ప్రేమ పేరుతో కిడ్నాప్‌..యువకుడి అరెస్ట్‌ | hyderabadi arrested in minor girl kidnap case | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో కిడ్నాప్‌..యువకుడి అరెస్ట్‌

Published Tue, May 23 2017 8:41 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

hyderabadi arrested in minor girl kidnap case

మలక్‌పేట(హైదరాబాద్‌సిటీ): ప్రేమపేరుతో  మైనర్‌బాలికను కిడ్నాప్‌ చేసిన ఓ యువకుడిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన రత్నాకర్‌ (24) దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూసారంబాగ్‌కు చెందిన మైనర్‌బాలిక(17)తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది.

బాలిక కన్పించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రత్నాకర్‌ తమ కూతురును కిడ్నాప్‌ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుముందు హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. బాలికకు కౌన్సింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులతో పంపించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement