రాజీవ్‌గాంధీ హత్య కేసు: ఏడాది తర్వాత కలిశారు | Murugan And Nalini Meet After One Year In Vellore Central Jail | Sakshi
Sakshi News home page

రాజీవ్‌గాంధీ హత్య కేసు: ఏడాది తర్వాత కలిశారు

Published Sun, Feb 21 2021 9:45 AM | Last Updated on Sun, Feb 21 2021 10:15 AM

Murugan And Nalini Meet After One Year In Vellore Central Jail - Sakshi

వేలూరు: వేలూరు మహిళా సెంట్రల్‌ జైలులో మురుగన్, నళిని పటిష్ట పోలీస్‌ బందోబస్తు నడుమ ఏడాది తర్వాత శనివారం ఉదయం కలసి మాట్లాడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో వీరిద్దరు వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి వీరు నేరుగా కలవకుండా ఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నారు.

ఏడా ది తర్వాత ప్రస్తుతం నేరుగా మాట్లాడేందుకు అనుమతించాలని నళిని న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో జైళ్లశాఖ అనుమతితో మురుగన్‌ను పటిష్ట బందోబస్తు నడుమ మహిళా జైలు వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. కలయిక అనంతరం  మురుగన్‌ను పురుషుల జైలుకు తీసుకొచ్చారు.
చదవండి: ఓటు వేయలేదని గునపాలతో దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement