బోడుప్పల్(హైదరాబాద్‌సిటీ): ఆఫీసుకు వెళ్లి జీతం తెచ్చుకుంటానని వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈసంఘటన జరిగింది. ఎస్సై సుధాకర్ వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ ఇందిరానగర్‌కు చెందిన జె. స్వామి కుమార్తె రేణుక (18) నగరంలోని యశోద హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తుంది. ఈనెల 12న ఆఫీసుకు వెళ్లి జీతం తెచ్చుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.