pigs attack
-
ఊరపందుల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్(మలక్‌పేట) : ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షవర్ధన్(3) అనే బాలుడిపై ఊరపందులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనిచేసుకునే కేశ్యానాయక్‌కు కుమార్తె, కుమారుడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గుడిసెలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కేశ్యానాయక్ మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్ గుడిసె ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఊరపందులు బాలుడిపై దాడి చేశాయి. గుడిసెలో ఉన్న తల్లిదండ్రులు బయటికి వచ్చేసరికి పందులు బాలుని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు వాటి వెంటపడటంతో విడిచి పెట్టి పారిపోయాయి. పందుల దాడిలో బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
వరాహ ‘దాడి’
శాయంపేట(భూపాలపల్లి): అరకొర దిగుబడులతో రైతులు సతమతమవుతుంటే వన్యప్రాణుల బెడద గోరుపై రోకలి పోటులా మారింది. గుంపులు గుంపులుగా వస్తున్న అడవి పందులు జిల్లాలో పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను తింటూ వరాహాలు చిందరవందర చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అడవుల దరిదాపుల్లో వ్యవసాయం రైతన్నలకు కత్తిమీద సాములా మారింది. వన్యప్రాణుల విహారంతో పంటలను రక్షించుకునేందుకు కర్షకులు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. అడవి పందుల సంచారంతో మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పెసర, పండ్ల జాతుల పంటలు ధ్వంసమవుతున్నాయి. జిల్లాలోని ఆత్మకూర్, పరకాల, శాయంపేట, దామెర, గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, సంగెం, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో కొండ, అటవీ, వాగుల ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో పందుల బెడద విపరీతంగా ఉంది. వాటి జోలికెళ్తే అటవీశాఖ అధికారులు కేసులు పెడతారమోనని భయపడుతున్నారు. ఒకదశలో రైతులపై దాడి చేసేందుకు ఎగబడుతున్నాయి. దీంతో రైతులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పంటలను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. వేల ఎకరాల్లో నష్టపోతున్న పంటలు.. వరంగల్ జిల్లాలోని 16 మండలాల వ్యాప్తంగా మొక్కజొన్న పంట ఈ ఏడాది 17,120 ఎకరాల్లో సాగు కాగా అరటి 312 ఎకరాల్లో, దోస 36 ఎకరాల్లో, టమాటా 430 ఎకరాలతో పాటు మొత్తంగా వివిధ కూరగాయ పంటలు 1930 ఎకరాల్లో సాగు అవుతుంది. అయితే అవి తినే కంటే ఎక్కువగా పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. సుమారు మొక్కజొన్న ఎకరం సాగు చేసేందుకు సుమారు రూ.18 వేలకు పైబడి పెట్టుబడి ఖర్చులు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో మొక్కజొన్న పంట పీచు దశలో ఉండడంతో పందులు దాడులకు ఎగబడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇతర జిల్లాల్లో మార్గాలు ఇలా.. అడవి జంతువుల నుంచి పంటలను పంటలను కాపాడేందుకు సంగారెడ్డి, మెదక్‌లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని చోట్ల రైతులే వారి ఆలోచనలతో చిన్నచిన్న పద్ధతులతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పంట చుట్టూ షా ఫ్లవర్‌ను ఏర్పాటు చే సుకుంటే వాటికి ముళ్లుండి పంటల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే పంట చుట్టూ కుళ్లిన కోడిగుడ్లు, వెంట్రుకలు, కారం పొడి చల్లడం వంటి చేస్తే అడవి పందుల బారి నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. కొంత మంది రైతులు పంట చుట్టు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ వాటికి కాపాలా రాత్రివేళల్లో రైతులు అక్కడే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్వగాన్ అనే కెమికల్‌ను తాడులో ముంచి పంట చుట్టూ కట్టేస్తే వాసనకు పంటల్లోకి పందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు రాలేదు.. గుట్టలు, వాగులు, అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్న పంటలపై అడవి పందులు దాడి చేస్తున్నట్లు వింటున్నాం. అయితే రైతులు ఇప్పటివరకు పంటలు నష్టపోయినట్లు రాత పూర్వకంగా ఫిర్యాదు రాలేదు. రైతులు కమ్యునిటీగా ఏర్పడి సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకుంటే పంటలపై అటవి జంతువుల దాడికి యత్నించకుండా పంటలను కాపాడుకోవచ్చు. –ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయాధికారి -
దారుణం: మహిళను ఈడ్చుకెళ్లిన పందులు
కావలి: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. పట్టణంలో ఓ మహిళపై పందులు దాడి చేసి కింద పడేసి కొరికేశాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రోడ్డుపై వెళుతున్న కొందరు ఈ ఘటన చూసి షాక్ అయ్యారు. స్థానికులు ఎంత తరిమినా పందులు బెదరలేదు. దీంతో రాళ్లతో కొట్టి ఆ మహిళను రక్షించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వైకుంఠపురం ప్రాంతానికి చెందిన షేక్ బీబీజాన్ అనే మహిళ ఇళ్లల్లో పనులు చేసుకుని జీవిస్తోంది. శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి గుడి పక్క వీధిలో నడిచి వెళ్తుండగా ఓ పందుల గుంపు ఆమెపై దాడి చేసింది. రెండు పందులు ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాయి. స్థానికులు గుర్తించి అతికష్టం మీద పందులను తరిమి వేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పందుల దాడిలో బీబీజాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. పందులు ఈ విధంగా దాడి చేయటం చిత్రంగా ఉందని.. ఎప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందులు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు. -
పందుల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలో పందుల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం ఉదయం పట్టణంలోని సెగిడి వీధిలో సోదరులైన మొకర హర్షవర్దన్ (8), మొకర వైభవ్ (7) ఇంటి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లగా... పందులు దాడి చేశాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు అవగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
పందుల దాడిలో బాలుడికి గాయాలు
అచ్చంపేట రూరల్(మహబూబ్‌నగర్ జిల్లా): అచ్చంపేట పట్టణంలోని జూబ్లీనగర్‌లో బుధవారం సాయంత్రం పందులదాడిలో ఏడాది బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. జూబ్లీనగర్‌కు చెందిన కృష్ణ, నిహారిక దంపతుల కుమారుడు ధనుష్(1)పై ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా రెండు పందులు దాడి చేశాయి. హుటాహుటిన బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా..14 కుట్లు పడ్డాయి. అచ్చంపేట ప్రాంతంలో పందుల బెడద ఎక్కువైందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పందుల దాడిలో చిన్నారి మృతి
దేవరకద్ర: ఓ చిన్నారిపై పందులు దాడిచేసి చంపేశాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్మమ్మ కూలీ పనులు చేసుకోవడంతో పాటు చెత్తకాగితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఐదుగురు సంతానం. బుధవారం చిన్నారి వెంకటేశ్వరమ్మ(5)ను గుడిసెలో చీర తో కట్టిన జోలెలో పడుకోబెట్టింది. మిగతా పిల్లలను అక్కడే ఉండమని చెప్పి దేవరకద్రలో చిత్తుకాగితాల సేకరణకు వెళ్లింది. అయితే, ఆ చిన్నారులు ఆడుకునేందుకు వెళ్లారు. ఇంతలో పందులు గుడిసెలోకి చొరబడి నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకుని లాక్కెళ్లిపోయాయి. కొద్దిదూరం వెళ్లిన తరువాత వెంకటేశ్వరమ్మ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
పందుల దాడిలో చిన్నారి మృతి
మహబూబ్ నగర్(దేవరకద్ర): పందులు దాడి చేయడంతో ఓ పసికందు దుర్మరణం చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..నర్సింహులు, కుర్మమ్మలు దంపతులు. వీరికి ఐదుగురు సంతానం. కాగా నాలుగు నెలల కిందట నర్సింహులు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం చెందాడు. దీంతో ఇంటి వాస్తులో దోషం ఉందని ఇంటి ఆవరణలోనే ఓ గుడెస వేసుకుని ఉంటున్నారు. అయితే ఐదు నెలలు వయస్సు ఉన్న పసికందును ఊయలలో వేసి తల్లి కుర్మమ్మ బయటకు వెళ్లింది. ఆ సమయంలో పందులు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. -
ఆదిలాబాద్‌లో అడవి పందుల దాడి
ఆదిలాబాద్(దహెగావ్): ఆదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలం కర్జీ గ్రామానికి చెందిన లంగరి నారాయణ, రౌతు శంకర్ అనే ఇద్దరు వ్యక్తులపై అడవి పందులు ఆదివారం ఉదయం 10 గంటలకు దాడి చేశాయి. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
పందుల దాడి : 25 మేకలు మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో మేకల మందపై గురువారం అర్ధరాత్రి ఊరపందులు దాడి చేశాయి. ఈ సంఘటనలో 25 మేకపిల్లలు మృతి చెందాయి. మేకపిల్లలు చనిపోవడంతో యజయానులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వపరంగా నష్టపరిహారం ఇప్పించాలని వారు కోరారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. (హయత్‌నగర్)