Pawan Kalyan's Agnyaathavaasi Hindi Version Sets All Time Record in YouTube - Sakshi
Sakshi News home page

Published Tue, Oct 23 2018 10:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Disaster Agnyathavaasi Sets All time Record - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన డిజాస్టర్‌ సినిమా అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా అజ్ఞాతవాసి భారీ నష్టాలనే మిగిల్చింది.

బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడిన ఈ సినిమా తాజా ఆన్‌లైన్‌లో మాత్రం ఆల్‌టైం రికార్డ్‌లను సెట్‌ చేస్తోంది. అజ్ఞాతవాసి హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ను ఎవడు 3 పేరుతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి సత్తా చాటింది. అంతేకాదు ఈ ఘనత సాధించి తొలి దక్షిణాది చిత్రంగా రికార్డ్ సృష్టించింది అజ్ఞాతవాసి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement