
అనంతపురం క్రైం: కలెక్టర్, జేసీ సంతకాల ఫోర్జరీ కేసు కీలక మలుపు తిరిగింది. పుట్టపర్తికి చెందిన ప్రధాన నిందితుడు మహబూబ్‌బాషా గురువారం అనంతపురంలోని అడిషినల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాక్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు మహబూబ్‌బాషాను రిమాండ్‌కు తరలించారు. అలాగే కమ్మూరు వీఆర్‌ఓ లక్ష్మీనారాయణచౌదరిని కూడా పోలీసులు రిమాండ్‌కు పంపారు.
11 రోజుల తర్వాత ప్రత్యక్షం : కలెక్టర్, జేసీ సంతకాల ఫోర్జరీ కేసులో కీలక నిందితుడు మహబూబ్‌బాషా 11 రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. గత నెల 23న కూడేరు తహసీల్దార్ శ్రీనివాసులు కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసిన మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌గా పరిగణించి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులను ఆదేశించారు.
ఈ క్రమంలో డీఎస్పీ పార్టీతో పాటు వన్‌టౌన్ తదితర బృందాలు అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆఖరికి నిందితుడే పక్కా ప్లాన్‌తోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. కస్టడీకి కోరే అవకాశం : కీలక నిందితుడైన మహబూబ్‌బాషాను వన్‌టౌన్ పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. మహబూబ్‌బాషా గతంలోనూ ఇలాంటి ఫోర్జరీ సంతకాలు చేశారని, ఈ కేసులో అతనికి రెవెన్యూ సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
(చదవండి: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!)
Comments
Please login to add a commentAdd a comment