
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేట ఏరియా ఆసుపత్రి మందుబాబుల అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు ఆసుపత్రి ప్రాంగణంలో మందుబాబులు దర్శనమిస్తున్నారు. రాత్రుళ్లు ఏరియా ఆసుపత్రి బార్‌ను తలిపించేలా మారుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. సీసీ కెమరాలు ఉన్నా సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.
కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది కలిసి పార్టీలు చేస్తున్నట్లు సమాచారం. వీళ్లకు మద్దతుగా పార్కింగ్ సిబ్బంది తోడు అవ్వటంతో అర్ధరాత్రి అవ్వగానే ఆసుపత్రిలా కాకుండా మలక్‌పేట ఏరియా బార్‌లా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment