏ దేశమూ సరిహద్దు కాదు. దానికి సరైన ఉదాహరణ ‘సావి’ సినిమా. ‘సావి’ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి మూలం తెలుసుకోవడం చాలా అవసరం. 2008లో ఫ్రెంచ్ దర్శకుడు ఫ్రెడ్ కవాయే ‘ఎనీథింగ్ ఫర్ హర్’ అనే సినిమా నిర్మించారు. ఆ సినిమాను 8 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే, ఆరు మిలియన్ డాలర్ల రాబడితో సరిపెట్టుకుంది. అదే మూల కథతో సరిగ్గా రెండేళ్ళ తరువాత... అంటే 2010లో రస్సెల్ క్రోవ్ వంటి సీనియర్ నటుడుతో హాలీవుడ్ దర్శకుడు పాల్ హాగిస్ ‘ది నెక్ట్స్ త్రీ డేస్’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను 30 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే దాదాపు 67 మిలియన్ డాలర్లు సాధించి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ కథ ఫ్రెంచ్‌లో ప్రారంభమై హాలీవుడ్ చుట్టి 14 ఏళ్ళ తరువాత బాలీవుడ్‌కి ‘సావి’గా అడుగుపెట్టింది. అంతలా ఈ కథలో ఏముందో చూద్దాం. అందమైన ఓ చిన్న కుటుంబం. భార్య, భర్త, ఓ చిన్న పిల్లాడు. వీరే కథకు పాత్రధారులు. అనుకోని ఓ ఘటన వల్ల ఒక హత్య కేసులో ఇరుక్కుని జీవిత ఖైదీగా శిక్ష పడుతుంది భార్యకు. దేశం కాని దేశంలో తన బిడ్డకు తల్లిని దూరం చేయలేక ఆ భర్త శిక్ష అనుభవిస్తున్న తన భార్యను జైలు నుండి తప్పించి కుటుంబమంతా ఎలా వేరే దేశం చేరుకుంటారు అనేదే కథ. ‘సావి’లో పెద్ద మార్పేంటంటే భార్య బదులు భర్తను ఖైదీగా మార్చారు. పైగా ఇండియా సెంటిమెంట్ ప్రకారం సావి అంటే సావిత్రి అని దర్శకుడు అభినయ్ డియో సినిమా ఆఖర్లో చెప్పిస్తాడు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య ఖోస్లా టైటిల్ రోల్ చేశారు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకు ‘సావి’ మంచి ఛాయిస్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ -
కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్ డైరెక్టర్
ఇటీవల కాలంలో సినిమాల మీద కాపీ ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మన దర్శకులు ఇంగ్లీష్, ఫ్రెంచ్ సినిమాలను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదాతథంగా ఫ్రీమేక్ (అనుమతులు లేకుండా రీమేక్) చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా సాహో సినిమా విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఏకంగా ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే సాహోను ఉద్దేశిస్తూ తన సినిమాను మరోసారి ఫ్రీమేక్ చేవారంటూ ట్వీట్ చేశాడు. గతంలో అజ్ఞాతవాసి సినిమాను జెరోమ్ తెరకెక్కించిన లార్గో వించ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారన్న ఆరోపణలు వినిపించాయి. కథతో పాటు కథనం కూడా యదాతథంగా ఉండటంతో అప్పట్లో జెరోమ్‌కు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. తాజాగా సాహో కథనం ట్రీట్మెంట్ భిన్నంగా ఉన్నా.. మూల కథ దాదాపు లార్గో వించ్‌ను పోలి ఉండటంతో మరోసారి జెరోమ్ స్పందించారు. తన సినిమాను కాపీ చేసి తెరకెక్కించిన రెండు సినిమాలకు నెగెటివ్ రావటంతో కనీసం కాపీ అయినా సరిగా చేయండి అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు జెరోమ్. అంతేకాదు ఇండియాలో తన కెరీర్ చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్నాడు జెరోమ్. అయితే టాక్ ఎలా ఉన్న ప్రభాస్ సాహో మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. -
అజ్ఞాతవాసికి మరిన్ని కష్టాలు..
సాక్షి, సినిమా : పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర కథ ‘కాపీ వివాదం’ మరో మలుపు తీసుకుంది. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మాతృక చిత్రం లార్గో వించ్(ఫ్రెంచ్) దర్శకుడు జెరోమ్ సల్లే సిద్ధమైపోయారు. ఈ మేరకు తన ట్విటర్లో ఆయన సంకేతాలు అందించారు. ‘‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్ నోటీసులు పంపటం ’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' చిత్రానికి అజ్ఞాతవాసి కాపీ అనే ప్రచారం జరిగిన సమయంలో... ఇండియాలో రీమేక్ హక్కులను దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపటంతో.. చివరకు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఆ వెంటనే తెర పైకి వచ్చిన లార్గొ వించే దర్శకుడు జెరోమ్ సల్లే చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన కథనాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశాడని సినిమా చూశాక సల్లే వ్యాఖ్యానించటం విశేషం. కొద్దిరోజుల క్రితం ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో?’’ అంటూ మరో ట్వీట్ చేసి చర్యలకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ నుంచి స్పందన లేకపోవటంతో ఆయన లీగల్ నోటీసులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నెగటివ్ టాక్‌తో ఇప్పటికే ఈ చిత్రానికి భారీ డ్యామేజ్ కాగా, ఇప్పుడు న్యాయపరమైన చిక్కులతో మరో దెబ్బ తగలబోతోంది. Indian cinema has all the necessary talent and creativity for not having to plagiarize. And the silence from #Agnathavaasi team since one week is deafening. So let’s take action now. #LegalNotice — Jérôme Salle (@Jerome_Salle) 18 January 2018 Mood #LargoWinch #Agnathavasi pic.twitter.com/w2uLnwo9kD — Jérôme Salle (@Jerome_Salle) 17 January 2018 -
అజ్ఞాతవాసికి మరిన్ని చిక్కులు తప్పవా?
సాక్షి, సినిమా : ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంపై మరో ట్వీట్ చేశారు. టీ సిరీస్ సంస్థతో అజ్ఞాతవాసి మేకర్లు చేసుకున్న సెటిల్ మెంట్ సరిపోలేదేమోనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది కదా! అంటూ తన ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన్న హక్కులు కొనుకున్న మరికొన్ని సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అజ్ఞాతవాసి నిర్మాతలకు సల్లే సూచిస్తున్నారు. కాగా, అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్‌కు కాపీ అన్న వార్తలు రావటంతో ఇండియాలో ఆ చిత్ర హక్కులు కొన్న టీ సిరీస్ వారు న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన నిర్మాత టీ సిరీస్ వారితో సెటిల్మెంట్ చేసుకున్నాడు. మీడియాలో ఆ వార్త జోరుగా చక్కర్లు కొట్టినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ.. చిత్ర మేకర్లు గానీ అస్సలు స్పందించలేదు. ఇప్పుడు చిత్రం విడుదలయ్యాక లార్గో వించ్‌కు కేవలం ప్రేరణ మాత్రమే కాదని.. కథ... అందులోని సన్నివేశాలను యాజ్ ఇట్ ఈజ్‌గా దర్శకుడు త్రివిక్రమ్ దించేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని మాతృక చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే కూడా దృవీకరించటం గమనార్హం. I’m afraid a settlement with T-series will not be enough. It’s not only about India. The movie #Agnyaathavaasi has been released worldwide yesterday. https://t.co/FUXkNSZ2fO — Jérôme Salle (@Jerome_Salle) January 10, 2018 -
ఆయన తీసిన చిత్రాల్లాగే ఆయన జీవితం
వార్సా: ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహకు కూడా అందకుండా ఉత్కంఠతో ముందుకుసాగుతుంది ఆయన తీసిన క్రైమ్, హారర్, స్కాండల్ చిత్రాలు. ఆయన తీసిన చిత్రాల వలే ఆయన నిజజీవితం కూడా అలాగే ముందుకు సాగుతోంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే నాజీ మూకలను తప్పించుకు తిరిగాడిన జీవితం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినీ దర్శకుడిగా మారేందుకు తోడ్పడగా, నిండు గర్భిణితో ఉన్న తన భార్య, ప్రముఖ మోడల్, సినీ తార షరాన్ టేట్ దారుణ హత్య ఆయన్ని నేరం చేసేందుకు ప్రోత్సహించింది. నాలుగు దశాబ్దాల నుంచి సెక్స్ స్కాండల్ తరుముతుంటే న్యాయం నుంచి తప్పించుకు తిరుగుతూ పొలండ్‌లో తలదాచుకుంటున్న ఆయనకు పోలండ్ సుప్రీంకోర్టు ద్వారా ప్రస్తుతం కాస్త ఊరట లభించింది. ఆయనెవరో ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. 27 సినిమాలకు నామినేషన్ పొంది ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు రోమన్ పొలాన్స్కీ. తన ప్రత్యక్ష అనుభవాలతో నాజీల అకృత్యాలను ఆయనతెరకెక్కించిన ‘ది పియానిస్ట్’ సినిమాకు 2002లో ఆస్కార్ అవార్డు వచ్చింది. పోలండ్ నుంచి వచ్చి పారిస్‌లో స్థిరపడిన యూదు కుటుంబంలో జన్మించిన పొలాన్స్కీ ‘మరో సినిమా’ను ప్రేమించే వారికి చిరపరిచితుడు. మాతృదేశమైన పొలండ్‌కు ఆయన కుటుంబం తిరిగొచ్చాక, తల్లిదండ్రులను నాజీ మూకలు అరెస్ట్‌చేసి కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించిగా అనధగా మారిన పొలాన్స్కీ బాల్యమంతా వీధుల్లోనే గడిచింది. 1962లో ‘నైఫ్ ఇన్ ది వాటర్’ అనే తొలి చిత్రంతో పాశ్చాత్య దేశాల ప్రశంసలు అందుకున్న పొలాన్ స్కీ, వరుసగా ‘రిపల్షన్, ది ఫియర్లెస్ వ్యాంపైర్ కిల్లర్స్, రోజ్మ్యారీస్ బేబీ లాంటి చిత్రాలను తీశారు. 1969లో నిండు గర్భంతో వున్న ఆయన భార్య, మోడల్, సినీతారైన షరాన్ టేట్‌ను, ఆయన నలుగురు మిత్రులను చార్లెస్ మాన్షన్ అనే కల్ట్ నాయకుడు, ఆయన అనుచరులు అతిదారుణంగా చంపారు. ఆ విషాధం నుంచి తేరుకున్నాక 1974లో అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన ‘చైనా టౌన్’ అనే హాలివుడ్ క్లాసిక్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు సమంతా గైమర్గా చెప్పుకునే అప్పటి గెయిలీ ఫిర్యాదుపై 1977లో అమెరికాలో పోలీసులు పొలాన్‌స్కీని అరెస్ట్ చేశారు. అప్పుడు 13 ఏళ్లున్న గెయిలీని తనను మద్యం తాగించి, డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారని ఆయనపై కేసు పెట్టారు. మద్యం మత్తులో తప్పు చేశానని ఒప్పుకున్న పొలాన్స్కీ క్షమాభిక్ష రాజీ కింద 42 రోజులపాటు జైలుకెళ్లారు. నేరానికి మానసిక చికిత్స కూడా తీసుకున్నారు. 1978లో జైలు నుంచి బయటకు వచ్చిన పొలాన్స్కీ తన శిక్ష పూర్తయిందని అనుకున్నారు. అయితే అమెరికా జడ్జీ క్షమాభిక్ష రాజీ ఒప్పందాన్ని రద్దు చేసి భారీ జైలు శిక్షను విధించారు. దాంతో ఆయన ఫ్రాన్స్‌కు పారిపోయారు. ఆయన్ని పరారీలో ఉన్న నేరస్థుడిగా అమెరికా కోర్టు ప్రకటించింది. ఆయన్ని పట్టి అప్పగించాల్సిందిగా అమెరికా దర్యాప్తు సంస్థ పలు దేశాలను కోరింది. ఈ నేపథ్యంలో 2002లో ఆయన తీసిన ‘ది పియానిస్ట్’ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించినప్పటికీ అమెరికాకు వచ్చి అవార్డును తీసుకోలేక పోయారు. ఆయన పరారీలో ఉన్నప్పటికీ చిత్రాలు తీయడాన్ని మానుకోలేదు. ఓ చిత్ర నిర్మాణం విషయమై స్విడ్జర్లాండ్ వెళ్లినప్పుడు, 2009లో స్థానిక అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన అరెస్ట్‌పై అంతర్జాతీయ చర్చ ఊపందుకున్న నేపథ్యంలో 10 నెలల గృహ నిర్బంధం అనంతరం స్విడ్జర్లాండ్ ఆయన్ని విడుదల చేసింది. ఇప్పటికే పరారీలో ఎంతో క్షోభను అనుభవించినందున ఆయనపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుంటానని సమంతా గైమర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. అయితే ఆమెరికా కోర్టు మాత్రం ఇప్పటికీ కేసు ఉపసంహరణకు అంగీకరించలేదు. పోలండ్‌లో ఉంటున్న పొలాన్‌స్కీని పట్టి అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వం పోలండ్ ప్రభుత్వాన్నీ కోరింది. దీన్ని పొలాన్స్కీ స్థానిక హైకోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై పొలండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా ఆ అప్పీల్‌ను మంగళవారం నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. పేరు ప్రఖ్యాతులతో పాటు అప్రతిష్ట మూటకట్టుకున్నారంటూ ఆయన్ని ఇప్పటికీ పొగిడేవారు, తెగిడే వారు ఉన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పైకొచ్చిన పొలాన్‌స్కీని బాధితురాలే క్షిమించినప్పుడు ఇంకెందుకు శిక్షించాలని పొగిడేవారు వాదిస్తున్నారు. ఈర్శాభావంతో కొంతమంది బాలివుడ్ ప్రముఖులే ఆయనపై కేసును తెగలాగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఓ బాలికను మత్తుపదార్థాలతో రేప్ చేయడం నేరమని, ఆ నేరానికి ఆయనకు శిక్ష పడాల్సిందేనని వ్యతిరేకులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేసు ముగింపు అమెరికా కోర్టులోనే తేలుతుందని పొలాన్స్కీ న్యాయవాది అంటున్నారు.