న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 (FEMA) నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ గురువారం పేర్కొంది.
ఫెమా నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. కొంతమంది బీబీసీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి స్టేట్‌మెంట్‌ల రికార్డింగ్‌ను కోరినట్లు ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
కాగా 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీబీసీ డాక్యుమెంట్ భారత్‌లో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించింది. దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది.
ఆ తరువాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు బీబీసీ ఉద్యోగులను విచారించారు. అయితే ఇవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు పేర్కొన్నారు. క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది.
చదవండి: కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు!
Comments
Please login to add a commentAdd a comment