మాట్లాడుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: ఒకప్పుడు నల్లగొండ జిల్లాకేంద్రం ఎంఐఎంకు కంచుకోట అని, మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని స్టార్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఎంఐఎం జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ప్రస్తుతం ఉన్న బలంతో జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవలేమని, పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కార్యకర్తలు అక్బరుద్దీన్‌కు ఘనస్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. సమావేశంలో మలక్‌పేట ఎమ్మెల్యే హైమద్ బాలల్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖలీమ్, కార్పొరేటర్ మర్దుదా అలీ, జిల్లా నాయకులు హాషం, ఎండీ హతీఫ్, ఉబేరా, అస్వాక్ తదితరులు పాల్గొన్నారు.