Union Minister of State for Home Affairs
-
ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి
న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు అయితే జైలుకు లేదా నరకానికి వెళతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో అన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇటీవలి ఉగ్ర అలజడికి త్వరలో ముగింపు పలుకుతామని, ఉగ్రవాదులు తమ లక్ష్యాలను అందుకోలేరన్నారు. గత కొద్దిరోజుల్లో కశీ్మర్లో 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. -
మూడేళ్లలో 3,110 మనీ లాండరింగ్, 12 వేల ఫెమా కేసులు
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్ల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 3,110 మనీలాండరింగ్ కేసులు, విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనల కింద మరో 12 వేల కేసులు నమోదు చేసినట్లు కేంద్రం సోమవారం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆయా కేసుల తీవ్రత ఆధారంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002, ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద ఈడీ కేసులు నమోదు చేసినట్లు మంత్రి పంకజ్ చౌధరి వివరించారు. -
81 మంది చైనా పౌరులకు నోటీసులు 117 మందికి బహిష్కరణ
న్యూఢిల్లీ: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రావు ఎంతమంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆయన మాట్లడుతూ...2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిల వెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని చెప్పారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోతే జరిమాన విధించి వీసాను క్రమబద్ధీకరించడం లేదా గడువు పొడిగించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా కావాలనే వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం ఉండిపోతే విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారత్‌ని వదిలి వెళ్లేలా నోటీసులు జారీ చేసి జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు) -
కిషన్‌రెడ్డికి కీలక శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి కీలకమైన హోం శాఖను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. సహాయ మంత్రి పదవి అయినప్పటికీ అది హోం శాఖ కావడంతో కిషన్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎల్.కె.అద్వానీ నంబర్ –2 హోదాలో ఉన్నారు. అప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తెలంగాణలోని కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన సీహెచ్ విద్యాసాగర్ రావుకు హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే. నరేంద్ర మోదీ తరువాత నంబర్ –2 స్థానంలో ఉన్న అమిత్‌షా ఇప్పుడు హోం మంత్రి. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించడం విశేషం. అమిత్‌షా వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరిస్తుండడం కిషన్‌రెడ్డికి కలిసిరానుంది. హోం శాఖలో సరిహద్దు నిర్వహణ, దేశ అంతర్గత భద్రత, కశ్మీర్ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యానంద్కూ హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. -
ఆప్ నేతలకు పనీపాట లేదు: కిరణ్ రిజుజు
హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నిప్పులు చెరిగారు. సదరు పార్టీ నేతలకు పనీపాట లేదని ఆయన ఎద్దేవా చేశారు. నాటకాలాడటం వాళ్లు అలవాటైందంటూ ఆప్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కాదని ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని ఆప్ నేతలకు కిరణ్ రిజుజు సూచించారు. ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రిజుజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ రిజాజు మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్డీఏ రెండేళ్ల పాలన సాగిందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్ర నిధులు ప్రజలకు చేరువ కావడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం అందిస్తున్న నిధులతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి వరకూ అందలన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపి... ఎమర్జెన్సీని విధించిన రోజును ఎవరూ మరవరన్నారు. ఎమర్జెన్సీలోని వాస్తవాలు ఈ తరం వారికి తెలియాల్సిన అవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అప్పటి ఎమర్జెన్సీలో పాల్గొన్న వారిని కిరణ్ రిజుజు సత్కరించారు.