TR Baalu
-
‘మంత్రిగా పనికి రావు’.. డీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు కేంద్రమంత్రిపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి. లోక్‌సభ క్వశన్ అవర్ సమయంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌పై ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో ప్రకృతి విపత్తుల వల్ల భారీ వర్షాలు, వరదలతో దక్షిణ చెన్నై అతలాకుతలం అయిందని.. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం ఎటువంటి బృందాన్ని పంపిందని డీఎంకే పార్టీ ఎంపీలు ఏ రాజా, ఏ గణేశ్‌మూర్తి ప్రశ్నించారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఎందుకు ఈ విషయంతో జోక్యం చేసుకుంటున్నారు. మీరు దయచేసిన కూర్చోండి. అసలు మీకు ఏం కావాలి?. మీరు పార్లమెంట్ సభ్యులుగా అర్హులు కారు. మీరు కేంద్ర మంత్రిగా పనికిరారు’ అని డీఎంకే ఎంపీ విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంతి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘవాల్ ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు దళితులను అవమానించటం కిందకు వస్తాయని ఆరోపించారు. ‘డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఒక ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర మంతి ఎల్ మురుగన్ స్పందిస్తూ.. అప్రస్తుత ప్రశ్న అని తెలిపే క్రమంలో టీఆర్ బాలును.. మురుగన్‌ను కేంద్ర మంత్రిగా పనికిరావు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించటం కిందకు వస్తాయి. ఎంపీ టీఆర్ బాలు.. మంత్రి మురుగన్‌కు క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఎల్ మురుగన్ స్పందించారు.‘ డీఎంకే పార్టీ వెనకబడిన కులాల నుంచి ఓ వ్యక్తి మంత్రిగా ఎదగటాన్ని సహించలేకపోతుంది. అందుకే నాపై అనుచిత వ్యాఖ్యలు చేయించి.. నా కులాన్ని అవమానపరిచింది’ అని మండిపడ్డారు. కేంద్రమంత్రిపై డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. బాలు ఇలాంటి దళిత వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదని మండిపడ్డారు. Thiru TR Balu is a disgrace to politics & this is not the first time he has made disgraceful remarks about a member of the Scheduled Caste Community. I strongly condemn these remarks on Hon MoS Thiru @Murugan_MoS avl in the Temple of Democracy. Our Hon PM Thiru @narendramodi… pic.twitter.com/TDt3p39hks — K.Annamalai (@annamalai_k) February 6, 2024 -
అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే
చెన్నై: తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు లోక్‌సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించాయి. కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజ, టీఆర్ బాలు సహా పలువురికి డీఎంకే లోక్‌సభ టికెట్లను కేటాయించింది. డీఎంకే జాబితాలో ఏకంగా 12 కొత్త ముఖాలున్నాయి. 20లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌తోపాటు తమిళనాడులోని పలు చిన్న పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు చిన్న పార్టీలు ఉండటం తెలిసిందే. అన్నాడీఎంకే తమ పార్టీనేగాక, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కలిపి 40 లోక్‌సభ స్థానాలుండగా, డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశాయి. 8 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. డీఎంకే కూటమిలో అత్యధికంగా కాంగ్రెస్‌కు పది స్థానాలు దక్కగా, సీపీఐ, సీపీఎం, వీసీకేలు చెరో రెండు, మిగిలిన చిన్న పార్టీలు తలో సీటును దక్కించుకున్నాయి. ఇక అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే 7, బీజేపీ 5, డీఎండీకే 4 చోట్ల పోటీ చేయనున్నాయి. మిగిలిన నాలుగు సీట్లను చిన్న పార్టీలకిచ్చారు. తొలిసారి లోక్‌సభకు కనిమొళి పోటీ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే తమిళనాడు లో 18 నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా డీఎంకే ప్రకటించింది. -
ఎమ్మెల్యేగారి భార్య భవనం కూల్చివేతకు రంగం సిద్ధం
టీనగర్: చెన్నైలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కేంద్ర మాజీ మంత్రి టీఆర్‌బాలు కోడలు భవనాన్ని కూల్చివేసేందుకు సీఎండీకే అధికారులు నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు కోడలు షర్మిలరాజ. ఈమె చెన్నై త్యాగరాయ నగర్, బజుల్లా రోడ్డు డోర్ నెం. 103 అనే చిరునామాలో గ్రౌండ్ ఫ్లోర్‌తో కూడిన రెండు అంతస్తుల కార్యాలయాన్ని, నివాస గృహాన్ని నిర్మించేందుకు 2011 నవంబర్‌లో చెన్నై కార్పొరేషన్లో ప్లానింగ్ అనుమతి కోరారు. అయితే ప్లానింగ్ అనుమతికి విరుద్దంగా నిర్ణీత స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా అనేక నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసింది. దీని గురించి వివరణ కోరుతూ 2013 ఏప్రిల్ 23వ తేదీ సీఎండీఏ ఒక నోటీసు పంపింది. దీంతో మే 9వ తేదీ భవనానికి రీ ప్లాన్ ఇవ్వాలని యజమాని కోరారు. దీన్ని నిరాకరించిన సీఎండీకే అధికారులు 2013 అక్టోబర్ 4వతేదీ భవనానికి సీల్ వేశారు. దీంతో షర్మిల రాజ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ లేఖపై గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనలను సవరించేందుకు అనుమతించాలని గృహ నిర్మాణ శాఖ సీఎండీఏ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు సీఎండీఏ యజమాన్యం ఇటీవల ఇచ్చిన వివరణలో భవనంలో ఉల్లంఘించిన నిబంధనలను సరిచేసేందుకు సాధ్యం కాదని అందువల్ల భవన యజమాని కోర్కెను నిరాకరిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ భవనాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. షర్మిలరాజ భర్త టీఆర్ బాలు కుమారుడైన టీఆర్ రాజ మన్నార్గుడి అసెంబ్లీ సభ్యుడు కావడం గమనార్హం.