న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్ల కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 3,110 మనీలాండరింగ్ కేసులు, విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనల కింద మరో 12 వేల కేసులు నమోదు చేసినట్లు కేంద్రం సోమవారం తెలిపింది.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆయా కేసుల తీవ్రత ఆధారంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002, ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద ఈడీ కేసులు నమోదు చేసినట్లు మంత్రి పంకజ్ చౌధరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment