
హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్
న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు అయితే జైలుకు లేదా నరకానికి వెళతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో అన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోదన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇటీవలి ఉగ్ర అలజడికి త్వరలో ముగింపు పలుకుతామని, ఉగ్రవాదులు తమ లక్ష్యాలను అందుకోలేరన్నారు. గత కొద్దిరోజుల్లో కశీ్మర్‌లో 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment