చదువుతో పాటు క్రీడలు నేర్పించాలి: సైనా | sports also important along with studies : saina nehwal | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు క్రీడలు నేర్పించాలి: సైనా

Published Mon, Feb 3 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

sports also important along with studies : saina nehwal

సోమాజిగూడ, న్యూస్‌లైన్: విద్యాసంస్థలు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సూచించింది. సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో స్కూల్ రేటింగ్ కంపెనీ గ్రేమాటర్స్ ఆధ్వర్యంలో ‘బాటిల్స్ ఆఫ్ ద బెస్ట్ విజన్-2020’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైంది.

ఈ సందర్భంగా హైదరాబాదీ స్టార్ మాట్లాడుతూ... సంపూర్ణ మానసిక, శారీరక వికాసానికి తోడ్పడే క్రీడలను విద్యార్థులకు తప్పనిసరిగా నేర్పించాలని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే విధంగా శిక్షణనిస్తున్న స్కూళ్లను ఎంపిక చేయగా అందులో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ విజేతగా నిలిచింది. ఆ స్కూల్‌కు సైనా ట్రోఫీని అందజేసింది. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో ప్రదీప్ శర్మ, పలు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement