
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసనగా ఆటో డ్రైవర్లు గురువారం ఖైరతాబాద్‌లోని కుషాల్ టవర్స్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రైవేటు ఫైనాన్సర్లలో దోపిడీ అరికట్టాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలలుగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఫైనాన్సర్లు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వేలకు వేలు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఓ ఆటో డ్రైవర్‌పై ఫైనాన్సర్లు దాడి చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లపై పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. లైసెన్స్ లేని ప్రైవేట్ ఫైనాన్సర్లు దోపిడీ దందా చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment