ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు లంచాల కోసం తమని వేధిస్తున్నారంటూ మలక్‌పేట ఆటో డ్రైవర్లు ఆదివారం ధర్నాకు దిగారు. ట్రాఫిక్ పోలీసులు రోజు వారి మామూళ్ల పేరుతో తమని నిత్యం వేధిస్తున్నారని అంబర్ పేట-దిల్‌షుక్‌నగర్ రూట్‌కు చెందిన ఆటో డ్రైవర్లు ఆరోపించారు.
మామూళ్ల కింద ప్రతిరోజు ఒక మద్యం ఫుల్ బాటిల్ లేదా రూ.1000 ఇవ్వాలంటూ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్లు ఆరోపించారు. ఈ విషయంపై మలక్‌పేట ట్రాఫిక్ సీఐ వెంకట్‌రెడ్డిని ఆశ్రయించామని ఆయన సైతం మీకు దిక్కున్న చోటు చెప్పుకోండంటూ కానిస్టేబుళ్లకే వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమను లంచగొండి అధికారుల నుంచి కాపాడాలంటూ సాక్షాత్తు హోంమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
ఇక చేసేది లేక ఆటో డ్రైవర్లు తమను ట్రాఫిక్ సీఐ, కానిస్టేబుల్ పోలీసులు లంచాల కోసం వేధిస్తున్న సన్నివేశాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా అవినీతి అధికారులను తప్పించాలంటూ మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment