Speculators
-
ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసన
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసనగా ఆటో డ్రైవర్లు గురువారం ఖైరతాబాద్‌లోని కుషాల్ టవర్స్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రైవేటు ఫైనాన్సర్లలో దోపిడీ అరికట్టాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలలుగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఫైనాన్సర్లు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వేలకు వేలు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఓ ఆటో డ్రైవర్‌పై ఫైనాన్సర్లు దాడి చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లపై పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. లైసెన్స్ లేని ప్రైవేట్ ఫైనాన్సర్లు దోపిడీ దందా చేస్తున్నారని మండిపడ్డారు. -
స్పెక్యులేషన్వైపు చిన్న ఇన్వెస్టర్ల చూపు
నిజానికి స్టాక్ మార్కెట్లలో లాభాల కోసం అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్వల్పకాలిక లాభాల కోసం ట్రేడర్లు ఎఫ్ండ్వో స్టాక్స్‌లో భారీగా పొజిషన్లు తీసుకుంటుంటారు. అయితే కొద్ది రోజులుగా రిటైల్ ఇన్వెస్టర్లు సైతం స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు శామ్కో గ్రూప్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా పేర్కొంటున్నారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లలో ఇటీవల ఆటుపోట్లు పెరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మార్కెట్ల తీరు, బ్యాంకింగ్ ఫలితాలు తదితర అంశాలపై మెహతా వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం.. డెలివరీలు తక్కువే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకంటే అధికంగా ఇటీవల చిన్న పెట్టుబడిదారులు స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్ల టర్నోవర్ 57 శాతం ఎగసింది. ఇదే సమయంలో రిటైల్ విభాగంలో స్టాక్స్‌లో డెలివరీలు క్షీణించడం గమనార్హం. వెరసి రిటైలర్లు కొద్ది రోజులుగా దీర్ఘకాలిక వ్యూహంతో కాకుండా స్పెక్యులేటివ్ ఆలోచనతోనే ట్రేడింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. నగదు విభాగంలో సగటు పరిమాణం 57 శాతం పుంజుకోగా రోజువారీ షేర్ల డెలివరీలు వెనకడుగులో ఉన్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్-జూన్)లో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లలో నమోదైన అధిక ఆటుపోట్లకు ఇదొక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎఫ్‌పీఐల అండ గత రెండు వారాలలో మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. గత 9 ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. సెకండరీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నాయి. మరోవైపు కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలపై వెలువడుతున్న సానుకూల వార్తలు ఇన్వెస్టర్లకు సహకరిస్తున్నాయి. గత వారం యూరోపియన్ యూనియన్ 850 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, యూఎస్ ప్రభుత్వం సైతం మరో ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు వీటికి జత కలుస్తున్నాయి. బ్యాకింగ్ ఇలా బ్యాంకింగ్ రంగంలోని సంస్ధలు ప్రస్తావించదగ్గ స్థాయిలో ఫలితాలు ప్రకటిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితరాలు పటిష్ట పనితీరు చూపాయి. అయితే రుణ చెల్లింపులపై మారటోరియం అమలుతోపాటు.. మొండి బకాయిల(ఎన్పీఏలు) నమోదులో ఆలస్యానికి ఆర్బీఐ అనుమతించడం వంటి అంశాల కారణంగా బ్యాంకింగ్ ఫలితాలు ప్రోత్సాహకరంగా వెలువడుతున్నాయి. లాక్‌డవున్‌ల కారణంగా ప్రజలు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కోవిడ్-19 నేపథ్యంలో బీమా పాలసీలకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీ గుడ్ ప్రస్తుత కోవిడ్-19 అనిశ్చితుల్లోనూ ఐటీ రంగ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తున్నాయి. వ్యయాల తగ్గింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉత్పాదకత మెరుగుపడటం, సప్లై చైన్ డిజిటల్ వినియోగం వంటి అంశాలు కంపెనీలకు లబ్దిని చేకూర్చనున్నాయి. కొత్తగా కాంట్రాక్టులు కుదుర్చోవడం, ఆశావహ అంచనాలు ఈ రంగానికి ఊపునిస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత మౌలికసదుపాయాలను పెంచుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంది. పెరుగుతున్న డిజిటల్ వినియోగం సైతం ఐటీ రంగానికి అదనపు డిమాండ్‌ను కల్పిచే అవకాశముంది. -
తండ్రీకొడుకుల సట్టా దందా
సాక్షి, సిటీబ్యూరో: సింగిల్ నెంబర్ లాటరీని పోలిన జూదం సట్టాను సికింద్రాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న తండ్రీకొడుకుల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరితో పాటు పది మంది దళారుల్ని కూడా పట్టుకున్నారు. వారినుంచి నగదు, సట్టా సంబంధిత మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. నగరంలోని కాప్రా సర్కిల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జమాల్ అలియాస్ ఆర్కే నగర వ్యాప్తంగా సట్టా దందా నిర్వహిస్తున్నాడు. మార్కెట్లోని శివాజీ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు ఎం.కృష్ణమూర్తి, ఎం.శ్రీనివాస్ ఇతడి ఆధీనంలో పని చేస్తూ సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సట్టా నిర్వహిస్తున్నారు. వీరిద్దనూ సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిరుద్యోగులు, కార్మికుల్ని దళారులుగా ఏర్పాటు చేసుకున్నారు. సట్టాలో పందెం కాసేవాళ్ళ నుంచి ఫోన్ ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్న తండ్రీకొడుకులు వారికి సట్టా స్లిప్స్ అందించడం, నగదు వసూలు చేసుకురావడం తదితర వ్యవహారాలను దళారులకు అప్పగిస్తున్నారు. ఈ పని చేసినందుకు వీరికి రోజులకు రూ.200 నుంచి రూ.400 వరకు కమీషన్‌గా చెల్లిస్తున్నరు. ఈ గ్యాంగ్ సట్టాలో పెట్టుబడి పెడితే తక్షణం సొమ్ము రెట్టింపు అవుతుందంటూ అనేక మంది ఎర వేస్తూ ఈ దందాలోకి దింపుతున్నారు. సట్టా నెంబర్ తగిలిన వారికీ ఆ విషయం చెప్పకుండా దాచి పెడుతూ వారి సొమ్మునూ స్వాహా చేసి మోసం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ వలలో పడి సర్వం కోల్పోతున్న వారిలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు, ఆటోడ్రైవర్లు తదితరులే ఎక్కువగా ఉంటున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం బుధవారం వరుసదాడులు చేసింది. కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లతో పాటు దళారులు, పంటర్స్ అయిన దీపక్ జైన్, ఎం.రాజు, ఎం.అంజయ్య, వి.మోజెస్, వీపీ లోకనాథ్, ఎస్.సంతోష్‌కుమార్, జి.సోమయ్యల్ని అరెస్టు చేసింది. వీరి నుంచి సట్టా మెటరియ్తో పాటు రూ.14 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం మార్కెట్ పోలీసులకు అప్పగించింది. -
రెక్కలు ముడిచిన పసిడి రేటు
- నాలుగేళ్లలో కనిష్టస్థాయికి పతనం - అంతర్జాతీయ పరిణామాలే కారణం - కళకళలాడుతున్న బంగారం దుకాణాలు సాక్షి, రాజమండ్రి : ఒకప్పుడు మిడిసిపడి, మిన్నంటిన పసిడి ధర ఇప్పుడు క్రమక్రమంగా దిగి వస్తోంది. బంగారం మార్కెట్లో స్పెక్యులేటర్లు, స్టాకిస్టులపెద్ద ఎత్తున అమ్మకాలు సాగించడం, పారిశ్రామిక రంగం నుంచి కూడా పసిడికి డిమాండ్ బాగా తగ్గడం వంటి పరిణామాలతో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2010లో ధనత్రయోదశి సందర్భంగా 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి రూ.31,250 పలికింది. 2011, 2012 సంవత్సరాల్లో ధర రూ.31,150 నుంచి రూ.30,350 మధ్య కొనసాగింది. 2013 సంవత్సరాంతానికి 24 క్యారెట్ల పదిగ్రాముల ధర రూ.30,000 నుంచి రూ.31,500 మధ్య ఉంది. నెల రోజుల క్రితం ఏప్రిల్ 29న పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.27,280, 24 క్యారెట్ల ధర రూ.30,300 గా ఉంది. మే 29 గురువారం నాటికి 22 క్యారెట్ల బంగారం రూ.25,950కు, 24 క్యారెట్ల ధర రూ.27,500కు పడిపోయాయి. అంటే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1850 మేర, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.2,800 మేర పతనమయ్యాయి. అప్పటి లగ్గాలకూ ఇప్పుడే.. పెళ్లిళ్ల సీజన్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రెండు నెలల తర్వాత వచ్చే శ్రావణంలో జరిగే పెళ్లిళ్ల నిమిత్తం కూడా ఇప్పుడే బంగారం కొంటున్నారు. దీంతో బంగారం దుకాణాలు కళ కళలాడుతున్నాయి. జిల్లాలో సుమారు 2000 వరకూ చిన్నా, పెద్దా బంగారం దుకాణాలుండగా వీటిలో 50 వరకూ కార్పొరేట్ షాపులు. వీటన్నింటిలో రోజుకు రూ.రెండు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వ్యాపారం జరుగుతుంది. పండగలు, వివాహాల సీజన్లో రూ.పది కోట్ల వ్యాపారం జరుగుతుంది. మే మొదటి వారం నుంచీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా శక్తి మేరకు బంగారం కొనాలని ఆశిస్తున్నారు. కాగా కొందరు ధర ఇప్పుడు తగ్గినా భవిష్యత్తులో పెరుగుతుందన్న నమ్మకంతో, వ్యాపార దృక్పథంతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పట్లో పెరగకపోవచ్చు.. విదేశాల్లో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల్లో ఆర్థిక సంస్కరణల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం అయ్యాయి. ధరలు తగ్గుతుండడంతో మార్కెట్లో స్పెక్యులేటర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలతో మొదలైన తగ్గుదల మరింత కాలం కొనసాగవచ్చని, పసిడి ధర తిరిగి పెరగడానికి చాలా కాలం పట్టవచ్చని ఈ రంగంలో నిపుణులైనవారు అంచనా వేస్తున్నారు. -
ఏడాది కనిష్టానికి పుత్తడి ధరలు
ముంబై: పుత్తడి ధరల పతనం కొనసాగుతోంది. బుధవారం ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఏడాది కనిష్టానికి చేరాయి. స్పెక్యులేటర్లు, స్టాకిస్టులు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో పుత్తడి ధరలు పతనమయ్యాయి. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ తగ్గడం, స్పెక్యులేటర్ల నుంచి అమ్మకాలు వెల్లువెత్తడంతో వెండి ధరలు కూడా తగ్గాయి. అమెరికా తాజా ఆర్థిక గణాంకాలకు సాంకేతిక అమ్మకాలు తోడవడం, చైనాలో డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల హెడ్జింగ్ పెట్టుబడిగా పుత్తడి ప్రాభవం అంతర్జాతీయంగా మసకబారడంతో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.360 తగ్గి రూ.27,320కు, 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో క్షీణించి రూ.27,175కు చేరాయి. ఇక కిలో వెండి కూడా రూ.455 తగ్గి రూ.41,065కు తగ్గింది. కాగా నెమైక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.265.5 డాలర్లకు చేరింది. ఇది మూడున్నర నెలల కనిష్ట స్థాయి.