
నిత్యానంద (ఫైల్)
యశవంతపుర (బెంగళూరు): అత్యాచారం, మహిళ కిడ్నాప్ కేసుల్లో నిందితుడైన వివాదాస్పద స్వామి నిత్యానందకు రామనగర కోర్టు అరెస్ట్ వారంట్ జారీచేసింది. నిత్యానంద ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతని లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రామనగర కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామనగర పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.
నిత్యానంద ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నిత్యానంద అహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి విదేశాలకు పరారైనట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. కొన్నినెలలుగా నిత్యానంద బెంగళూరు శివార్లలోని బిడది ఆశ్రమానికి ముఖం చాటేశాడు. అతడు బెంగళూరులో ఉండి ప్రవచనాలు చేస్తున్నట్లు ఆయన శిష్యులు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. బెంగళూరులో లేని వ్యక్తి ఎలా ప్రవచనాలు చేస్తాడని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: నిత్యానందకు నోటీసులపై వింత జవాబు)
Comments
Please login to add a commentAdd a comment