పందుల దాడిలో చిన్నారి మృతి | child died in pigs attack | Sakshi
Sakshi News home page

పందుల దాడిలో చిన్నారి మృతి

Published Thu, Jul 16 2015 2:43 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

child died in pigs attack

మహబూబ్ నగర్(దేవరకద్ర): పందులు దాడి చేయడంతో ఓ పసికందు దుర్మరణం చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..నర్సింహులు, కుర్మమ్మలు దంపతులు. వీరికి ఐదుగురు సంతానం. కాగా నాలుగు నెలల కిందట నర్సింహులు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం చెందాడు. దీంతో ఇంటి వాస్తులో దోషం ఉందని ఇంటి ఆవరణలోనే ఓ గుడెస వేసుకుని ఉంటున్నారు. అయితే ఐదు నెలలు వయస్సు ఉన్న పసికందును ఊయలలో వేసి తల్లి కుర్మమ్మ బయటకు వెళ్లింది. ఆ సమయంలో పందులు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement