Vellore Central jail
-
రాజీవ్‌గాంధీ హత్య కేసు: ఏడాది తర్వాత కలిశారు
వేలూరు: వేలూరు మహిళా సెంట్రల్ జైలులో మురుగన్, నళిని పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ఏడాది తర్వాత శనివారం ఉదయం కలసి మాట్లాడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో వీరిద్దరు వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి వీరు నేరుగా కలవకుండా ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. ఏడా ది తర్వాత ప్రస్తుతం నేరుగా మాట్లాడేందుకు అనుమతించాలని నళిని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జైళ్లశాఖ అనుమతితో మురుగన్‌ను పటిష్ట బందోబస్తు నడుమ మహిళా జైలు వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. కలయిక అనంతరం మురుగన్‌ను పురుషుల జైలుకు తీసుకొచ్చారు. చదవండి: ఓటు వేయలేదని గునపాలతో దాడి -
జైలులోనే సజీవ సమాధి అవుతా..
- సంచలనానికి తెరలేపిన ‘రాజీవ్ గాంధీ హంతకులు’ - ఆమరణ నిరశనకు సిద్ధపడ్డ మురుగన్.. హైకోర్టుకు నళిని - దంపతులు త్వరలో విడుదలవుతారన్న న్యాయవాది వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మురుగన్, నళిని దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. గడిచిన 26 ఏళ్లుగా కారాగారవాసం గడుపుతోన్న తనకు.. విడుదలవుతానన్న నమ్మకం లేదని, అందుకే జైలులోనే సజీవ సమాధి కావాలనుకుంటున్నట్లు మురుగన్ కోరుతున్నాడు. ఈ మేరకు తాను ఉంటోన్న వేలూరు సెంట్రల్ జైలులోనే ఆగస్టు 18 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశాడు. శనివారం జైలులో మురుగన్‌ను కలిసివచ్చిన అనంతరం అతని తరఫు లాయర్ పుగళేంది ఈ విషయాలను మీడియాకు వెల్లడించాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల సెంట్రల్ జైలులో మురుగన్, పేరరివాలన్, శాంతనులతో పాటు ఏడుగురు జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. మురుగన్-నళిని దంపతుల కుమార్తె.. ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తోన్న అరిత్ర త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నది. కుమార్తె వివాహన్ని దగ్గరుండి జరిపేందుకుగానూ ఆరు నెలల పెరోల్ అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారి న్యాయవాది తెలిపారు. పెరోల్ కోసం నళిని గత నవంబర్లోనే వినతి పత్రం సమర్పించారని, గత జనవరిలో రెండోసారి కూడా విన్నవించుకున్నా అధికారుల నుంచి స్పందన రాలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు న్యాయవాది చెప్పారు. సోమవారం చెన్నై హైకోర్టులో నళిని తరఫున పిటిషన్ వేయబోతున్నట్లు పేర్కొన్నారు. నళిని-మురుగన్ త్వరలో విడుదలవుతారు! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నళిని-మురుగన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది అన్నారు. కాగా, గతంలోనూ వీరి విడుదలకు తమిళ ప్రభుత్వం ప్రతిపాదను పంపడం, కేంద్ర ప్రభుత్వం దానిని నిరాకరించడం పలుమార్లు జరిగింది. 1991లో జైలుకు వచ్చేనాటికి నళిని రెండు నెలల గర్భవతి అని, ఆమెకు అరిత్రా అనే కుమార్తె జన్మించిందని, నాలుగు సంవత్సరాల పాటు ఆ పాప తల్లితోపాటే జైలులో ఉందని, ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నదని నళిని-మురుగన్ల న్యాయవాది పుగళేంది గుర్తుచేశారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..) -
24 ఏళ్ల తరువాత విడుదలైన మహిళ
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు సెంట్రల్ జైలులో 24 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన మహిళ శనివారం విడుదలైంది. న్యాయవాది పుగయేండి వెల్లడించిన వివరాల ప్రకారం, తిరుప్పూర్‌కు చెందిన సుబ్రమణి భార్య పక్కా అలియాస్ విజయ(60) వీధి నాటకాలు వేస్తుండేది. రాత్రి వేళల్లో ఎక్కడ చోటు ఉంటే అక్కడ నిద్రించేది. 1990 ఏప్రిల్ 24న రాత్రి నాటకం వేసి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ఒక వ్యక్తి తాగిన మైకంలో లైంగికదాడికి యత్నించాడు. దీంతో విజయ, ఆమె భర్త సుబ్రమణి ఇద్దరూ దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అరుుతే కోవై పోలీసులు మాత్రం రూ.500 కోసం హత్య చేసినట్లు వీరిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సుబ్రమణి, భార్య విజయకు యావజ్జీవ జైలు శిక్ష విధించారు. విజయను రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని ఉండే గదిలో ఉంచారు. ఈమెకు, నళినీకి మధ్య పరిచయం ఏర్పడిం ది. ఈ క్రమంలో తమ న్యాయవాది పుగయేం డికి నళిని విషయం తెలియజేసింది. ఆమెను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ న్యాయవాది 2011లో చెన్నై హైకోర్టులో అప్పీలు చేశాడు. చెన్నై హైకోర్టు న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ పలు కోణాల్లో విచారణ జరిపి ఈ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీలోపు విడుదల చేయాలని తీర్పు చెప్పారు. ఆ ఉత్తర్వులు జైలు అధికారులకు శనివారం అందడంతో, ఆమెను విడుదల చేసి వేలూరులోని కారుణ్య కేంద్రంలో చేర్పించా రు. 24 ఏళ్ల జైలు జీవితం అనుభవించి విడుదలైన విజయ ప్రస్తుతం మతిస్థిమితం కోల్పోవడం విచారకరం. ఇదిలా ఉండగా విజయ భర్త సుబ్రమణి మాత్రం వేలూరు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.