హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నగరంలో కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్నారు. వీటిని అరికట్టడంలో నార్కోటిక్స్ పూర్తిగా విఫలమైందన్నారు.
నగరంలో యువత మత్తుపదార్థాలతో పెడదారి పడుతోందని, మత్తుకు అలవాటు పడటం సీరియస్ అంశమని అన్నారు. ఫార్మసీ స్టోర్‌లలో డాక్టర్ చిట్టీ లేకుండా డ్రగ్స్ ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే కాగ్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహించాల్సిందని అన్నారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 2018 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 67 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు.
చదవండి: తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’
Comments
Please login to add a commentAdd a comment