హైదరాబాద్: సోమాజిగూడలో పి. అనూష(27) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అనూష స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 23 రోజుల క్రితమే అనూషకు ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లైంది. అనూష, హర్షిత అనే మహిళతో కలిసి కళానిక కాస్టైల్ అపార్టుమెంటులోని 302 ఫ్లాట్‌లో ఉంటుంది. హర్షిత షిర్డీకి వెళ్లి వచ్చి చూసేసరికి అనూష శవమై పడి ఉంది.