
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు. 20కి పైగా ఐటీ శాఖ బృందాలు.. మూడు బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లల్లోపాటు(సురేందర్ రావు-సోమాజిగూడ, రవీందర్ రావు-సికింద్రాబాద్, దేవేందర్ రావు-మలక్‌పేట), నాగార్జున హిల్స్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. వీరి నుంచి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఆదాయపు పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ?
Comments
Please login to add a commentAdd a comment