
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు.
కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment