ఊరపందుల దాడిలో బాలుడి మృతి | Pigs Attack On A Boy In Malakpet | Sakshi
Sakshi News home page

ఊరపందుల దాడిలో బాలుడి మృతి

Published Wed, Apr 22 2020 1:41 AM | Last Updated on Wed, Apr 22 2020 4:03 AM

Pigs Attack On A Boy In Malakpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(మలక్‌పేట) : ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షవర్ధన్‌(3) అనే బాలుడిపై ఊరపందులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్‌లోని సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనిచేసుకునే కేశ్యానాయక్‌కు కుమార్తె, కుమారుడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సింగరేణి కాలనీలోని గుడిసెలో నివాసం ఉంటున్నాడు.

మంగళవారం సాయంత్రం కేశ్యానాయక్‌ మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌ గుడిసె ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఊరపందులు బాలుడిపై దాడి చేశాయి. గుడిసెలో ఉన్న తల్లిదండ్రులు బయటికి వచ్చేసరికి పందులు బాలుని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు వాటి వెంటపడటంతో విడిచి పెట్టి పారిపోయాయి. పందుల దాడిలో బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement