న్యూఢిల్లీ: లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు కేంద్రమంత్రిపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి. లోక్‌సభ క్వశన్ అవర్ సమయంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌పై ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
డిసెంబర్‌లో ప్రకృతి విపత్తుల వల్ల భారీ వర్షాలు, వరదలతో దక్షిణ చెన్నై అతలాకుతలం అయిందని.. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం ఎటువంటి బృందాన్ని పంపిందని డీఎంకే పార్టీ ఎంపీలు ఏ రాజా, ఏ గణేశ్‌మూర్తి ప్రశ్నించారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
‘మీరు ఎందుకు ఈ విషయంతో జోక్యం చేసుకుంటున్నారు. మీరు దయచేసిన కూర్చోండి. అసలు మీకు ఏం కావాలి?. మీరు పార్లమెంట్ సభ్యులుగా అర్హులు కారు. మీరు కేంద్ర మంత్రిగా పనికిరారు’ అని డీఎంకే ఎంపీ విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంతి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘవాల్ ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు దళితులను అవమానించటం కిందకు వస్తాయని ఆరోపించారు.
‘డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఒక ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర మంతి ఎల్ మురుగన్ స్పందిస్తూ.. అప్రస్తుత ప్రశ్న అని తెలిపే క్రమంలో టీఆర్ బాలును.. మురుగన్‌ను కేంద్ర మంత్రిగా పనికిరావు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించటం కిందకు వస్తాయి. ఎంపీ టీఆర్ బాలు.. మంత్రి మురుగన్‌కు క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు.
ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఎల్ మురుగన్ స్పందించారు.‘ డీఎంకే పార్టీ వెనకబడిన కులాల నుంచి ఓ వ్యక్తి మంత్రిగా ఎదగటాన్ని సహించలేకపోతుంది. అందుకే నాపై అనుచిత వ్యాఖ్యలు చేయించి.. నా కులాన్ని అవమానపరిచింది’ అని మండిపడ్డారు. కేంద్రమంత్రిపై డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. బాలు ఇలాంటి దళిత వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదని మండిపడ్డారు.
Thiru TR Balu is a disgrace to politics & this is not the first time he has made disgraceful remarks about a member of the Scheduled Caste Community. I strongly condemn these remarks on Hon MoS Thiru @Murugan_MoS avl in the Temple of Democracy.
— K.Annamalai (@annamalai_k) February 6, 2024
Our Hon PM Thiru @narendramodi… pic.twitter.com/TDt3p39hks
Comments
Please login to add a commentAdd a comment