FEMA violation
-
మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు. ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్‌సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
మూడేళ్లలో 3,110 మనీ లాండరింగ్, 12 వేల ఫెమా కేసులు
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్ల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 3,110 మనీలాండరింగ్ కేసులు, విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనల కింద మరో 12 వేల కేసులు నమోదు చేసినట్లు కేంద్రం సోమవారం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆయా కేసుల తీవ్రత ఆధారంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002, ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద ఈడీ కేసులు నమోదు చేసినట్లు మంత్రి పంకజ్ చౌధరి వివరించారు. -
బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు..
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 (FEMA) నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ గురువారం పేర్కొంది. ఫెమా నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. కొంతమంది బీబీసీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి స్టేట్మెంట్ల రికార్డింగ్‌ను కోరినట్లు ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీబీసీ డాక్యుమెంట్ భారత్‌లో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించింది. దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఆ తరువాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు బీబీసీ ఉద్యోగులను విచారించారు. అయితే ఇవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు పేర్కొన్నారు. క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. చదవండి: కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు! -
ఫెమా ఉల్లంఘన కేసులో ఈడీ కార్యాలయానికి గ్రానైట్ వ్యాపారులు
-
ఇవాళ మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
-
WazirX: ఇండియా అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌కి ఈడీ నోటీసులు!
న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీ వాజిర్‌ఎక్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుమారు 2,790 కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్పై ఉల్లంఘనలకు పాల్పడిందని వాజిర్‌ఎక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. వాజిర్ఎక్స్ కంపెనీ జెన్మయి ల్యాబ్స్ ప్రైవేట్ ల్యాబ్స్ లిమిటెడ్ పేరు మీద రిజిస్ట్రర్ అయ్యి ఉంది. డొమెస్టిక్ క్రిప్టోకరెన్సీ స్టార్టప్‌గా 2017లో దీనికి అనుమతులు లభించాయి. దీంతో ఈ కంపెనీ డైరెక్టర్ల పేరు మీదే ఈడీ నోటీసులు పంపింది. చైనాకు చెందిన ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల మీద అన్ని కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు చైనా నుంచి 57 కోట్ల రూపాయల విలువైన డబ్బు మన కరెన్సీలోకి మార్చేశారని, ఆతర్వాత బినాన్స్ వాలెట్లలోకి పంపించారని తేలింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరపనుంది. అంతేకాదు వజీర్ఎక్స్ సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించకుండానే.. లావాదేవీలు జరిపిందని, ఫెమా మార్గదర్శకాల్ని ఉల్లంఘించిందని ఈడీ పేర్కొంది. అభివృద్ధిలో భాగంగా క్రిప్టోకరెన్సీని ప్రొత్సహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటి స్కామ్‌లు వెలుగుచూడడం మంచిది కాదని టెక్ నిపుణులు అంటున్నారు. అయితే ఈడీ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని వాజిర్ఎక్స్ సీఈవో నిశ్చల్‌శెట్టి ఒక ట్వీట్ చేశాడు. చదవండి: పోర్న్ క్రిప్టోకరెన్సీ తెలుసా? -
ప్రముఖ నగల వ్యాపారికి ఈడీ భారీ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: హాంకాంగ్ డైమండ్ ఎక్స్పోర్ట్ ఫెమా కేసులో జ్యువెల్లరీ సంస్థ యజమాని, ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాకు భారీ షాక్ తగిలింది. విదేశీ సంస్థలతో అక్రమ లావాదేవీలు నిర్వహించిన ఆరోపణలతో సంస్థ యజమానికి ఈడీ భారీ జరిమానా విధించింది. బంగారం దిగుమతుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డ కేసులో ఎంబిఎస్ జ్యువెల్లర్స్ యజమాని సుఖేష్‌గుప్తాకు రూ.222.44 కోట్ల భారీ జరిమానా విధిందిచింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత ఈడీ చరిత్రలోనే ఒక సంస్థకు విధించిన అతిపెద్ద జరిమానాగా నిలిచింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన కేసులో ఈడీ ఈ జరిమానా నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌కు చెందిన లింక్ ఫై కంపెనీతో డైమండ్ల సరఫరా లావాదేవీలు కొనసాగించింది ఎంబీఎస్ జ్యువెల్లరీస్. తద్వారా విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించారు సుఖేష్ గుప్తా. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఈడీ చివరికి సంస్థ చరిత్రలో అతి భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువరించింది. -
ఎన్డీటీవీకి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారక ద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎన్డీటీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్డీటీవీకి అందిన రూ 1637 కోట్ల విదేశీ పెట్టుబడులు, మరో రూ 2732 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫెమా చట్టంకింద ఎన్డీటీవీ వ్యవస్ధాపకులు, ఎగ్జిక్యూటివ్ కో చైర్‌పర్సన్స్ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, జర్నలిస్ట్ విక్రమ చంద్ర సహా ఇతరులకు షోకాజ్ నోటీసు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఎన్డీటీవీ సమీకరించిన విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆయా నివేదికలు, సమాచారాన్ని ఆర్బీఐ ముందుంచడంలో జాప్యాలను నోటీసులో ఈడీ ప్రస్తావించింది. మరోవైపు రూ 600 కోట్లు మించిన ఎఫ్‌డీఐకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర అవసరమని, ఈ అనుమతి లేకుండానే ఎన్డీటీవీ గ్రూప్ రూ 725 కోట్ల ఎఫ్‌డీఐ సమీకరించిందని ఈడీ ఆరోపించింది. రూ 600 కోట్లకు తక్కువగా ఎఫ్‌డీఐని చూపడం భారీ కుట్రలో భాగమని ఈడీ ఆరోపించింది. -
ఈడీ ఉచ్చులో మంత్రి, కుటుంబం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత, మంత్రి రోషన్ బేగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశీ ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై రోషన్ బేగ్, ఆయన కుమారుడు, కుమార్తెకు ఈడీ నోటీస్‌లు జారీ చేసింది. రోషన్ బేగ్ కుటుంబానికి చెందిన రుమన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి గత 8 సంవత్సరాల నుంచి అరబ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు డబ్బు బదిలీ అయింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో ఈడీ అధికారులు రోషన్ బేగ్, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే రోషన్ బేగ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మారుతుంది. ఏమిటీ వ్యవహారం రుమాన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ 2007లో ప్రారంభమైంది.ఈ కంపెనీని బేగ్ కుమార్తె సబీహా ఫాతిమా, కుమారుడు రుమన్ బేగ్ పర్యవేక్షిస్తున్నారు. కంపెనీకి 2008 మేలో సౌదీ అరేబియాలోని ఫెజూరియా స్టీల్ బ్యారల్స్ కంపెనీ నుంచి రూ.1.14 కోట్లు చొప్పున రెండుసార్లు కలిపి రూ.2.28 కోట్లు జమయ్యాయి. ఇందులోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. సీఎంను కలిసిన రోషన్ ఈడీ నోటీస్ జారీ కావటంతో నగరాభివృద్ధి శాఖ మంత్రి రోషన్ బేగ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కృష్ణలో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. ఈడీ నోటీస్‌లు ఇచ్చినట్లు వివరణ ఇచ్చి పది నిమిషాల్లోనే వెళ్లిపోయినట్లు సమాచారం. కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
బాలీవుడ్ హీరో, హీరోయిన్‌కు నోటీసులు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతడి భార్య గౌరి ఖాన్, నటి జూహీ చావ్లాకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం నోటీసులు జారీచేసింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్ యాక్ట్(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు పంపింది. ఈ నెల 23న విచారణకు రావాలని వారిని ఈడీ ఆదేశించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్‌కు ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్న వీరు, షేర్లను తక్కువ ధరకు విలువకట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2009లో మార్షియస్‌కి చెందిన ఓ కంపెనీకి ఈ ముగ్గురు తమ కంపెనీలోని కొన్ని షేర్స్‌ని తక్కువ ధరకి అమ్మిన కారణంగా, ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో ప్రభుత్వానికి రూ.73.6 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఈ షేర్స్‌ని కొనుగోలు చేసిన మార్షియస్‌కి చెందిన కంపెనీ ది సీ ఐస్లాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్(టీఎస్ఐఐఎల్) మరెవరిదో కాదు... జూహీ చావ్లా భర్త జే మెహ్తదే. గతంలోనూ ఈ ఆరోపణలకు సంబంధించి, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, జూహీ చావ్లా, మరికొంత మందికి ఈడీ షోకాజు నోటీసులు కూడా జారీచేసింది. ఈ క్రికెట్ టీమ్ యజమానుల్లో జూహ్లీ చావ్లా, ఆమె భర్త కూడా ఉన్నారు. గతంలోనే ఈ కేసుకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, షేర్స్ అమ్మకాలు వంటి అంశాలపై షారుఖ్ ఖాన్ వాంగ్మూలం తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షారుఖ్, గౌరి, జూహీలపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసింది.