
సాక్షి, అనంతపురం: కదిరిలో కలకలం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రకాష్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బాలికను ప్రకాష్ కిడ్నాప్ చేశాడాని పోలీసులు వెల్లడించారు. ఆరుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితులతో పాటు స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .కాగా శుక్రవారం ఉదయం బాలిక తల్లితండ్రులను ఇంట్లో బంధించి ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. కిలోమీటర్ల పాటు ఛేజింగ్ చేసి తెల్లవారి మూడు గంటల సమయంలో ధర్మవరం సమీపంలో కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment