Malakpeta
-
రోగులను నిర్లక్ష్యం చేస్తే డిస్మిస్.. మంత్రి హరీశ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రోగులపట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణించామని.. అటువంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. అన్ని వయసుల వారికీ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందని... ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పేర్కొనే డబుల్ ఇంజన్ సర్కారున్న ఉత్తరప్రదేశ్ ఈ ర్యాంకుల్లో చివరి స్థానంలో నిలిచిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ చార్జిïÙట్ విడుదల చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివరి్ణంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చార్జిషీట్ పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు. వైద్య రంగంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచీలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్ 16వ స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 10వ స్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 7వ స్థానంలో నిలిచాయనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని... దీనివల్ల అక్కడక్కడా వారు అనారోగ్యం బారినపడుతున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రానికి ఎన్నో అవార్డులు... దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందని.. యునిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సంరక్షించడంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్‌కు ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ ద్వారా వైద్య సేవలు అందించినందుకు కేంద్రం రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. పీహెచ్సీ, జిల్లా ఆసుపత్రి, యూపీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ ఆష్యురెన్స్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి మూడు కేంద్ర అవార్డులు లభించాయన్నారు. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు వరల్డ్ టీబీ డే సందర్భంగా కేంద్రం అవార్డులు ప్రకటించిందని గుర్తుచేశారు. గతేడాది 2.59 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు.. ఈ ఏడాది మరిన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు. ఈఎన్టీ, సరోజినీదేవి ఆసుపత్రులను మరింత పట్టిష్టం చేస్తామని, ఆహార కల్తీ నియంత్రణపై మరింతగా దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారని, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో 43,702 మంది లబ్ధి పొందారని మంత్రి వివరించారు. గతంలో పరిమితి రూ. 2 లక్షలు ఉంటే దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అలాగే అవయవ మారి్పడి వంటి శస్త్రచికిత్సల కోసం రూ. 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో కవరేజీ కలి్పస్తున్నామన్నారు. -
పాపం అని ఉద్యోగం ఇస్తే.. అదును చూసి..
మలక్‌పేట(హైదరాబాద్): పని కల్పించిన ఓ యజమాని ఇంటికే కన్నం వేసిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. డీఐ నానునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌కుమార్ అనే వ్యాపారవేత్త మూసారంబాగ్ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నేపాల్‌కు చెందిన అశోక్, రేఖ అనే ఇద్దరు వ్యక్తులను కొంత కాలంగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గురువారం కుటుంబ సభ్యులు పని మీద బయటకి వెళ్లారు. ఇంట్లోని ఓ గదిలో వృద్ధురాలు మాత్రమే ఉంది. ఇదే అదనుగా భావించిన వారు మరో గదిలో ఉన్న బీరువా తాళాలు తెరచి అందులో ఉన్న రూ.10లక్షల నగదు దొంగలించి పరారయ్యారు. ఇంటికి వచ్చిన యజమాని కుటుంబ సభ్యులు తెరిచి ఉన్న బీరువా చూసి కంగుతున్నారు. అందులో ఉన్న రూ.10లక్షలు కన్పించలేదు. విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ ఘటన స్ధలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు. 20కి పైగా ఐటీ శాఖ బృందాలు.. మూడు బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లల్లోపాటు(సురేందర్ రావు-సోమాజిగూడ, రవీందర్ రావు-సికింద్రాబాద్, దేవేందర్ రావు-మలక్‌పేట), నాగార్జున హిల్స్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. వీరి నుంచి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఆదాయపు పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ? -
ఊరపందుల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్(మలక్‌పేట) : ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షవర్ధన్(3) అనే బాలుడిపై ఊరపందులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనిచేసుకునే కేశ్యానాయక్‌కు కుమార్తె, కుమారుడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గుడిసెలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కేశ్యానాయక్ మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్ గుడిసె ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఊరపందులు బాలుడిపై దాడి చేశాయి. గుడిసెలో ఉన్న తల్లిదండ్రులు బయటికి వచ్చేసరికి పందులు బాలుని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు వాటి వెంటపడటంతో విడిచి పెట్టి పారిపోయాయి. పందుల దాడిలో బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
మలక్‌పేట్ మార్కెట్లో నిలిచిన ఉల్లి విక్రయాలు
-
బీజేపీకి పెద్ద మొత్తంలో ఫండ్ ఎలా వస్తోంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీహెచ్ఎంసీకి ముందుస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ఎన్నికల్లో తాము 99 స్థానాల్లో గెలుపొందామని, ఈసారి 106 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం, యాకత్‌పుర పరిధిలోని వినయ్ నగర్ కమిటీ హాల్, బహదూర్ పుర ప్రాంతాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉచితంగా పార్టీ సభ్యుత్వాన్ని అందిస్తున్న బీజేపీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఎలా వస్తోందని ప్రశ్నించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా ఇటీవల తెలంగాణ వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వ్యాపారవేత్తలచేత బలవంతంగా సభ్యుత్వ కార్యక్రమాలు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తోన్న కార్యక్రమాలకు ప్రజలంతా ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి సముచిత గుర్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు. -
మందుబాబుల అడ్డాగా ఏరియా ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేట ఏరియా ఆసుపత్రి మందుబాబుల అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు ఆసుపత్రి ప్రాంగణంలో మందుబాబులు దర్శనమిస్తున్నారు. రాత్రుళ్లు ఏరియా ఆసుపత్రి బార్‌ను తలిపించేలా మారుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. సీసీ కెమరాలు ఉన్నా సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కలిసి పార్టీలు చేస్తున్నట్లు సమాచారం. వీళ్లకు మద్దతుగా పార్కింగ్ సిబ్బంది తోడు అవ్వటంతో అర్ధరాత్రి అవ్వగానే ఆసుపత్రిలా కాకుండా మలక్‌పేట ఏరియా బార్లా కనిపిస్తోంది. -
ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం
హైదరాబాద్ : మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. డెలివరీకి వచ్చిన మహిళ అకస్మాత్తుగా చనిపోవడంతో ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు..మిర్యాలగూడకు చెందిన ప్రవీణ్, బిల్గేట్ హాచార్ భార్య,భర్తలు. వారం క్రితం డెలివరీ నిమిత్తం మలక్‌పేట్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. బిల్గేట్ హాచార్ 4 రోజుల క్రితం బాబుని ప్రసవించింది. ఆరోగ్యంగా ఉన్న బిల్గేట్ హాచార్ బుధవారం చనిపోయిందని చెప్పడంతో బంధువులు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే రూ.10 లక్షలు కట్టించుకున్నారని, అకస్మాత్తుగా చనిపోయిందని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రోజు రూ.1000 లేదా ఫుల్ బాటిల్ మందు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు లంచాల కోసం తమని వేధిస్తున్నారంటూ మలక్‌పేట ఆటో డ్రైవర్లు ఆదివారం ధర్నాకు దిగారు. ట్రాఫిక్ పోలీసులు రోజు వారి మామూళ్ల పేరుతో తమని నిత్యం వేధిస్తున్నారని అంబర్ పేట-దిల్షుక్నగర్ రూట్‌కు చెందిన ఆటో డ్రైవర్లు ఆరోపించారు. మామూళ్ల కింద ప్రతిరోజు ఒక మద్యం ఫుల్ బాటిల్ లేదా రూ.1000 ఇవ్వాలంటూ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్లు ఆరోపించారు. ఈ విషయంపై మలక్‌పేట ట్రాఫిక్ సీఐ వెంకట్‌రెడ్డిని ఆశ్రయించామని ఆయన సైతం మీకు దిక్కున్న చోటు చెప్పుకోండంటూ కానిస్టేబుళ్లకే వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమను లంచగొండి అధికారుల నుంచి కాపాడాలంటూ సాక్షాత్తు హోంమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇక చేసేది లేక ఆటో డ్రైవర్లు తమను ట్రాఫిక్ సీఐ, కానిస్టేబుల్ పోలీసులు లంచాల కోసం వేధిస్తున్న సన్నివేశాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా అవినీతి అధికారులను తప్పించాలంటూ మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో కిడ్నాప్..యువకుడి అరెస్ట్
మలక్‌పేట(హైదరాబాద్‌సిటీ): ప్రేమపేరుతో మైనర్బాలికను కిడ్నాప్ చేసిన ఓ యువకుడిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన రత్నాకర్ (24) దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూసారంబాగ్‌కు చెందిన మైనర్‌బాలిక(17)తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. బాలిక కన్పించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రత్నాకర్ తమ కూతురును కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుముందు హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. బాలికకు కౌన్సింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపించినట్లు తెలిపారు. -
మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు
ఎంబీటీ నాయకుడిపై దాడి కేసులో.. హైదరాబాద్: ఎంబీటీ నాయకుడిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాలను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం అక్బర్‌బాగ్ డివిజన్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్లు 40 మంది కార్యకర్తలతో కలసి దాడి చేశారు. దీంతో గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశోదా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుడు అంజదుల్లాఖాన్ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ఎంఐఎం నాయకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా పోలీసులు అదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల తోపాటు కార్పొరేటర్ మినాజుద్దీన్లను శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఎంఐఎంకు పూర్వవైభవం తేవాలి
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: ఒకప్పుడు నల్లగొండ జిల్లాకేంద్రం ఎంఐఎంకు కంచుకోట అని, మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని స్టార్ ఫంక్షన్హాల్లో జరిగిన ఎంఐఎం జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న బలంతో జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవలేమని, పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కార్యకర్తలు అక్బరుద్దీన్‌కు ఘనస్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. సమావేశంలో మలక్‌పేట ఎమ్మెల్యే హైమద్ బాలల్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖలీమ్, కార్పొరేటర్ మర్దుదా అలీ, జిల్లా నాయకులు హాషం, ఎండీ హతీఫ్, ఉబేరా, అస్వాక్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ‘ఫాల్గుణ మేళా’
రాధేశ్యామ్ నామస్మరణ... భక్తుల జయజయ ధ్వానాల మధ్య బుధవారం శ్యామ్‌బాబా ‘ఫాల్గుణి మేళా’ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం కాచిగూడ స్టేషన్ ఎదురుగా వీరన్నగుట్ట పై కొలువుదీరిన శ్యామ్మందిర్లో ఉదయం నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నగరంలోని మలక్‌పేట, అఫ్జల్‌గంజ్, గుల్జార్‌హౌజ్, చార్మినార్, నాచారం, దిల్సుఖ్నగర్, బేగంబజార్, సుల్తాన్‌బజార్ ప్రాంతాల నుంచి నిషాన్ శోభాయాత్రలు నిర్వహించారు. ఒంటెలు, గుర్రాలు ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు నేలపై పొర్లుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఊరేగింపునకు శ్యామ్‌సేవా సమితి కార్యదర్శి శివశంకర్ అగర్వాల్, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, బర్కత్‌పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.