ఢిల్లీ, సాక్షి: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాజ్యసభకు రీనామినేట్ అయ్యారు. ఒడిషా నుంచి ఆయనకు రాజ్యసభ టికెట్‌ను కేటాయించింది బీజేపీ. అలాగే.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి(సహాయ) డాక్టర్ ఎల్. మురుగన్ తో పాటు మరో ముగ్గురి పేర్లను నామినేట్ చేసింది.
ఒకవేళ అశ్వినీ వైష్ణవ్, మురుగున్‌లు గనుక ఎన్నికైతే.. అదే రాష్ట్రాల నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వహించే నేతలు అవుతారు. మధ్యప్రదేశ్ నుంచి మురుగన్‌తో పాటు ఉమేష్ నాథ్, మాయ నరోలియా, బన్సీలాల్ గుర్జర్ పేర్లను బీజేపీ నామినేట్ చేసింది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన అశ్వినీ వైష్ణవ్.. 2019లో తొలిసారి ఒడిషా అధికార పార్టీ బీజూ జనతా దళ్(BJD) మద్దతుతో నెగ్గారు. రెండోసారి కూడా ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోనూ మురుగన్ గెలుపు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. రాజ్యసభ సీట్లలో సంఖ్యా బలం ఆధారంగా చూసుకుంటే.. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒక్క సీటు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment