పందుల దాడిలో చిన్నారి మృతి | attack pigs In the Child killed | Sakshi
Sakshi News home page

పందుల దాడిలో చిన్నారి మృతి

Published Fri, Jul 17 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

పందుల దాడిలో చిన్నారి మృతి

పందుల దాడిలో చిన్నారి మృతి

దేవరకద్ర: ఓ చిన్నారిపై పందులు దాడిచేసి చంపేశాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్మమ్మ కూలీ పనులు చేసుకోవడంతో పాటు చెత్తకాగితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఐదుగురు సంతానం. బుధవారం చిన్నారి వెంకటేశ్వరమ్మ(5)ను గుడిసెలో చీర తో కట్టిన జోలెలో పడుకోబెట్టింది. మిగతా పిల్లలను అక్కడే ఉండమని చెప్పి దేవరకద్రలో చిత్తుకాగితాల సేకరణకు వెళ్లింది.

అయితే, ఆ చిన్నారులు ఆడుకునేందుకు వెళ్లారు. ఇంతలో పందులు గుడిసెలోకి చొరబడి నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకుని లాక్కెళ్లిపోయాయి. కొద్దిదూరం వెళ్లిన తరువాత  వెంకటేశ్వరమ్మ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement