Murugan
-
రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు. ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్‌రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని కమాన్‌చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్‌తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్‌కుమార్ కరీంనగర్‌కు ఏంచేశారో చెప్పాలన్నారు. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్లో బండి సంజయ్‌ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
ఇద్దరు కేంద్ర మంత్రులకు మళ్లీ రాజ్యసభ టికెట్లు
ఢిల్లీ, సాక్షి: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాజ్యసభకు రీనామినేట్ అయ్యారు. ఒడిషా నుంచి ఆయనకు రాజ్యసభ టికెట్‌ను కేటాయించింది బీజేపీ. అలాగే.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి(సహాయ) డాక్టర్ ఎల్. మురుగన్ తో పాటు మరో ముగ్గురి పేర్లను నామినేట్ చేసింది. ఒకవేళ అశ్వినీ వైష్ణవ్, మురుగున్‌లు గనుక ఎన్నికైతే.. అదే రాష్ట్రాల నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వహించే నేతలు అవుతారు. మధ్యప్రదేశ్ నుంచి మురుగన్‌తో పాటు ఉమేష్ నాథ్, మాయ నరోలియా, బన్సీలాల్ గుర్జర్ పేర్లను బీజేపీ నామినేట్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన అశ్వినీ వైష్ణవ్.. 2019లో తొలిసారి ఒడిషా అధికార పార్టీ బీజూ జనతా దళ్(BJD) మద్దతుతో నెగ్గారు. రెండోసారి కూడా ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోనూ మురుగన్ గెలుపు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. రాజ్యసభ సీట్లలో సంఖ్యా బలం ఆధారంగా చూసుకుంటే.. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒక్క సీటు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘మంత్రిగా పనికి రావు’.. డీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు కేంద్రమంత్రిపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి. లోక్‌సభ క్వశన్ అవర్ సమయంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌పై ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో ప్రకృతి విపత్తుల వల్ల భారీ వర్షాలు, వరదలతో దక్షిణ చెన్నై అతలాకుతలం అయిందని.. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం ఎటువంటి బృందాన్ని పంపిందని డీఎంకే పార్టీ ఎంపీలు ఏ రాజా, ఏ గణేశ్‌మూర్తి ప్రశ్నించారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఎందుకు ఈ విషయంతో జోక్యం చేసుకుంటున్నారు. మీరు దయచేసిన కూర్చోండి. అసలు మీకు ఏం కావాలి?. మీరు పార్లమెంట్ సభ్యులుగా అర్హులు కారు. మీరు కేంద్ర మంత్రిగా పనికిరారు’ అని డీఎంకే ఎంపీ విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంతి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘవాల్ ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు దళితులను అవమానించటం కిందకు వస్తాయని ఆరోపించారు. ‘డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఒక ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర మంతి ఎల్ మురుగన్ స్పందిస్తూ.. అప్రస్తుత ప్రశ్న అని తెలిపే క్రమంలో టీఆర్ బాలును.. మురుగన్‌ను కేంద్ర మంత్రిగా పనికిరావు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించటం కిందకు వస్తాయి. ఎంపీ టీఆర్ బాలు.. మంత్రి మురుగన్‌కు క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఎల్ మురుగన్ స్పందించారు.‘ డీఎంకే పార్టీ వెనకబడిన కులాల నుంచి ఓ వ్యక్తి మంత్రిగా ఎదగటాన్ని సహించలేకపోతుంది. అందుకే నాపై అనుచిత వ్యాఖ్యలు చేయించి.. నా కులాన్ని అవమానపరిచింది’ అని మండిపడ్డారు. కేంద్రమంత్రిపై డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. బాలు ఇలాంటి దళిత వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదని మండిపడ్డారు. Thiru TR Balu is a disgrace to politics & this is not the first time he has made disgraceful remarks about a member of the Scheduled Caste Community. I strongly condemn these remarks on Hon MoS Thiru @Murugan_MoS avl in the Temple of Democracy. Our Hon PM Thiru @narendramodi… pic.twitter.com/TDt3p39hks — K.Annamalai (@annamalai_k) February 6, 2024 -
‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ
చెన్నై/ఢిల్లీ: జాతీయ స్ఫూర్తి అయిన ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కు పొంగల్ పర్వదినం ప్రతిరూపమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో పొంగల్ వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ తమిళనాడు ప్రజలకు పొంగల్ పర్వదిన శుభాకాంక్షలు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తికి పొంగల్ ప్రతిబింబం. ఇదే భావన కాశీ–తమిళ్, సౌరాష్ట్ర–తమిళ్ సంగమం సంస్కృతిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బియ్యం పిండితో వేసే కోలమ్ రంగవల్లికలు దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య ఉన్న భావోద్వేగాలను కలుపుతున్నాయి. దేశం సత్తా ఇలా కొత్త తరహాలో గోచరిస్తోంది. ఇలాంటి ఐక్యతా భావనే 2047కల్లా వికసిత భారత్ నిర్మాణానికి అతిపెద్ద చోదకశక్తిలా పనిచేస్తోంది. ఎర్ర కోట మీద నుంచి నేను ప్రబోధించిన పంచప్రాణాల్లో ముఖ్యమైనది ఇదే. దేశ ఐక్యతను మరింత శక్తివంతం చేయండి, తద్వారా ఐక్యతను మరింత బలోపేతం చేయండి. తమిళ కవి తిరువల్లువర్ ప్రవచించినట్లుగా జాతి నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయతీ గల వ్యాపారులు, మంచి పంటలది కీలక భూమిక’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ కొత్త పంటను దైవానికి నైవేద్యంగా వండి రైతన్నలు అన్నదాతలుగా మారే చక్కటి శుభ సమయమే పొంగల్ పర్వదినం. దేశంలోని ప్రతి పండుగలో పల్లెపట్టులు, పంటలు, రైతులతో ముడిపడి ఉంటాయి’’ అన్నా రు. ‘‘తమిళ సాంప్రదాయాలకు తృణధాన్యాలకు అవినాభావ సంబంధం ఉంది. పౌష్టిక శ్రీ అన్న(తృణధాన్యం) గురించి యువతలో కొత్త అవగాహన ఏర్పడింది. దీంతో మిల్లెట్స్ రంగంలో అంకుర సంస్థల స్థాపనకూ యువత ముందుకొస్తోంది. మూడు కోట్లకుపైగా రైతులు తృణధాన్యాలను పండించి చక్కని దిగుబడి ద్వారా లబ్ధి పొందుతున్నారు. పొంగల్ సందర్భంగా దేశ సమైక్యత కోసం కొత్త తీర్మానాలు చేసుకుని దేశం కోసం పునరంకితమవుదాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
పక్కా ప్లాన్డ్గా.. బీజేపీ హైకమాండ్ కొత్త స్ట్రాటజీ..
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయి పదవుల్లో తమిళులకు ప్రాధాన్యమిస్తూ అటు నాయకులను, ఇటు ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే ఇద్దరు గవర్నర్లు, ఓ కేంద్రమంత్రి తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా మరొకరికి రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదా దక్కింది. దీంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే.. ఎప్పటికైనా పదవి సిద్ధిస్తుందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్రంలో ఊపందుకుంది. ఇది రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అధిష్టానం ‘కొత్త’ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న మరో సీనియర్ నేతకు గవర్నర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. ఝార్ఖాండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడడంతో ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. సీపీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మరో సీనియర్‌నేత ఇలగణేషన్‌ను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. తాజాగా ఆయన్ని అక్కడి నుంచి నాగాలాండ్‌కు బదిలీ చేశారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఎల్. మురుగన్‌కు ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు కూడా అవకాశం రాక పోదా..? అని ఎదురు చూసిన బీజేపీ సీనియర్ సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ పదవి దక్కింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ అధిష్టానం, మరో నేతను అందలం ఎక్కించడం విశేషం. కార్యకర్త నుంచి గవర్నర్ స్థాయికి.. తిరుప్పూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999లో రెండు సార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగారు. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అంటే సీపీరాధాకృష్ణన్ అనే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన కన్నా జూనియర్లు అనేక మంది రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్తున్న సమయంలో, తనకు అవకాశం దక్కక పోదా? అని ఎదురు చూసిన సీపీఆర్ ఎట్టకేలకు లక్కీచాన్స్ కొట్టేశారు. మద్దతుదారుల సంబరాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఝార్ఖాండ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగానే ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇక సీఎం ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి, ఉప నేత పన్నీరు సెల్వం, గవర్నర్లు తమిళి సై, ఇలగణేషన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్యంగం ప్రకారం విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. చదవండి: ట్రెజర్ హంట్ – ఎంపవర్మెంట్! వారధిగా ఉంటా.. తనను కొత్త గవర్నర్‌గా నియమించినట్లు సమాచారం రావడంతో తిరుప్పూర్‌లో సీపీ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనకు దక్కిన గౌరవం కాదని.. తమిళనాడు ప్రజలకు లభించిన గొప్ప అవకాశం అని అభివర్ణించారు. అందుకే తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని, ఝార్ఖాండ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రమిస్తానని వ్యాఖ్యానించారు. -
వైఎస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి మురుగన్ ప్రశంసలు
-
AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు
కాకినాడ: ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకెంతో మేలు చేస్తోందని కేంద్ర మత్స్యకార, పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ప్రశంసించారు. బుధవారం ఆయన కాకినాడలో పర్యటించి.. 36వ డివిజన్ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను, ప్రతి డివిజన్‌కు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసి.. వాటికి కార్యదర్శులను నియమించి.. వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దళారీ వ్యవస్థకు దూరంగా.. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే చేరుస్తుండటం వ్యక్తిగతంగా కూడా తనకెంతో నచ్చిందని చెప్పారు. అంతకుముందు 36వ డివిజన్ సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీస్ ఫోన్ నుంచి దిశ యాప్ పనితీరును ఆయన పరిశీలించారు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కగా.. సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో.. కేంద్ర మంత్రే దానికి జవాబిచ్చారు. ‘నేను కేంద్ర మంత్రి మురుగన్‌ను, దిశ యాప్ పనితీరును పరిశీలించేందుకే ఎస్‌వోఎస్ బటన్ నొక్కాను’ అని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దిశ యాప్‌తో పాటు కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక పోలీస్స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేయర్ సుంకర శివప్రసన్న తదితరులున్నారు. -
మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం
సాక్షి, మచిలీపట్నం: మత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మత్స్యశాఖ, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మత్స్యసంపదను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఎగుమతుల్లో 36 శాతంతో దేశంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఎగుమతులు 50 శాతానికి చేరేలా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మత్స్యపరిశ్రమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. నీలి విప్లవానికి రూ. 5 వేల కోట్లు కేటాయించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. మత్స్య పరిశ్రమకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఏపీ నుంచి ఇతర దేశాలకు మత్స్య సంపద ఎగుమతి చేసేలా ఫిషింగ్‌హార్బర్లను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలోని మత్స్యకారులకు వలలు, బోట్లు, మోటార్లను సబ్సిడీపై ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రాంత మత్స్యకారులకు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన బోట్లను సబ్సిడీపై అందించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాకతో ఈ ప్రాంత మత్స్యకారులకు మేలు జరుగుతుందనే నమ్మకం కలిగిందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ రంజిత్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్‌గాంధీ హత్య కేసు: ఏడాది తర్వాత కలిశారు
వేలూరు: వేలూరు మహిళా సెంట్రల్ జైలులో మురుగన్, నళిని పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ఏడాది తర్వాత శనివారం ఉదయం కలసి మాట్లాడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో వీరిద్దరు వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి వీరు నేరుగా కలవకుండా ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. ఏడా ది తర్వాత ప్రస్తుతం నేరుగా మాట్లాడేందుకు అనుమతించాలని నళిని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జైళ్లశాఖ అనుమతితో మురుగన్‌ను పటిష్ట బందోబస్తు నడుమ మహిళా జైలు వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. కలయిక అనంతరం మురుగన్‌ను పురుషుల జైలుకు తీసుకొచ్చారు. చదవండి: ఓటు వేయలేదని గునపాలతో దాడి -
వీడియో కాలింగ్‌కు అనుమతివ్వొచ్చుగా..!
సాక్షి, చెన్నై: విదేశాల్లో ఉన్న బంధువులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు నళిని, మురుగన్‌లకు అనుమతి ఇవ్వవచ్చుగా అని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఈ విషయంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధి హత్య కేసులో నిందితుల విడుదలకు పట్టుబడుతూ సాగుతున్న న్యాయ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో జైల్లో ఉన్న నిందితులు తీవ్ర మనో వేదనలో ఉన్నారని.. పెరోల్ ఇవ్వాలని కొన్ని పిటిషన్లు, తమ వాళ్లతో సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని మరికొన్ని పిటిషన్లు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. అదే సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురైన నళిని గత వారం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్ ఒకటి సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయ స్థానం విదేశాల్లో ఉన్న బంధువులతో వీడియో కాల్ లేదా, ఆన్లైన్ ద్వారా మాట్లాడుకునేందుకు అనుమతి ఇవ్వవచ్చుగా అని కోర్టు కేంద్రానికి సూచించింది. నళిని, మురుగన్‌లు కుటుంబీకులతో మాట్లాడాలని, వారిని చూడాలన్న ఆశతో ఉన్నట్టుందని పేర్కొంటూ, ఈ విషయంగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. -
మొక్కులు తీర్చుకున్న పోలీసులు
సాక్షి, చెన్నై: కొలిక్కిరాని కేసు ఛేదించడంతో పోలీసులు మొక్కులు తీర్చుకున్నారు. సమయపురం మారియమ్మన్‌ను దర్శించుకుని తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లలిత జ్యువెలరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మురుగన్ దోపిడీల అనంతరం నటీమణులతో జల్సా చేసినట్టు విచారణలో తేలడం ఆ నటీమణులు ఎవరో అని ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరిలో తిరుచ్చి సమయపురం టోల్గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. 470 సవర్ల నగలు, రూ. 19 లక్షల నగదును దుండగులు అపహరించుకు వెళ్లారు. ఈ కేసు విచారణ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కనీసం ఆదారం కూడా లభించకపోవడంతో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తిరుచ్చిలో మరో దోపిడీ జరిగింది. ప్రముఖ నగల షోరూమ్ లలిత జ్యువెలరీలో జరిగిన దోపిడీ స్టైల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టైల్ ఒకే రకంగా ఉండడంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. లలిత జ్యువెలరీ కేసు విచారణలో లభించిన సమాచారాలు, ఆధారాలు, దోపిడీ దొంగల చెంతకు పోలీసుల్ని తీసుకెళ్లింది. లలిత జ్యువెలరీ కేసులో తొలుత సెంగం కోర్టులో సురేష్ అనే నిందితుడు లొంగిపోయాడు. అతడ్ని విచారించగా, గణేష్ అనే మరో దొంగ దొరికాడు. ఈ దోపిడీల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న తిరువారూర్ మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయాడు. ఇతగాడ్ని ఇక్కడకు తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టిన బంగారాన్ని బయటకు తీశారు. మళ్లీ బెంగళూరు పోలీసులు తమ పరిధిలో ఉన్న కేసుల విచారణ నిమిత్తం మురుగన్‌ను పట్టుకెళ్లారు. తలనీలాలు సమర్పించుకుని.. మురుగన్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు తిరుచ్చి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే, బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్న దృష్ట్యా, అక్కడ విచారణ ముగించినానంతరం, ఇక్కడకు అతడ్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించి ఉన్నారు. లలితా జ్యువెలరీ దోపిడితోపాటు తొమ్మిది నెలల క్రితం జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కూడా మురుగన్ ముఠా పనితనంగా తేలింది. ఈ కేసులో రాధాకృష్ణన్ అనే నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులు కొలిక్కిరావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసును విచారిస్తున్న బృందంలోని ఇద్దరు పోలీసులు హరిహరన్, విజయకుమార్ ఉదయాన్నే సమయపురం మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసును ఎట్టకేలకు ఛేదించడంలో తమకు దేవుడి ఆశీస్సులు సైతం ఉన్న దృష్ట్యా, మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించుకోవడం గమనార్హం. 25 కేజీలు బంగారం స్వాధీనం.. లలిత జ్యువెలరీ కేసులో ఇప్పటి వరకు 25 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నట్టు తిరుచ్చి పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ గురించి వివరించారు. ప్రస్తుతం నిందితుడు మురుగన్ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అక్కడ విచారణ ముగించినానంతరం ఇక్కడ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతడిపై మరెన్ని కేసులు ఉన్నాయో అని ఆరా తీస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ సాగుతున్నదన్నారు. కాగా నిందితుడు మురుగన్ దోపిడీల అనంతరం మోడల్స్, నటీమణులతో కలిసి జల్సా చేసేవాడుగా విచారణలో తేలినట్టు సమాచారం. కొందరికి దోపిడీ చేసిన నగలను సైతం ఇచ్చి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడం, రెండు సినిమాలకు సైతం ఫైనాన్స్ చేసి ఉన్నట్టు తేలడంతో ఆ నటీమణులు ఎవరో, ఆ సినిమాల వెనుక ఉన్న వాళ్లు ఎవరో ఆరా తీసే పనిలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది. -
లలితా జ్యుయెలరీ దోపిడీ కేసు; అప్డేట్
సాక్షి, బనశంకరి (బెంగళూరు): తమిళనాడులో సంచలనం సృష్టించిన తిరుచ్చి లలితా జ్యుయెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అంతరాష్ట్ర దోపిడీదారుడిని బెంగళూరు బొమ్మనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే 12 కేజీల బంగారు, ప్లాటినం నగలు, వజ్రాభరణాలతో పాటు టవేరా కారును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ మంగళవారం తెలిపారు. ఈ సొత్తును హోంమంత్రి బసవరాజ బొమ్మైతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు తిరుచనాపల్లి తిరువంబూర్‌కు చెందిన మురుగన్(45) అలియాస్ బాలమురుగన్, శివకుమార్, శివ తదితర పేర్లతో తిరుగుతూ.. వివిధ రాష్ట్రాల్లో తన అనుచరులతో కలిసి భారీ దోపిడీలకు పాల్పడేవాడు. తిరుచ్చి లలితా జ్యుయెలరీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో దోచుకున్న బంగారు ఆభరణాలను తిరుచ్చి నది పక్కన అడవిలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఇటీవల బొమ్మనహళ్లిలో చోటుచేసుకున్న చోరీ కేసులో తీవ్రంగా గాలించిన పోలీసులు మంగళవారం మురుగన్‌ను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా దొంగతనాల చిట్టా విప్పాడు. అతడిపై బెంగళూరులో బాణసవాడి, మడివాళ, హెచ్ఎస్ఆర్ లేఔట్, అమృతహళ్లి, నెలమంగల, అనేకల్‌లో చోరీ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక బ్యాంకుల్లో అతడు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. కాగా మురుగన్‌ను నాలుగు రోజుల కిందటే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు సొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. -
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
‘అమాయకులం.. ఇక శాశ్వత సెలవు తీసుకుంటా’
సాక్షి, చెన్నై : తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని, ఆమె భర్త మురుగన్ జైలులోనే నిరాహార దీక్ష చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గత 12 రోజులుగా దీక్ష చేస్తుండగా, గత శనివారం నళిని ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తమతో పాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేసేంత వరకు దీక్ష విరమించబోమని పేర్కొన్నారు. నళిని తరఫు న్యాయవాది ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో తమిళ సంఘాలు, పార్టీల్లో కలకలం రేగుతోంది. మురుగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడం, నళిని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో తమిళవాదుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే నేపథ్యంలో ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలపై దృష్టి సారించింది. ఇక ఈ విషయమై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌కు లేఖ తమని విడుదల చేయాలి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ నళిని పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు నళిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ‘ న్యాయం కోసం అర్థిస్తున్న మాకు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. 28 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం. మేము అమాయకులం. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కేసులో ఇరుక్కున్నాం. ఇక ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 9 నుంచి నిరాహార దీక్ష చేపడతున్నాను. ఇలానైనా నాకు విముక్తి లభిస్తుంది’ అని నళిని లేఖలో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం సబబు కాదు. కానీ నళిని విషయంలో ఇది సమర్థనీయం. రాజీవ్ హత్య కేసులో వారిని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆయన ఇందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ వీరిని గనుక విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. రాజీవ్ హత్యకేసు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. -
అదిరెన్ ఇడ్లీ
అ షాపులో అరటి ఆకు వేస్తారు... నాలుగు రకాల పచ్చళ్లు వడ్డిస్తారు...మరోవ్యక్తి పళ్లెం నిండా ఇడ్లీలు, గారెలు పుచ్చుకుని వస్తాడు... ఇంకొకరు శొంఠి పొడి, నెయ్యి తీసుకువస్తారు...‘మీకు ఏం కావాలి’ అంటూ తమిళ భాషలో ప్రశ్నిస్తూ, కొసరికొసరి వడ్డిస్తారు...ఆ ప్రదేశం పేరు మురుగన్ ఇడ్లీ షాపు...ఆ యజమాని పేరు మనోహర్...మదురై పేవ్మెంట్ ప్రారంభమైన వీరి ప్రయాణం‘మురుగన్ ఇడ్లీ షాపు’ గా విదేశాల స్థాయికి ఎదిగింది. ఆ ఫుడ్ ప్రింట్స్ ఈ వారం... ‘‘మా తల్లిదండ్రులు చెప్పినట్టు విని ఉంటే, నేను వంటగదిలోకి అడుగుపెట్టేవాడినే కాదు. వాళ్లు నన్ను బ్యాంకు ఉద్యోగిగానో, కాలేజీ ప్రొఫెసర్‌గానో చూడాలనుకున్నారు’’ అంటారు మురుగన్ ఇడ్లీ షాపు అధినేత 55 సంవత్సరాల మనోహర్. చదివిన లా డిగ్రీని పక్కనపెట్టి, తల్లిదండ్రులు నడుపుతున్న చిన్న కాఫీ షాపుని మదురై నుంచి చెన్నైకి, అక్కడ నుంచి సింగపూర్ స్థాయికి తీసుకువచ్చారు. ప్రతిరోజూ మురుగన్ ఇడ్లీ షాపు కనీసం రోజూ 25,000 ఇడ్లీలను, 13 బ్రాంచీలలో అమ్ముతోంది. బిజీ సమయాల్లో ఇడ్లీ తినాలంటే ఇక్కడ కనీసం 45 నిమిషాలు నిరీక్షించాల్సిందే. ఇక్కడ ఇడ్లీ తిన్న తరవాత చాలామంది ‘మెత్తగా ఉండే మురుగన్ ఇడ్లీ, రకరకాల చట్నీలు కావాలి’ అని అడగడం సహజమైపోయింది. అలా మొదలైంది... కుటుంబ ఆదాయానికి వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లుగా మనోహర్ తల్లి 1960 ప్రాంతంలో మదురై పేవ్మెంట్ మీద హంగు ఆర్భాటం లేకుండా అతి సామాన్యంగా ఇడ్లీ దుకాణం ప్రారంభించారు. ‘‘మా తల్లిగారు కేవలం ఇడ్లీలు తయారుచేసి అమ్మేవారు. ఇడ్లీలలోకి రెండు రకాల చట్నీలు మాత్రమే చేసేవారు. సాంబారు కూడా ఉండేది కాదు. కస్టమర్లు వాటిని ఎంతో ఇష్టంగా తినేవారు. ఆ చిన్న స్టాలే ఎంతో పేరు సంపాదించుకుంది’’ అంటారు మనోహర్.ఒకసారి దివంగత కె. కామరాజు కారులో అటు వెళ్తున్న సమయంలో, ఆ షాపు దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసి, తాను కూడా అక్కడ ఇడ్లీ తినాలని కారు ఆపుకున్నారంటే ఆ ఇడ్లీలకు ఎంత పేరు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 1970 నాటికి ఆ స్టాల్ చిన్న దుకాణంగా మారింది. ‘‘మురుగన్ మా కులదైవం కావడం వల్ల మా షాపుకి ‘మురుగన్ కాఫీ నిలయం’ అని పేరు పెట్టాం’’ అని గతం వివరిస్తారు మనోహర్. 1993 నాటికి మనోహర్ చదువు పూర్తి చేయడంతో, ఇంట్లో వారి కోరికను కాదని పూర్తిస్థాయిగా ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘‘చిన్నతనం నుంచీ నాకు ఇలాంటి ఒక షాపు నడపాలని కోరికగా ఉండేది. మా తల్లిదండ్రులు మాత్రం, ‘చదువుకున్నవారు పనివాళ్లతో పనిచేయించలేరు’ అని నన్ను వెనక్కులాగారు. నేను ఏ మాత్రం పట్టు విడిచిపెట్టలేదు. ఈ దుకాణం నా చేతిలోకి వచ్చాక సీటింగ్ కెపాసిటీ పెంచాను. ఇంటీరియర్‌లో మార్పులు చేశాను. మెనూలో ఇడ్లీలతో పాటు చక్ర పొంగలి, దోసె, వడ, మరిన్ని చట్నీలు, సాంబారు... వంటివి చేర్చాను’’ అని ఎంతో ఆన ందంగా చెబుతున్న మనోహర్, కేవలం రెండు సంవత్సరాలలో మదురైలో మరో రెండు శాఖలు తెరిచి, పది సంవత్సరాల కాలంలో 30 లక్షల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ‘‘రెండు నెలల పాటు చెన్నై అంతా తిరిగిన తర్వాత టి. నగర్లో మొట్టమొదటి ఇడ్లీ షాపును ప్రారంభించాను. ‘ఇడ్లీ కడై’ అని తమిళ పేరుతో ప్రారంభించడంతో ఆ పేరు ఎలా వినపడుతుందో అని సందేహపడ్డాను. ఆంగ్లంలో ‘మురుగన్ ఇడ్లీ షాప్’ అని పేరు స్థిరపరిచాను. ఆరు నెలల తర్వాత టి. నగర్లోనే మరో ఇడ్లీ షాపు తెరిచాను. ప్రస్తుతం చెన్నపట్టణంలో పది షాపులు ఉన్నాయి. ఇక ధైర్యం వచ్చింది. 2008లో సింగపూర్‌లో తెలుగు, తమిళలు ఎక్కువగా ఉండే ముస్తఫా స్టోర్ ఎదురుగా ఒక షాపు ప్రారంభించాను. ఆ రోజే అక్కడ ఇడ్లీలు తినడానికి పెద్ద క్యూ ఏర్పడింది’’ అని సంబరంగా చెబుతారు మనోహర్. మురుగన్ ఇడ్లీ షాపులో వడ్డించే విధానం, తయారుచేసే విధానం... భోజన ప్రియుల్ని బాగా ఆకర్షిస్తుంది. ‘‘ఇన్ని రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఇడ్లీలు మాత్రం ఒకే చోట తయారుచేసి, అన్ని బ్రాంచీలకు సప్లయి చేస్తారు. ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ‘‘అన్నిరకాల పదార్థాలు అరటి ఆకుల్లోనే వడ్డిస్తాం. అన్లిమిటెడ్ చట్నీ సాంబారు వడ్డిస్తాం’’ అని చెబుతున్న వీరి ఇడ్లీ షాపులో ‘పొడి కావాలా’, ‘నెయ్యి కావాలా’ అని కొసరి కొసరి వడ్డిస్తారు. వీరికి పోటీగా ఉన్న హోటల్స్‌లో పెద్ద పుస్తకం పరిమాణంలో మెనూ కార్డులు ఇస్తారు. ఇక్కడ కేవలం ఆరోగ్యకరమైన భారతీయ వంటకాలు మాత్రమే దొరుకుతాయి. చెన్నైలోని ఒక మార్కెట్ రిసెర్చర్ మురుగన్ ఇడ్లీ షాపు గురించి ‘ఈ షాపు చైనీ వంటకాల నుంచి చాట్ వరకు అమ్మకపోవడం చాలా సంతోషం’ అంటారు. ‘‘ఇడ్లీ తయారీలో మినప్పప్పు, ఉప్పుడు బియ్యం పరిమాణం ఎంత అన్నది రహస్యంగానే ఉంచాం’’ అంటున్న మనోహర్ మెనూను స్వయంగా తయారుచేసుకున్నారు. ఇక్కడి కాఫీ కూడా రుచిగా ఉంటుంది. ‘మా అమ్మ తయారుచేసే వాటికే మరి కొన్ని జోడించాను’ అంటారు మనోహర్. చాలామంది వీటిని అనుకరించడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. ఇడ్లీ, వడ, దోసెతో పాటు జిగర్‌ఠండా, ఉల్లి ఊతప్పమ్ వీరి ప్రత్యేకం. చిన్న ఉల్లిపాయలు మాత్రమే ఇందుకు ఉపయోగిస్తారు. వాటి తొక్క తీయడం చాలా కష్టం. చిన్న ఉల్లిపాయల వల్లే ఊతప్పానికి రుచి చేరుతుంది. ‘ఉల్లి పాయలు ఒలవడానికి 20 మందిని నియోగించాను. వారంతా మదురైలోనే ఉంటారు. వారు తొక్క తీసి అన్ని ప్రాంతాలకు చేర వేస్తారు. మేం ఇంతవరకూ మురుగన్ ఇడ్లీ షాపు ప్రకటనల కోసం ఎక్కువ ఖర్చు చేయలేదు’’ అని గర్వంగా చెబుతారు మనోహర్.‘‘మా తల్లిదండ్రుల్లా కాకుండా నేను మాత్రం ఈ వ్యాపారాన్ని నా కుమారుడితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ప్రపంచ దేశాల మీద ఉంది. రానున్న పది సంవత్సరాలలో మరో 300 శాఖలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అంటారు మనోహర్. – వైజయంతి పురాణపండ -
నిర్మలాదేవి భర్త కీలక నిర్ణయం..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కీలక వ్యక్తుల్లో ఒకరైన ప్రొఫెసర్ మురుగన్‌ను సీబీసీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాళాల విద్యార్థినులను యూనివర్సిటీ పెద్దల లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టి అరెస్టయిన నిర్మలాదేవి కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మలాదేవిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నిర్మలాదేవి వద్ద జరిపిన విచారణలో పలువురు వీవీఐపీలు, వీఐపీలు పాత్ర ఉన్నట్లు తేలింది. వారిలో మదురై యూనివర్సిటీ మానవవనరుల శాఖ సంచాలకులు కలైసెల్వన్, సహాయక ప్రొఫెసర్లు మురుగన్, కరుప్పుస్వామిలను విచారించాలని నిర్ణయించారు. వారిలో కలైసెల్వన్ ఆదివారం విచారణకు హాజరుకాగా తమ కస్టడీలోనే ఉంచుకుని విచారిస్తున్నారు. కలైసెల్వన్‌ను సైతం అరెస్ట్ చేస్తారనితెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ గత నాలుగురోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు తీవ్రతరం చేశారు. తిరుచ్చిళి సమీపం నాడాకుళం గ్రామంలోని కరప్పుస్వామి ఇంటిలో భార్య, బంధువులను పోలీసులు విచారించారు. మధురై అరుప్పుకోట్టైలోని బంధువుల ఇంటిలో గాలింపు చేపట్టారు. నాలుగురోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మురుగన్ యూనివర్సిటీలోని అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేసేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావడంతో పోలీసు అధికారులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఓపిగ్గా వేచిచూస్తే నిజాలు బయటకు వస్తాయని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్ల దురై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండోసారి భర్త విడాకుల పిటిషన్ నిర్మలాదేవితో తెగదెంపులు చేసుకోవాలని విడాకులకు సిద్ధమైన భర్త గతంలో నోటీసులు పంపారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అప్పట్లో విరమించుకున్నారు. అయితే నిర్మలాదేవి వివాదాల్లో కూరుకుపోవడంతో రెండురోజుల క్రితం విడాకులు కోరుతూ ఆయన మరోసారి దరఖాస్తు చేశారు. కాంట్రాక్టులోనూ అక్రమాలు తన భర్త కోసం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సైతం నిర్మలాదేవి అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో సీబీసీఐడీ అధికారులు ముగ్గురు కాంట్రాక్టర్లును కూడా పిలిచి విచారిస్తున్నారు. అరుప్పుకోట్టై అత్తిపట్టులోని నిర్మలాదేవి ఇంట్లో ఏడుగురితో కూడిన సీబీసీఐడీ అధికారుల బృందం ఆదివారం ఆరుగంటలపాటు తనిఖీలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, సీడీలు మూడు సంచుల నిండా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఇంటికి సీలువేశారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లను కనుగొన్నారు. నిర్మలాదేవి భర్త శరవణపాండియన్ ప్రభుత్వ కాంట్రాక్టరు కావడంతో కాంట్రాక్టులను పొందేందుకు వీరి సిఫార్సులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా సదరు ప్రభుత్వ అధికారులను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
వేలూరు కోర్టుకు మురుగన్
వేలూరు: వేలూరు సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించాడని నమోదైన కేసులో మురుగన్ అనే నిందితుడిని మంగళవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది మార్చి 26వ తేదీన జైలు అధికారుల తనిఖీ సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గదిలో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించిన విషయం విదితమే. వేలూరు జేఎం -1 కోర్టులో దీనికి సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నది. ఈనెల 2వ తేదీన నిందితుడిని నేరుగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అరక్కోణం డీఎస్పీ కుందలింగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి అలిసియా ముందు హాజరుపరిచారు. జైలు వార్డర్లు నందకుమార్, పెరుమాల్, బాగాయం ఎస్ఐ ప్రభాకరన్‌లను న్యాయమూర్తి విచారించారు. అనంతరం కేసు విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేయగా పోలీసులు బందోబస్తు నడుమ మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. కాగా, ఈ కేసులో జైలులోని ఏడుగురు సాక్షులను విచారణ జరపాలని కోరుతూ మురుగన్ తరపు న్యాయవాది అరుణ్‌కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పస్తులుంటున్న మురుగన్
వేలూరు: రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ ఆహారం తీసుకోకుండా జైలు గదిలోనే ధ్యానం చేస్తున్నాడని అతని తరపు న్యాయవాది పుహలేంది శనివారం మీడియాకు వెల్లడించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మురుగన్, పేరరివాలన్, శాంతన్ వేలూరు సెంట్రల్ జైలులో, మురుగన్ భార్య నళిని వేలూరు మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాను 26 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్నానని, జైలులోనే జీవ సమాధి అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను ఇటీవల లేఖ ద్వారా కోరాడు. అయితే ఇందుకు జైలు అధికారులు అనుమతించలేదు. ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ నుంచి ఆహారం తీసుకోకుండా పస్తులుంటున్నాడు. శనివారం ఉదయం మురుగన్, నళినిల న్యాయవాది పుహలేంది జైలులో వారిని కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాకు వివరాలు వెల్లడించారు. మురుగన్ జీవితంపై విరక్తితో జీవ సమాధి అయ్యేందుకు నిర్ణయించుకున్నాడన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి, జైలు అధికారులకు లేఖ రాశాడన్నారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మురుగన్ రెండో రోజు శనివారం కూడా ఆహారం తీసుకోకుండా ధ్యానంలోనే ఉన్నాడన్నారు. జైలులోనే తన భార్య నళినిని కలిసి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదనా్నరు. కాగా,కుమార్తె వివాహం కోసం పెరోల్ కోరుతూ నళిని వేసిన పిటిషన్ ఈనెల 18వ తేదీ విచారణకు వచ్చిందని, 22వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాది తెలిపారు. -
జైలులోనే సజీవ సమాధి అవుతా..
-
జైలులోనే సజీవ సమాధి అవుతా..
- సంచలనానికి తెరలేపిన ‘రాజీవ్ గాంధీ హంతకులు’ - ఆమరణ నిరశనకు సిద్ధపడ్డ మురుగన్.. హైకోర్టుకు నళిని - దంపతులు త్వరలో విడుదలవుతారన్న న్యాయవాది వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మురుగన్, నళిని దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. గడిచిన 26 ఏళ్లుగా కారాగారవాసం గడుపుతోన్న తనకు.. విడుదలవుతానన్న నమ్మకం లేదని, అందుకే జైలులోనే సజీవ సమాధి కావాలనుకుంటున్నట్లు మురుగన్ కోరుతున్నాడు. ఈ మేరకు తాను ఉంటోన్న వేలూరు సెంట్రల్ జైలులోనే ఆగస్టు 18 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశాడు. శనివారం జైలులో మురుగన్‌ను కలిసివచ్చిన అనంతరం అతని తరఫు లాయర్ పుగళేంది ఈ విషయాలను మీడియాకు వెల్లడించాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల సెంట్రల్ జైలులో మురుగన్, పేరరివాలన్, శాంతనులతో పాటు ఏడుగురు జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. మురుగన్-నళిని దంపతుల కుమార్తె.. ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తోన్న అరిత్ర త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నది. కుమార్తె వివాహన్ని దగ్గరుండి జరిపేందుకుగానూ ఆరు నెలల పెరోల్ అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారి న్యాయవాది తెలిపారు. పెరోల్ కోసం నళిని గత నవంబర్లోనే వినతి పత్రం సమర్పించారని, గత జనవరిలో రెండోసారి కూడా విన్నవించుకున్నా అధికారుల నుంచి స్పందన రాలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు న్యాయవాది చెప్పారు. సోమవారం చెన్నై హైకోర్టులో నళిని తరఫున పిటిషన్ వేయబోతున్నట్లు పేర్కొన్నారు. నళిని-మురుగన్ త్వరలో విడుదలవుతారు! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నళిని-మురుగన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది అన్నారు. కాగా, గతంలోనూ వీరి విడుదలకు తమిళ ప్రభుత్వం ప్రతిపాదను పంపడం, కేంద్ర ప్రభుత్వం దానిని నిరాకరించడం పలుమార్లు జరిగింది. 1991లో జైలుకు వచ్చేనాటికి నళిని రెండు నెలల గర్భవతి అని, ఆమెకు అరిత్రా అనే కుమార్తె జన్మించిందని, నాలుగు సంవత్సరాల పాటు ఆ పాప తల్లితోపాటే జైలులో ఉందని, ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నదని నళిని-మురుగన్ల న్యాయవాది పుగళేంది గుర్తుచేశారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..) -
రాజీవ్ హత్య కేసులో దోషి తాజా వినతి
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ తాజా కేసులో సోమవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నకలు ఇవ్వాలని మురగన్ న్యాయమూర్తిని కోరారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్, భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. వీరిలో నళిని మహిళా జైలులోను మిగిలిన వారు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మురుగన్, భార్య నళిని ప్రతి 15 రోజులకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన మురుగన్ గదిలో జైలు అధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు సెల్ఫోన్లు, చార్జరు, రెండు సిమ్ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జైలు అధికారులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో మురుగన్ మూడు నెలలు ఎవరినీ కలిసి మాట్లాడకుండా నిషేధించారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఉదయం ఎక్సైజ్ డీఎస్పీ రామనా«థ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్ జైలు నుంచి మురుగన్‌ను ఉదయం కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఆలసియా ముందు హాజరు పరిచారు. ఆ సమయంలో మురుగన్ సెల్‌ఫోన్ ఉపయోగించిన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నకలు కాపీని తనకు ఇప్పించాలని కోరాడు. వీటిపై అరగంట పాటు విచారణ జరిగింది. ఇదిలా ఉండగా మురుగన్‌ను చూసేందుకు శ్రీలంక నుంచి ఆయన తల్లి సోమణి వెట్రివేల్ కోర్టుకు వచ్చారు. కోర్టు ప్రాంగణంలో కుమారుడు మురుగన్‌తో మాట్లాడలేక కన్నీరు మున్నీరయ్యారు. తల్లి కన్నీటిని చూసి మురుగన్ కూడా పోలీసుల దగ్గర నుంచే కన్నీరు పెట్టాడు. అనంతరం పోలీసులు సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ నెల 29 లోపు తాను శ్రీలంక వెళ్లాల్సి ఉండగా ఆ లోపు మురుగన్‌తో కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తల్లి తెలిపారు. -
25 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన మురుగన్
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ 25 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారిగా వేలూరు కోర్టులో హాజరయ్యాడు. రాజీవ్ హత్య కేసులో మురుగన్, అతని భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్ మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. జైలులో సెల్ఫోన్లు నిషేధం ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు మురుగన్ గదిలో తనిఖీలు చేపట్టి రెండు సెల్ఫోన్లు, చార్జరు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. మురుగన్ సెల్‌ఫోన్ ఉపయోగించినందున మూడు నెలలపాటు ఎవరినీ కలిసి మాటాడేందుకు అవకాశం ఇవ్వలేదు. జైలు గదిలో సెల్‌ఫోన్ ఉపయోగించిన కేసులో వేలూరు జెఎం వన్ కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. మురుగన్ కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి మే నెల 4వ తేదికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. అయితే, ఆయనతో న్యాయవాది తప్ప ఎవరినీ కలిసి మాట్లాడేందుకు అనుమతించలేదు. మురుగన్ జైలులో స్వామిజీ తరహా మౌనవ్రతంలో ఉన్నట్లు పుకార్లు వచ్చిన విషయం విదితమే. వాటిని నిరూపించే విధంగా కోర్టులో హాజరయ్యే సమయంలో మురుగన్ గడ్డంతో షర్టు లేకుండా పచ్చ దుస్తులు మాత్రమే కప్పుకొని రావడంతో స్వామీజీ మాదిరి ఉన్నాడు. సాయిబాబా, మారియమ్మన్‌ల మొక్కుల కోసమే ఇలా మారినట్లు సమాచారం. -
కన్నీటితో వెళుతున్నా..
కుమారుడిని చూసేందుకు అనుమతించలేదని మురుగన్ తల్లి ఆవేదన వేలూరు: జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెళుతున్నానని మురుగన్ తల్లి చోమని అమ్మాల్ వాపోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు పురుషుల జైలులో, మురుగన్ భార్య నళిని మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మురుగన్ తల్లి చోమని అమ్మాల్ శ్రీలంక నుంచి ఒక నెల టూరిస్ట్ విసాతో తమిళనాడు వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలూరు సెంట్రల్ జైలుకు వెళ్లి కుమారుడు మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంది. అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేధించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళినిని చూసేందుకు కూడా అనుమతించలేదన్నారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్‌ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు. -
నళినితో మాట్లాడేందుకు భర్త విముఖత
వేలూరు: స్థానిక మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళినితో మాట్లాడేందుకు ఆమె భర్త మురుగన్ విముఖత వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని మహిళా జైలులోను, ఆమె భర్త మురుగన్‌లు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి భార్యభర్తలిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంట్లో భాగంగా గత నెల 20వ తేదీన నళిని, మురుగన్‌లు మాట్లాడుకున్నారు. ఇదిలాఉండగా శనివారం వీరిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం జైలు అధికారులు మురుగన్‌కు తెలిపారు. అయితే ఇందుకు మురుగన్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వేరే ఏ రోజైనా ఆమెతో మాట్లాడతానని మురుగన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో మురుగన్ నళినితో కలిసేందుకు ఎందుకు నిరాకరించాడు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మూడేళ్ల బాలుడిపై పోలీసుల ప్రతాపం
-
మూడేళ్ల బాలుడిపై పోలీసుల ప్రతాపం
చెన్నై: అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడిపై తమిళనాడులోని మధురై పోలీసులు ప్రతాపం చూపించారు. దొంగతనంలో కేసులో ఆ బాలుణ్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి 35 రోజులు జైలులో పెట్టారు. బాలుడి తల్లి కోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు విముక్తి లభించింది. మధురై పోలీసులు నెల రోజుల క్రితం మురుగన్ అనే బాలుడితో పాటు అతని తండ్రి, అత్తమామలను దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. వాళ్లు గాజులు, బొమ్మలు అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కేసులో మురుగన్ పాత్ర ఉందని చెబుతూ పోలీసులు జైలులో పెట్టారని అతని తల్లి మేరీ చెప్పింది. మేరి మధురై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు మురుగన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. మురుగన్‌ను విడుదల చేసి అతని తల్లికి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా మిగిలిన ముగ్గురు నిందితులు జైలులో ఉన్నారు. -
లయన్స్ ‘పవర్’
► గుజరాత్‌కు వరుసగా రెండో విజయం ►7 వికెట్లతో పుణే జెయింట్స్ చిత్తు ► చెలరేగిన ఫించ్, మెకల్లమ్ ► బంతితో మెరిసిన జడేజా ఐపీఎల్లో తొలి సారి బరిలోకి దిగి తలపడిన రెండు జట్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లేవర్ కనిపించింది. ధోని, అశ్విన్, డు ప్లెసిస్ ఒక వైపు... రైనా, జడేజా, మెకల్లమ్, బ్రేవో మరో వైపు నిలిచారు. అయితే పుణేతో పోలిస్తే లయన్స్ జట్టులో భారీ షాట్లు ఆడే ‘పవర్’ హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చింది. పుణేలో అత్యుత్తమ క్లాసిక్ ఆటగాళ్లు ఉన్నా... టి20కి కావలసిన ‘పవర్’తో ఆడలేకపోయారు. మొత్తానికి తమిళుల కొత్త సంవత్సరం రోజున రెండు పాత తమిళ జట్ల పోరాటంలా సాగిన మ్యాచ్‌లో ధోనిపై రైనా పైచేయి సాధించాడు. రాజ్‌కోట్:ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో సాధికార విజయం సాధించింది. గురువారం పుణే జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (43 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ పీటర్సన్ (31 బంతుల్లో 37; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 61 బంతుల్లో 86 పరుగులు జోడించగా... చివర్లో ధోని (10 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. జడేజా, తాంబే చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లయన్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (31 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 51 బంతుల్లోనే 85 పరుగులు జత చేసి జట్టు విజయాన్ని సులువు చేశారు. భారీ భాగస్వామ్యం: సూపర్‌జెయింట్స్‌కు చక్కటి ఆరంభం అందించిన ఓపెనర్ రహానే (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) చకచకా పరుగులు చేసినా తాంబే బంతికి వెనుదిరిగాడు. దీంతో డు ప్లెసిస్, పీటర్సన్ జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వరుసగా రెండు ఓవర్లలో కలిపి 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 57 పరుగులకు చేరింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. అయితే గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్కసారిగా పరుగుల వేగం తగ్గింది. ఒక దశలో డు ప్లెసిస్, పీటర్సన్ ధాటిగానే ఆడినా... తమ స్థాయికి తగినట్లుగా మెరుపులు ప్రదర్శించలేకపోయారు. ఈ క్రమంలో 33 బంతుల్లో ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత బ్రేవో చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ప్లెసిస్, స్మిత్ (5), మార్ష్ (7) వెనుదిరిగారు. దాంతో రన్‌రేట్ తగ్గిపోయి జట్టు 150 పరుగులు కూడా దాటుతుందా అనిపించింది. అయితే చివర్లో ధోని మెరుపులతో పుణే చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. బ్రేవో వేసిన ఈ ఓవర్లో ధోని 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 20 పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులతో పటిష్టంగా ఉన్న పుణే... చివరి 10 ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. తన చివరి రెండు ఓవర్లలో 3 పరుగులే ఇచ్చి జడేజా ఇందులో కీలక పాత్ర పోషించాడు. మెరుపు ఓపెనింగ్: లయన్స్‌కు ఓపెనర్లు ఫించ్, మెకల్లమ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఆర్పీ సింగ్ ఓవర్లో మెకల్లమ్ రెండు సిక్సర్లు బాదగా, ఆ తర్వాత ఇషాంత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. తన తొలి ఓవర్లో నాలుగే పరుగులు ఇచ్చి అశ్విన్ కాస్త తెరిపినిచ్చినా... తర్వాతి రెండు ఓవర్లు గుజరాత్ పంట పండించాయి. మురుగన్ అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన ఫించ్... భాటియా తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 33 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో 33 బంతుల్లోనే ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మురుగన్ అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత తన దూకుడు కొనసాగించిన మెకల్లమ్ అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మెకల్లమ్, కొద్ది సేపటికే రైనా (24 బంతుల్లో 24; 1 ఫోర్) కూడా వెనుదిరిగినా... బ్రేవో (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీ) (బి) తాంబే 21; డు ప్లెసిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) తాంబే 69; పీటర్సన్ (బి) బ్రేవో 37; స్మిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) జడేజా 5; ధోని (నాటౌట్) 22; మార్ష్ (బి) జడేజా 7; భాటియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-27; 2-113; 3-132; 4-134; 5-143. బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0; జకాతి 4-0-40-0; తాంబే 4-0-33-2; బ్రేవో 4-0-43-1; జడేజా 4-0-18-2; ఫాల్క్‌నర్ 2-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) ఇషాంత్ (బి) మురుగన్ 50; మెకల్లమ్ (సి) డు ప్లెసిస్ (బి) ఇషాంత్ 49; రైనా (స్టంప్డ్) ధోని (బి) మురుగన్ 24; బ్రేవో (నాటౌట్) 22; జడేజా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-85; 2-120; 3-147. బౌలింగ్: ఆర్పీ సింగ్ 2-0-21-0; ఇషాంత్ 4-0-39-1; అశ్విన్ 4-0-26-0; మురుగన్ 4-0-31-2; భాటియా 3-0-30-0; మార్ష్ 1-0-10-0. జడేజా స్పెషల్... గతంలో మూడు ఐపీఎల్ జట్ల తరఫున బరిలోకి దిగినా... సొంత రాష్ట్రంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని లోటు జడేజాకు ఉండేది. ఇప్పుడు గుజరాత్ లయన్స్ తరఫున అతను తొలిసారి తన సొంత ప్రేక్షకుల మధ్య రాజ్‌కోట్‌లో ఆడి సత్తా చాటాడు. రాజ్‌కోట్‌లోనూ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. తన తొలి రెండు ఓవర్లలో ఒక సిక్స్‌తో 15 పరుగులు ఇచ్చిన జడేజా తర్వాతి రెండు ఓవర్లు మ్యాచ్ దిశను మార్చాయి. 17వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చిన అతను, 19వ ఓవర్లో మరో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. ఓ దశలో 180 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించిన పుణే... జడేజా స్లాగ్ ఓవర్ల ప్రదర్శన కారణంగా 163 పరుగులకే పరిమితమైంది. -
అన్నాడీఎంకే నేత అరెస్టు
కెలమంగలం: కెలమంగలం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు విధులను అడ్డుకున్న అన్నాడీఎంకే కెలమంగలం పట్టణ కార్యదర్శి మురుగన్(48)ను అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీకి వెళ్లిన మురుగన్ పోలీసులపై గొడవకు దిగి విధులను అడ్డుకొన్నాడు. ఎస్.ఐ.ఆనంద్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్వైన్‌ఫ్లూపై స్పష్టత ఏది?
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభించి అనేక మంది మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాలేదని కొట్టిపారేయడంతోనే ఇటీవల వరకు సరి పెడుతూ వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ వ్యాధి తీవ్రత ఎక్కు వగా ఉందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రజలలో మాత్రం ఈ వ్యాధిపై ఒక భయానక వాతావరణం నెలకొంది. పత్రికలలో స్వైన్‌ఫ్లూ వ్యాధి వలన ఇప్పటికే చాలా మంది మృత్యువాతపడుతు న్నట్లు ప్రతి రోజూ కథనాలు వస్తున్నా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అసలు స్వైన్‌ఫ్లూ లేదని కరాఖండిగా చెబుతూ వచ్చింది. ఇప్పుడు సైతం ఈ వ్యాధితో చనిపోయేంత ప్రమాదం ఉండదని ఊపిరితిత్తులు, కాలే యం, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి స్వైన్‌ఫ్లూ వస్తే పరిస్థితి విషమిస్తుందని తెలుపుతూ చేతులు దులుపుకుంటోంది. మరో వైపున తెలంగాణలోని ప్రధాన ఆస్పత్రులలో సైతం వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికైనా మేల్కొని స్వైన్‌ఫ్లూ వ్యాధిపై నిజానిజాలు వెల్లడించాలి. ప్రజలలో రోజు రోజుకు పేరుకుపోతున్న భయాందోళనలను పార ద్రోలి, అందరికీ వైద్య చికిత్సకు వీలుకల్పించి భరోసా ఇవ్వాలి. కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ వీరికి విద్యార్హత వద్దా? మన దేశంలో గుమాస్తా పదవులకు కూడా కనీస విద్యార్హతగా 5వ తర గతిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి రాజ్యాంగ విధులను నెరవేర్చే నాయకులకు కనీస విద్యార్హత లేకపోవడం వలన అవినీతి చెర గని సిరాగా మారిపోయింది. పైగా మన నేతలు శాసనసభకు, పార్ల మెంటుకు ఒకేసారి పోటీ చేస్తూ గెలిచాక ఏదో ఒకదాన్ని నిలుపుకుంటూ తక్కిన సీటుకు రాజీనామా చేస్తున్నారు. అలా వదులు కున్న సీటుకు మళ్లీ ఎన్నికలు జరపడం, లక్షలు, కోట్లలో ఖర్చు పెట్టడం వల్ల ఆర్థికంగా దేశం తీవ్రంగా నష్టపో తోంది. కాబట్టి గెలిచిన వారే రాజీనామా చేసిన నియోజ కవర్గం ఎన్నికల ఖర్చు భరించేలా ఎన్నికల కమిషన్ నిబంధన విధించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంటర్ ఉత్తీర్ణతను, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణ యించాలి. లేదంటే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ ఉద్యో గులు విద్యార్హత లేని నేతలముందు చేతులు కట్టుకుని మెలగాల్సి వస్తుంది. ఇది ఉన్నత విద్యకే అవమానం. ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఓట ర్లను ఆకర్షించే నేతల వాగ్దానాలపై కొరడా ఝళిపించాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కనీస విద్యను అర్హతగా పెట్టాలి. కొలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి మురుగన్‌లు మరణించరు ప్రశ్నకు సమాధానం లేనప్పుడు, దౌర్జన్యమే శరణ్యమవుతుంది. భావ స్వేచ్ఛ మీద నమ్మకం లేనప్పుడు దాడే ఆయుధమవుతుంది. ప్రజాస్వా మ్యంలో విశ్వాసం లేనప్పుడు నిరంకుశత్వం పడగ విప్పుతుంది. గతం మీద మత్తు ఉన్నప్పుడు వర్తమానం మీద అసహ నం కలుగుతుంది. తార్కికబుద్ధి లోపించినప్పుడు మౌడ్యం విజృంభిస్తుంది. తమిళ రచయిత మురుగన్ విషయంలో ఇదే జరిగింది. దౌర్జన్యాలకు తలొగ్గి ఒక రచయిత తాను రచయితగా మరణించినట్లు తనకు తానుగా ప్రకటన చేయడం స్వతంత్ర భారతదేశ చరిత్రకు మాయనిమచ్చ. రచన వెలువ డినప్పుడు దాంట్లోని మంచి చెడులను నిర్ణయించడం ఒక నాగరిక చర్య. అలాకాకుండా, రచయిత మీద దాడిచేసి తాను మరణించానని అతడే స్వయంగా ప్రకటించేలా చేయడమంటే మనకు ప్రజాస్వామ్యం ఇంకా జీర్ణం కాలేదని అర్థం. దేశ గౌరవానికి ఇలాంటి సంఘటనలు తలవంపులు తెస్తాయి. ఒక అంశం మీద అందరికీ ఒకే రకమైన అభిప్రా యం ఉండదు. అభిప్రాయ భేదాలను గౌరవించడం కనీస ప్రజాస్వా మ్యం. భౌతిక దాడులతో బౌద్ధిక శక్తులను అణచివేయాలనుకోవడం అప్రజాస్వామికం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ మీద వీరి దాడిని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గర్హించి ఖండి స్తోంది. మురుగన్‌లు ఎన్నటికీ మరణించరని చాటుతున్నది. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం ధూమపాన నియంత్రణ! ధూమపానాన్ని నియంత్రించే దిశగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగానే స్వాగతించదగినవి. దేశం లో 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పొగాకు ఉత్పత్తులను అమ్మాలనడం, సిగిరెట్లు విడిగా అమ్మకూడదనటం.. ఇవన్నీ ధూమ పాన నియంత్రణలో భాగమే. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమ పానం చేస్తే 200ల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తామనడం కూడా మంచి నిర్ణయమే. అయితే ఈ నిర్ణయాలన్నీ కచ్చితంగా అమలయ్యే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కొన్ని సంవత్స రాల క్రితం గుట్కా, పాన్ పరాగ్ వంటి మత్తు కలిగించే పొగాకుతో కూడిన ఉత్పత్తులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇలాగే నిషేధం విధించింది. కానీ ఈ ఉత్పత్తులు నేటికీ దేశంలోని ప్రతి దుకాణంలోనూ లభ్యం కావడమనేది, నిషేధం అమలుపై కేంద్ర ప్రభు త్వ నియంత్రణా లోపాలను అత్యంత స్పష్టంగా ఎత్తి చూపుతోంది. దీని ఫలితంగా ప్రకటన చేయడం సాధ్యమే కాని, అమలు అసాధ్యం అని తేలుతోంది. ఇక్కడ ప్రభుత్వమే గాక, ప్రతి పౌరుడూ స్వచ్ఛందంగా వీటి అమలుకు తన సహకారాన్ని అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తెరిగి నడుచుకోవాలి. సలగల వెంకటేశ్వర్లు, బాపట్ల, గుంటూరు ఉద్యోగులకు జీతాల్లేవా! రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలకుగాను ఉద్యోగులకు వేతనాలు చెల్లించ డానికి కూడా డబ్బు లేని స్థితిలో పడిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. వేలాది కోట్ల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయగలిగిన, కోటిమంది తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక అందివ్వగలిగిన ప్రభు త్వం... తన ఉద్యోగులకు నెల జీతాలుకూడా చెల్లించలేని దుస్థితిలో ఉందా? ఇది నిజమే అయితే దీనికో పరిష్కారం ఉంది. సింగపూర్ తన భూమిని విస్తరించుకోడానికి తన చిన్న దీవి చుట్టూ ఉన్న లోతులేని సముద్ర ప్రాంతాన్ని నివాస యోగ్యంగా చేసుకోవడంలో విజయం సాధించింది. మనం కూడా ప్రతిపాదిత రాజధాని చుట్టూ ఉన్న 50 చద రపు కిలోమీటర్ల పరిధిలోని భూమిని కనీసం 50 ఏళ్లపాటు లీజుకిచ్చి దీనిపై ప్రతి ఏటా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. అమ్మడం అవసరమయ్యాక ఇక కించపడాల్సిన పనిలేదు. నెపోలియన్ తన యుద్ధావసరాల కోసం లూసియానా ప్రాంతాన్ని అమెరికాకు అమ్మే శాడు. రష్యా జార్ చక్రవర్తి అలస్కాను అమెరికాకు అమ్మేశాడు. చైనా కూడా హాంగాంగ్, మకావూలను ఇంగ్లండ్, పోర్చుగీసులకు వందేళ్లపాటు లీజుకు ఇచ్చేసింది. పోర్చుగీసు రాజు మన ముంబైని బ్రిటిష్ రాణికి కట్నం కింద అప్పగించేశాడు. ఇలా చరిత్రలోని ఆచరణాత్మక అనుభవాలతో కొత్త రాష్ట్రం కూడా సింగపూర్ బాటలో నడవవచ్చు. డాక్టర్ టి. హనుమాన్ చౌదరి, కార్ఖానా, సికిందరాబాద్ -
కొంత ఇస్తే చాలదట!
దక్షిణాది చిత్రాలను పెడచెవిన పెట్టి ఆ మధ్య బాలీవుడ్ మోహంలో పడ్డ తమన్నకు అక్కడ అచ్చి రాలేదు. దీంతో మళ్లీ దక్షిణాదే దిక్కంటూ తిరుగుటపా కట్టింది. టాలీవుడ్లో ఒకటి రెండు చిత్రాలు రావడంతో అమ్మడు మల్లీ చెట్టెక్కి కూర్చొందనే టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి జోరు మీదున్న యువ నటుడు శివకార్తికేయన్ దృష్టి తమన్నపై పడిందట. ఈయన నటించనున్న తాజా చిత్రంలో తమన్నతో డ్యూయెట్లు పాడాలని ఆశపడుతున్నారట. రజనీ మురుగన్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి నిర్మించనున్నారు. దీంతో నిర్మాతల వర్గం, ఎంపిక చేసే హీరోయిన్ల జాబితాలో తమన్న పేరు మొదటి వరసలో చోటు చేసుకుందట. అయితే రజనీ మురుగన్ చిత్రం కోసం తమన్నను సంప్రదించగా ‘నాకు బాలీవుడ్లో అంత పారితోషికం ఇస్తున్నారు. టాలీవుడ్లో ఇంత పారితోషికం పుచ్చుకుంటున్నాను. మీరు మాత్రం కొంత ఇస్తే చాలదు.’ అంటూ పెద్ద మొత్తంలో లిస్ట్ ఇచ్చిందట. దీంతో నిర్మాత కళ్లు బైర్లు కమ్మాయట. తమిళంలో మీకంత మార్కెట్ లేదు, బిజినెస్ లేదు. మీరు అడిగిన పారితోషికంతో నయనతారనే ఎంపిక చేసుకోవచ్చు అంటూ రుసురుసలాడుతూ తిరిగొచ్చేశారట. ఈ విషయం అటుంచితే ఈ మిల్కీ బ్యూటీతో రొమాన్స్ చేయాలన్న కోరిక తీరలేదన్న చింత శివకార్తికేయన్‌ను వెంటాడుతోందట. -
జైలులో నళిని- మురుగన్ భేటీ
వేలూరు, న్యూస్‌లైన్: రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్ శనివారం ఉదయం కలిసి మాట్లాడుకున్నారు. మురుగన్ పురుషుల జైలులో ఉండగా అతని భార్య నళిని మహిళా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నళిని, మురుగన్‌లు ఇద్దరూ నెలకోసారి కలిసేందుకు ఇది వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా పోలీస్ బందోబస్తు నడుమ జైలులో కలిసి మాట్లాడుతున్నారు. శనివారం ఉదయం డీఎస్పీ ప్రభాకరన్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ఉదయం 7.30 గంటలకు మురుగన్‌ను మహిళా సెంట్రల్ జైలు వద్దకు వాహనంలో తీసుకొచ్చి నళినీతో కలిసి మాట్లాడే ఏర్పాట్లు చేశారు. ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదీగా ప్రకటించిన అనంతరం నళిని, మురుగన్ కలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.