ప్రైవేటు ఆసుపత్రి
హైదరాబాద్ : మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. డెలివరీకి వచ్చిన మహిళ అకస్మాత్తుగా చనిపోవడంతో ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు..మిర్యాలగూడకు చెందిన ప్రవీణ్, బిల్గేట్ హాచార్ భార్య,భర్తలు. వారం క్రితం డెలివరీ నిమిత్తం మలక్‌పేట్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు.
బిల్గేట్ హాచార్ 4 రోజుల క్రితం బాబుని ప్రసవించింది. ఆరోగ్యంగా ఉన్న బిల్గేట్ హాచార్ బుధవారం చనిపోయిందని చెప్పడంతో బంధువులు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే రూ.10 లక్షలు కట్టించుకున్నారని, అకస్మాత్తుగా చనిపోయిందని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment