surrenders in court
-
ఫోర్జరీ కేసు కీలక మలుపు
అనంతపురం క్రైం: కలెక్టర్, జేసీ సంతకాల ఫోర్జరీ కేసు కీలక మలుపు తిరిగింది. పుట్టపర్తికి చెందిన ప్రధాన నిందితుడు మహబూబ్‌బాషా గురువారం అనంతపురంలోని అడిషినల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాక్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు మహబూబ్‌బాషాను రిమాండ్‌కు తరలించారు. అలాగే కమ్మూరు వీఆర్ఓ లక్ష్మీనారాయణచౌదరిని కూడా పోలీసులు రిమాండ్‌కు పంపారు. 11 రోజుల తర్వాత ప్రత్యక్షం : కలెక్టర్, జేసీ సంతకాల ఫోర్జరీ కేసులో కీలక నిందితుడు మహబూబ్‌బాషా 11 రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. గత నెల 23న కూడేరు తహసీల్దార్ శ్రీనివాసులు కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసిన మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌గా పరిగణించి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులను ఆదేశించారు. ఈ క్రమంలో డీఎస్పీ పార్టీతో పాటు వన్‌టౌన్ తదితర బృందాలు అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆఖరికి నిందితుడే పక్కా ప్లాన్‌తోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. కస్టడీకి కోరే అవకాశం : కీలక నిందితుడైన మహబూబ్‌బాషాను వన్‌టౌన్ పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. మహబూబ్‌బాషా గతంలోనూ ఇలాంటి ఫోర్జరీ సంతకాలు చేశారని, ఈ కేసులో అతనికి రెవెన్యూ సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. (చదవండి: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!) -
బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు
సాక్షి, చెన్నై: కడలూరు డీఎంకే ఎంపీ రమేష్.. సోమవారం బన్రూట్టి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని పోలీసులు రెండు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. తన పరిశ్రమలో పనిచేస్తున్న గోవిందరాజన్ అనే వ్యక్తిని హింసించడమే కాకుండా బలవంతంగా విషం తాగించి హతమార్చినట్లు ఎంపీ రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీపై సీబీసీఐడీ హత్య కేసు నమోదు చేసింది. అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్‌ను సీబీసీఐడీ వర్గాలు అరెస్టు చేశాయి. ఎంపీని కూడా అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో సోమ వారం బన్రూట్టి కోర్టులో ఎంపీ రమేష్ లొంగిపోయారు. రిమాండ్‌కు వెళ్లే సమయంలో ఎంపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో తాను నిర్దోషినని, కొన్ని రాజకీయ పార్టీలు తన మీద వచ్చిన ఆరోపణల్ని రాజకీయం చేసే పనిలో పడ్డాయని, అందుకే కోర్టులో లొంగి పోయినట్టు తెలిపారు. -
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
షెల్టర్ హోం కేసు : మంజూ వర్మ లొంగుబాటు
పట్నా : ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిహార్ మాజీ మంత్రి మంజు వర్మ మంగళవారం బెగుసరాయ్ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా మంజు వర్మ రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. కాగా సీబీఐ కన్నుగప్పి తిరుగుతున్న మంజువర్మను పరారీలో ఉన్నట్టు ప్రకటించిన బెగుసరాయ్ కోర్టు ఆమె ఆస్తులను అటాచ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వర్మ ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను బిహార్ పోలీసులు పూర్తిచేశారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్ ఠాకూర్‌తో మంజు వర్మ భర్త చంద్రశేఖర్ వర్మకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆమె ఈ ఏడాది ఆగస్టులో మంత్రి పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. షెల్టర్ హోం కేసుకు సంబంధించి గతంలో మంజూ వర్మ నివాసంపై, ఆమె బంధువుల నివాసంలో సీబీఐ చేపట్టిన దాడుల్లో ఆయుధాలు లభ్యం కావడంతో మంజు వర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
కోర్టు ముందు లొంగిపోయిన లాలూ
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్. గురువారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు సరెండర్ అయ్యారు. తర్వాత లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల ముందు లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఇటీవల లాలూను ఆదేశించడం తెల్సిందే. చాయ్‌బసా ఖజానా నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించిన కేసుకు సంబంధించి తొలుత జడ్జి ఎదుట లాలూ హాజరయ్యారు. తర్వాత డియోఘర్, డమ్కా ట్రెజరీ కేసులకు సంబంధించి మరో జడ్జి ఎదుట లొంగిపోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలారు. -
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్
4 రోజుల అజ్ఞాతానికి తెర ఈ నెల 28 వరకు రిమాండ్ సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట తహసీల్దార్ సంధ్యారాణి సోమవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను చంచల్‌గూడ మహిళాజైలుకు తరలించారు. ఆమెకు యూటీ(అండర్ ట్రయల్) నంబర్ 4686 కేటాయించినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల మేరకు సంధ్యారాణిని ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. అయితే తనను ఈ కేసులో ఏసీబీ అన్యాయంగా ఇరికిస్తోందని సంధ్యారాణి బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించడానికి మంగళవారం కోర్టులో పిటిషన్ వేయాలని ఏసీబీ నిర్ణయించింది. మలక్‌పేటలోని ఒక స్థలానికి ఎన్ఓసీ జారీ చేసే నిమిత్తం ఈ నెల 10న తహసీల్దార్ సంధ్యారాణి సూచనల మేరకు ఆమె సోదరుడు రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కోసం ఏసీబీ డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో అధికారులు మొదటి రోజు నుంచి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, కూకట్‌పల్లిలోని రెమిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని రెండు రోజుల తర్వాత సంధ్యారాణి జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమె చికిత్స పొందిన ఆస్పత్రికి వెళ్లారు. ఏసీబీ అధికారులు వెళ్లేలోపే ఆమె డిచ్చార్జి కావడంతో వెనుదిరిగారు. తాజాగా సోమవారం న్యాయవాదితో కలసి ఆమె ఏసీబీ కోర్టుకు హాజరు కావడంతో అధికారులు కంగుతున్నారు. -
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్